లెఫ్ట్‌ పార్టీల అడుగులు ఎటు

హైదరాబాద్‌, జూలై 4
తెలంగాణ కమ్యూనిస్ట్‌లు దింపుడుకల్లం ఆశల్లో ఉన్నారా? బీఆర్‌ఎస్‌ నాయకత్వం తమను పూచిక పుల్లల్లా చూస్తోందన్న ఆవేదనతో రగిలిపోతున్నారా? లెఫ్ట్‌ పార్టీల తదుపరి అడుగులు ఎటు పడబోతున్నాయి? ఎవరో ఒకరితో అంటకాగక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీవైపు చూస్తున్నారు?తెలంగాణ కమ్యూనిస్టులు పొలిటికల్‌ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారు. ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోవడం ఒక సమస్య అయితే? ఎటు వెళ్తే ఏమవుతుందోనన్న భయం కూడా వాళ్ళని వెంటాడుతోందట. మునుగోడు ఉప ఎన్నిక వరకు కారు వెనకే పరుగులు పెట్టారు కమ్యూనిస్టులు. సీఎం కేసీఆర్‌ని పొగిడేపనిని గట్టిగానే చేసేశారు. కానీ? ఆ తర్వాత సీన్‌ సితారైందట. ప్రజా సమస్యలపై కేసీఆర్‌తో చర్చిస్తామని నాడు ఢంకా బజాయించి చెప్పిన కామ్రేడ్స్‌కు అసలు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడం లేదట. ఈ వన్‌సైడ్‌ లవ్‌ ఇంకెన్నాళ్ళని అసహనంగా ఉన్నారట ఎర్రన్నలు. అందులోనూ.. సీపీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈసారి ఎలాగైనా? తెలంగాణ అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్న కమ్యూనిస్టులు అధికార పార్టీతో కలిసి పనిచేస్తే? అంతో ఇంతో ప్లస్‌ అవుతుందని భావించారు. కానీ? మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌ దరి చేరనీయలేదట. ఇక విూదట మా బలమేంటో చూపిస్తామని కూడా ఆ మధ్య ప్రకటించారు. అయినా అట్నుంచి ఏ మాత్రం రియాక్షన్‌ లేకపోవడంతో అసలేం జరుగుతోందో అర్ధంగాని గందరగోళంలో ఉన్నారట లెఫ్ట్‌ నాయకులు. ఎన్నాళ్ళని ఒంటి చేతి చప్పట్లు కొడతాం? పదే పదే వెంట పడితే ఇంకా చులకనైపోయామన్న ఉద్దేశ్యంతో పునరాలోచనలో పడ్డారట తెలంగాణ కామ్రేడ్స్‌. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సొంతగా పనిచేసుకోలేక? ఎవరితో కలవాలో క్లారిటీ రాక వ్యవహారం మొత్తం గజిబిజిగా ఉందట.ఇక ఆలశించిన ఆశాభంగం అనుకుంటూ? బీఆర్‌ఎస్‌ కాదంటే? కాంగ్రెస్‌కు దగ్గరవ్వాలన్న ఆలోచన మొదలైనట్టు తెలిసింది. పైగా కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడి కాంగ్రెస్‌లో కూడా జోష్‌ పెరగడంతో కామ్రేడ్స్‌కి కాస్త ధైర్యం వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆయన్ని ఖమ్మం నుంచి పోటీ చేయించండి మేం సపోర్ట్‌ చేస్తాం?కొత్తగూడెంలో విూరు సపోర్ట్‌ చేయండి మేం గెలుస్తామని సీపీఐ కీలక నాయకుడొకరు టి కాంగ్రెస్‌ పెద్దలకు ప్రతిపాదించినట్టు తెలిసింది. అంటే? బీఆర్‌ఎస్‌ వైఖరి ఇలాగే ఉంటే? ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ని సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోందన్నమాట. పొత్తులపై మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చేసిన కామెంట్స్‌ తొందరపాటు చర్యేనన్న అభిప్రాయంతో కొందరు సీపీఐ నేతలు ఉన్నారట. ఆ పార్టీ ఇప్పటివరకు రాజకీయ తీర్మానాన్ని కూడా ఆమోదించ లేదు. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటోందట. మొత్తంగా చూస్తే? కమ్యూనిస్టులు ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. స్నేహ హస్తం ఇస్తారనుకున్న అధికార పార్టీ నేతల నుంచి సహకారం సంగతి తర్వాత? కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదన్న ఆవేదన వారిలో బలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీతో వ్యవహారం ఎలా ఉంటుందోనన్న భయాలు కూడా ఉన్నాయట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *