యుగాంతం కథతో ఫన్‌ ఎంటర్‌టైనర్‌

కార్తికేయ గుమ్మకొండ హీరోగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘బెదురులంక 2012’. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్‌ దర్శకుడు. హీరో నాని బుధవారం ఈ చిత్రం ఫస్‌ లుక్‌ని, మోషన్‌ పోస్టర్‌ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ‘ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీస్తున్న చిత్రం ఇది. పూర్తి వినోద భరితంగా ఉంటుంది. షూటింగ్‌ చివరి దశకు చేరుకొంది. కొత్త కాన్సె్‌ప్టతో వస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. డ్రామా ప్లస్‌ కామెడీ అంశాలతో రూపుదిద్దుకొంటున్న చిత్రం ఇదని దర్శకుడు క్లాక్స్‌ చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారని చెప్పారు. స్ట్రాంగ్‌ కంటెంట్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంటుందని దర్శకుడు క్లాక్స్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *