పొంగులేటీకి రేణుకా అడ్డుపడుతున్నారా…

ఒకరు ఎస్‌ అంటే?ఇంకొకరు నో అనడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో ఉన్న సహజ లక్షణం. తెలంగాణ కాంగ్రెస్‌నే తీసుకుంటే? ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. పార్టీలోకి చేరికల విషయంలో కూడా ఇదే పెద్ద సమస్యగా మారిపోతోందట. ప్రస్తుతం కొందరు నాయకుల చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. వచ్చేస్తాం? విూ పార్టీలోకి అని ఆ నాయకులు అడుగుతుంటే?. లోపల ఉన్నవారు మాత్రం పేచీల విూద పేచీలు పెట్టేస్తున్నారట.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు? మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైపోయారట. పార్టీ పెద్దలతో సంప్రదింపులు కూడా ముగిశాయట. ఇద్దరిలో.. జూపల్లి చేరికకు అంతా ఓకే. తేదీ ఖరారు కావాల్సి ఉందట. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎపిసోడ్‌ మాత్రం టీవీ సీరియల్‌లా సాగుతూనే ఉందట. శ్రీనివాస్‌ రెడ్డి పార్టీలో చేరితే ఏడు అసెంబ్లీ సీట్లు అడుగుతున్నారని, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత నాదేనంటూ అధిష్టానానికి చెప్పారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వం కూడా అందుకు అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. అక్కడే జిల్లాకు చెందిన నేతలతో సమస్య వచ్చిందట.పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేరికపై ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి అభ్యంతరం చెప్తున్నారు. ఆయనకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అప్పగించడం ఏంటన్న మౌలిక ప్రశ్న లేవనెత్తుతున్నారామె. శ్రీనివాస్‌ రెడ్డి చేరిక వ్యవహారాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శి రోహిత్‌ చౌదరిలకు అప్పగించింది హైకమాండ్‌. అయితే..భట్టితో రేణుకా చౌదరికి ఉన్న వైరం కారణంగా శ్రీనివాస్‌ రెడ్డిని ఆమె వ్యతిరేకిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోందట. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్‌ ఇచ్చినా అభ్యంతరం లేదన్న రేణుకాచౌదరి ప్రస్తుతం అభ్యంతరం చెప్పడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేయాలన్న ఆలోచనలో భాగంగానే పొంగులేటిని అడ్డుకుంటున్నారా ? లేదంటే భట్టి విక్రమార్క?శ్రీనివాసరెడ్డి ఏకమైతే తనకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారా.. ? అన్న చర్చ జిల్లా పార్టీలో మొదలైందట. ఎవరు అడ్డుచెప్పినా..పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం మాత్రం శ్రీనివాస్‌ రెడ్డిని తీసుకోవాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది.పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేరికపై ఢల్లీి నాయకత్వానికి, పీసీసీకి క్లారిటీ ఉందట. ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఎటొచ్చీ?రేణుక చౌదరి నుంచి వచ్చిన అభ్యంతరాల విూదే చర్చ జరుగుతోంది. పొంగులేటి చేరిక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కి అదనపు బలం అవుతుందన్న అభిప్రాయం అధిష్టానానికి ఉందట. కేవలం జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందని కూడా ఢల్లీి నాయకత్వం అనుకుంటోందట. దీంతో అందర్నీ ఒప్పించి పొంగులేటిని రప్పించే బాధ్యతను రాష్ట్ర నాయకత్వం విూదే పెట్టిందట ఏఐసీసీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *