నిధులివ్వని రాష్ట్రాలు…ముందకు సాగని కేంద్ర పథకాలు

పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల లొల్లి బయట పడుతోంది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పదేపదే ప్రకటిస్తుంటే.. వేల కోట్లు ఇస్తున్నామని, వాటిని వినియోగించుకోవడంపైనా తప్పు తెలంగాణదే అనే విధంగా బీజేపీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పథకాలపై ప్లారమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ వివరాలు సేకరించుకుంటోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల లొల్లిని అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మారింది.ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా గ్రావిూణ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ పథకంపైన ఎంపీ రేవంత్‌? రెడ్డి కూడా వివరాలడిగారు. పీఎంఏవై పథకానికి సంబంధించి తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తున్నారనే అంశంపై పార్లమెంట్‌లో ప్రశ్నించడంతో.. దానిపై కేంద్రం వివరాలిచ్చింది. పీఎంఏవై గ్రావిూణ పథకంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావడం లేదని వెల్లడిరచింది. కానీ, 2016?17లో రూ. 142.63 కోట్లు, 2017?18లో 48.16 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని, కానీ, వాటిని వినియోగించలేదని, ఆ తర్వాత 2018?19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022?23 ఆర్థిక సంవత్సరం వరకు రూపాయి ఇవ్వలేదని వెల్లడిరచింది. వాస్తవంగా 2016 నుంచి 2018 ఆర్థిక సంవత్సరాల వరకు 70,674 ఇండ్లను పీఎంఏవై గ్రావిూణ కింద ఇచ్చామని, వీటికి తొలి విడుతలో రూ. 190.79 కోట్లు విడుదల చేశామని, కానీ, తెలంగాణ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్‌ చేయడం లేదని ప్రకటించింది.ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ కింద తెలంగాణకు విడుదల చేసిన నిధులు, ఇండ్లపై ఎంపీ ఉత్తమ్‌ మరోసారి పార్లమెంట్‌ క్వశ్చన్‌ అవర్‌లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర గృహ నిర్మాణ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌? మంత్రి కౌశల్‌ కిషోర్‌ సమాధానమిచ్చారు. 2019 నుంచి 2022 వరకు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 2,47,079 ఇండ్లు మంజూరు చేశామని, వీటిలో 89,168 ఇండ్లు పూర్తి చేశామని, ఇంకా 1.51 లక్షల ఇండ్లను ప్రారంభానికి సిద్ధంగా ఉంచామని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ లెక్కన అర్బన్‌లో రాష్ట్ర ప్రభుత్వ డబుల్‌ బెడ్‌ రూం కాదని.. ఈ పథకం తమ నిధులతోనే జరుగుతుందనే సమాచారం ఇచ్చింది.తాజాగా నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లోనూ తెలంగాణకు భారీగా నిధులిస్తున్నట్లు కేంద్రం వెల్లడిరచింది. ఈ స్కీం కింద తెలంగాణకు రూ.53.93 కోట్లు ఇస్తే.. అందులో కేవలం రూ.27.77 కోట్లు మాత్రమే వినియోగించుకున్నారని, దీంతో పాటుగా ఇదే స్కీం కింద పలు ప్రొగ్రాం కోసం రూ. 52.76 లక్షలు ఇస్తే ఇంకా వినియోగంపై స్పష్టత లేదని ప్రకటించారు.మరోవైపు ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులపైనా కేంద్రం నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు నోటీసులిచ్చారు. ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి రూ.11 వేల కోట్లకు యుటిలైజేషన్‌? సర్టిఫికెట్లు ఇవ్వలేదని, ఇప్పుడు వాటి యూసీలు, అడిట్‌ రిపోర్టులు ఇస్తేనే ఆర్థిక సంఘం మలి విడుత నిధులు జారీ చేస్తామని సూచించింది. దీంతో వీటి సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది. గతంలో చేసిన పనులకు చెక్కులు ఇచ్చి.. వాటిని ఆర్థిక సంఘం నిధుల్లో కలిపేస్తోంది. ఈ చెక్కులు ఎప్పుడు క్లియర్‌ చేస్తారో కూడా ఇంకా చెప్పడం లేదు. అటు కేంద్రం కచ్చితంగా యూసీలు, అడిట్‌? రిపోర్టులు అడుగుతుండటం, మలి విడుత నిధులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలంగాణను స్పెషల్‌గా తీసుకున్న సెంట్రల్‌.. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటకు తీస్తోంది. ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా స్టేట్‌ గవర్నమెంట్‌ స్కీంలపై వివరాలడుగుతోంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఇచ్చే నిధులు, వాటి వినియోగాన్ని బహిర్గతం చేయడంతో పాటుగా రాష్ట్ర నేతల చేతులకు ఆయుధాలిస్తోంది. కేంద్రం నిధులిచ్చినా.. రాష్ట్రం వాడటం లేదని చెప్పేందుకు ప్లాన్‌? వేస్తోంది.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతగా లేక ఉద్యోగుల జీతాలు సాగదీస్తున్న నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపై కాంగ్రెస్‌ సైతం దృష్టి సారించింది. అయితే, రాష్ట్రంలో విపక్షాలకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నిధుల వివరాలు అడిగినా.. అధికారుల నుంచి రిప్లై ఉండటం లేదు. దీంతో రాష్ట్రంలోని పథకాల అమలు, కేంద్రం నుంచి వస్తున్న నిధులపై పార్లమెంట్‌ వేదికగా ప్రయోగాలు చేస్తోంది. ఇరిగేషన్‌, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌, వ్యవసాయం, సంక్షేమ వంటి శాఖలకు కేంద్రం నుంచి ఇచ్చేదెంత.. రాష్ట్రం ఖర్చు చేసేదెంత.. అనే అంశాలను పార్లమెంట్‌లోనే ప్రశ్నిస్తోంది. దీనికి సెంట్రల్‌ నుంచి కొంత సమాధానం వస్తోంది. ఈ నిధుల సమాచారం రెండు పార్టీలకు అక్కరకు వచ్చేలా వ్యూహం వేస్తున్నట్లు పొలిటికల్‌ సర్కిళ్లలో టాక్‌

Leave a comment

Your email address will not be published. Required fields are marked *