ప్రభాస్‌తో ప్రేమలో లేను

‘ప్రభాస్‌, ఆయన హీరోయిన్‌ కృతి సనన్‌ ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు’.. రెండు రోజుల నుంచీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్త ఇది. ఇటీవల ‘భేడియా’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ‘కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ప్రస్తుతం దీపికతో షూటింగ్‌లో ఉన్నాడు’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృతి కూడా పాల్గొనడం గమనార్హం. ఇప్పుడు ప్రభాస్‌, దీపిక కలసి నటిస్తున్నారు కనుక కృతి మనసులో ఉన్న హీరో ప్రభాసే అని ఫిక్స్‌ అయిపోయింది సోషల్‌ మీడియా. ఆ హీరో పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడిన వరుణ్‌ఽ ధావన్‌ ఇలా హింట్‌ ఇవ్వడంతో అది వైరల్‌ అయింది. ఏకంగా ఓ హీరోనే ఈ మేటర్‌ను లీక్‌ చేయడంతో అది నిజమే అని నమ్మేసిన కొన్ని వెబ్‌సెట్స్‌ ఈ వార్తను వండి వడ్డించేశాయి. తను ఎవరెవరితోనో డేటింగ్‌ చేస్తున్నట్లు ఇంతకుముందు కొన్ని వార్తలు వచ్చినా కృతి పట్టించుకోలేదు. వాటి మీద కామెంట్‌ చేయలేదు. కానీ ప్రభా్‌సతో ప్రేమలో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై మాత్రం ఆమె పెదవి విప్పారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభా్‌సతో ప్రేమలో లేనని స్పష్టం చేశారు. ‘అది ప్రేమ కాదు.. అలా కానీ ప్రచారం కోసం చేసిందీ కాదు. మా ‘భేడియా’ హీరో ఆ టాక్‌ షోలో కొంచెం తమాషా చేశారు. అత్యుత్సాహంతో ఆయన మాట్లాడిన మాటలు నిజమేనని నమ్మేసి ఇలా రకరకాల వార్తలు పుట్టించేశారు. ఏదో ఒక రోజున వెబ్‌ సైట్స్‌ మా ఇద్దరి పెళ్లి తేదీని ప్రకటించకముందే ఈ వదంతులకు అడ్డు కట్ట వేయాలనుకుంటున్నాను. నిజం ఇదే నమ్మండి’ అని సోషల్‌ మీడియాలో కృతి పోస్ట్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *