ఏపి దివాళా తీసినట్టేనా…

‘విభజన సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సిఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శి, మరో రెండు, మూడు శాఖల కార్యదర్శులు దిల్లీ వెళుతున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్నత స్థాయిలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అవసరం ఉన్నందున సిఎం కూడా అందుబాటులో ఉంటే బాగుంటుందని కోరామని, వ్యక్తిగత పర్యటనలు ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో సిఎం తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు.ఏపీ అధికారుల బృందం దిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడిరచారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం వసతి దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసిన స్థాయిలో నిధులు సమకూరకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే జరిగాయన్నారు. వీటిపై విూడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయని, అందుకే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఐదేళ్లు పరిపాలించమని చాన్సిస్తే మొత్తం నాశనం చేసేసి నాలుగేళ్లకే దివాలా ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఓ వైపు నిధులు లేవు.. ఆదాయం లేదు.. అప్పులు మాత్రం లక్షల కోట్లకు చేరాయి. మరో వైపు అధికారంలోకి రావడానికి చేసిన తప్పులు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిరది. ఆదుకోవాలని ఢల్లీికి చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల బృందాన్ని పంపుతున్నారు. దివాలా తీశామని పరోక్షంగా చెప్పిన సీఎస్‌ ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నెలలో ముందస్తుగా రూ. మూడు వేల కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి తెచ్చి రెండున్నర వేల కోట్ల వరకూ వేస్‌ అండ్‌ విూన్స్‌ వాడేసినా ..ఇప్పటికీ పెన్షనర్లకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మరో రూ. ఐదు వందల కోట్ల వరకూ బాకీ ఉంది. డబ్బులు లేవనే విద్యా దీవెన వాయిదా వేశామని సీఎస్‌ చెబుతున్నారు. ఇటీవల విూట నొక్కిన పథకాలకూ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో తమకు రావాల్సి న నిధుల కోసమంటూ సీఎస్‌ నేతృత్వంలో ఢల్లీి వెళ్తున్నారు. వారి టార్గెట్‌ కనీసం అప్పులకు పర్మిషన్‌ తెచ్చుకోవడమే. జగన్‌ ఢల్లీికి వస్తే ఇక షా, మోదీ కలవడం కష్టమే మరో వైపు సీఎం జగన్‌ ఢల్లీి వస్తే మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆయన వ్యక్తిగత అవసరాలు.. లేకపోతే అప్పులే ఎజెండా ఉంటున్నాయి. ప్రతీ నెలలో ఒకటి, రెండు సార్లు వస్తూండటంతో మోదీ, అమిత్‌ షా కూడా అపాయింట్‌ మెంట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదు. సీఎం స్థాయిలోనే సాధ్యం కాకపోతే ఇక సీఎస్‌ చేసేదేవిూ లేదు. కేసులు వేగంగా చుట్టుముడుతూండటంతో ? వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిరది. ఓ వైపు బిగబిట్టిన బిల్లుల చెల్లింపులు.. భయపెడుతున్నాయి. సొంత పార్టీ కి చెందిన వారు బహిరంగంగా చెప్పుతో కొట్టుకుంటున్నారు. హైకోర్టు ఈ మధ్య బిల్లులు చెల్లించమని దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో కాస్త వేగం తగ్గించడంతో.. కోర్టు ధిక్కరణ కేసుల్లో చెల్లింపులు తగ్గాయి?.కానీ కాంట్రాక్టర్లు మాత్రం చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏవిూ చేయలేని పరిస్థితి వచ్చిందని? ఇక దివాలా తీయడమే మిగిలిందని.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాలపై అవగాహన ఉన్న వారు సెటైర్లు వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *