మే…మండే సూరీడే…

పది రోజుల క్రితం వరకూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు ఇబ్బంది పెట్టాయి. ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా కూలర్‌లు, ఏసీల విక్రయాలు పెరిగాయి. ఆ తరవాత ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిరది అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అయితే…సూరీడు మరోసారి మండి పడే అవకాశాలున్నాయని అంటున్నారు ఎఓఆ అధికారులు. మే నెలలో మరోసారి వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు. అంతే కాదు. ఈ కారణంగా మే లో పవర్‌ కట్స్‌ కూడా ఉంటాయని వెల్లడిరచారు. మొత్తం విద్యుత్‌ నెట్‌వర్క్‌పై ఇది ప్రభావం చూపించే ప్రమాదముందని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లోనే కాదు. ఆసియాలోని చాలా దేశాల్లో గతేడాది కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడిరది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఎకానవిూ కూడా డల్‌ అవుతోంది. ఈ ప్రభావం ట్రేడిరగ్‌పై పడుతోంది. వాతావరణం మళ్లీ సాధారణానికి వచ్చేంత వరకూ రిస్క్‌ తీసుకోవద్దని భావిస్తున్నారు కొందరు ట్రేడర్స్‌. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం…థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. చైనాలోనూ ఇదే పరిస్థితులున్నాయి. యున్నాన్‌ ప్రావిన్స్‌లో కరవుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వచ్చే వర్షాకాలంలో ఎల్‌ నినో ఏర్పడే ప్రమాముందనీ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే కాదు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ కరవు తప్పదని తేల్చి చెబుతున్నారు. అయితే..భారత్‌లో మాత్రం ఈ సారి వానలు బాగానే కురుస్తాయని వివరిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయని, వేడి కారణంగా పలు వ్యాధులు వచ్చే అవకాశముందని కేంద్రం వెల్లడిరచింది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమవుతుంది.. తీవ్ర వడగాడ్పులతో పాటు అకాల వర్షాలు కురుస్తుండడం రైతులకు ఇబ్బందిగా మారింది. భూతాపం ప్రభావంతో కొన్నాళ్లుగా వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గడిచిన మూడేళ్ల పాటు పసిఫిక్‌ మహాసముద్రం లో కొనసాగిన లానినా బలహీనమై ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఇది కొద్దిరోజుల్లో ఎల్‌నినో దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆ ప్రభావం భారత్‌ పై ఉంటుందని సమాచారం. మరోవైపు బంగాళాఖాతం, అరేబియా సముద్రం లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీని కారణంగా ఈ నెల తొలి వారం నుంచి దేశంలో ఎండల తీవ్రత పెరిగింది.అటు బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు, ఉత్తరాది నుంచి వచ్చే పొడిగాలుల కలయికతో విండ్‌ డిస్‌కంటిన్యూటీ ఏర్పడిరది. దీని కారణంగానే వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఈదురుగాలులు, పిడుగులు, అక్కడక్కడా వడగళ్లతో వర్షాలు పడుతున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరిస్తే రెండు, మూడు గంటల వ్యవధిలోనే తీవ్ర విధ్వంసం సంభవిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు ఈ వాతావరణ మార్పులు రైతుల పాలిట శాపంగా మారాయి. అకాల వర్షాలతో గత నెలలోనే రూ.కోట్ల పంట నష్టం వాటిల్లిందని అంచనా.మార్చి 1వ తేదీనే ఇందుకు సంబంధించిన సూచనలు చేసింది. ఈ తరహా వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హ్యూమన్‌ హెల్త్‌ లో భాగంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరిట ఈ లేఖలు పంపింది. పట్టణాలు, జిల్లాల్లోని ఆరోగ్య విభాగాలు ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే వ్యాధులను కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పింది. మరోసారి అందుకు తగినట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ వర్కర్లు సిద్ధంగా ఉండాలని వెల్లడిరచింది. ఫ్లూయిడ్స్‌, ఐస్‌ప్యాక్‌లు, ూఖీూలు రెడీగా ఉంచుకోవాలని సూచించింది. తాగునీరు కూడా సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. వేసవిలో ఎక్కువ శాతం మంది ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడుతుంటారు. దానికి కారణం వాతావరణంలో వేడి పెరగడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. నిల్వ ఉండదు. ఆ విషయం తెలియని చాలా మంది నిల్వ ఉన్న ఆహారాన్ని తిని ఫుడ్‌ పాయిజనింగ్‌ బారిన పడుతుంటారు. అందుకే వేసవిలో నిల్వ ఆహారాన్ని తినేముందు ఓసారి పాడైందో లేదో చెక్‌ చేసుకుని తినండి. కాస్త వాసన వచ్చినా దాన్ని తినకపోవడమే మంచిది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *