నంద్యాలలో కిలేడీ..

కర్నూలు, జూలై 3
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో.. పక్కా స్కెచ్‌తో భర్తని చంపింది ఓ మహిళ. తన ప్రియుడి సహకారంతో మరో మహిళను రంగంలోకి దింపి, భర్తకే వల వేసి, ఒక ప్రాంతానికి రప్పించి.. చివరికి భర్తని పొట్టన పెట్టుకుంది. ఆపై తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని నాటకమాడుతూ, కేసుని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, భార్యే అసలు హంతకురాలని తేల్చారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన రాము అలియాస్‌ వెంకటన్న (42)కు భార్య శ్యామల, కొడుకు శరత్‌చంద్ర(9) ఉన్నారు. వెంకటన్న మెడికల్‌ షాపు నిర్వహిస్తుండగా.. భార్య ఇంటివద్దే చీరల వ్యాపారం చేస్తోంది. కొంతకాలం క్రితం శ్యామలకు బేతంచెర్లకు చెందిన కుమారస్వామితో పరిచయం ఏర్పడిరది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అది వివాహేతర సంబంధంగా మారింది. తన భర్తకు తెలియకుండా కుమారస్వామితో శ్యామల రాసలీలలు గుట్టుగా కొనసాగించింది. అయితే.. వీరి బంధం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఎలాగోలా వెంకన్నకు వీరి బండారం తెలిసింది. ఇక అప్పటి నుంచి వెంకటన్న తన భార్యని వేధింపులకు గురి చేయడం స్టార్ట్‌ చేశాడు. కుమారస్వామికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు.అయితే.. ప్రియుడ్ని వదిలి ఉండలేకపోయిన శ్యామల, అడ్డుగా ఉన్న తన భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుమారస్వామికి చెప్పింది. అప్పుడు వెంకటకన్నను ట్రాప్‌ చేసి, చంపాలని ప్లాన్‌ చేశారు. ఒక మహిళని రంగంలోకి దింపారు. ఆమెతో ఫోన్‌ చేయించి, కుమారస్వామిని ముగ్గులోకి దింపారు. ఈనెల 19న ఆ మహిళతో ఫోన్‌ చేయించి, భాస్కరాపురం గ్రామ సవిూపంలోని కేసీ కెనాల్‌ గట్టు వద్దకు రావాలని వెంకటన్నని పిలిపించారు. దాంతో.. అతడు వెంటనే అక్కడికి బైక్‌పై వెళ్లాడు. వెంకటన్న ఆ ప్రాంతానికి చేరుకోగానే.. తన నలుగురు స్నేహితులతో కలిసి కుమారస్వామి అతడ్ని చంపేశాడు. వెంకటన్న గొంతుకు బైక్‌ తీగ బిగించి హతమార్చారు. అనంతరం ముఖం గుర్తు పట్టకుండా రాళ్లతో మోది, అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇలా తన భర్తని చంపించిన తర్వాత.. శ్యామల తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకేవిూ ఎరుగనట్టుగా పోలీసుల ముందు నాటకమాడిరది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే.. శ్యామల మరీ ఓవర్‌గా ప్రవర్తించడంతో, పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో.. ఆమె కోణం నుంచి కేసుని విచారించడం మొదలుపెట్టగా, శ్యామలనే తన భర్త వెంకటన్నని చంపినట్టు తేలింది. ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే చంపేశానని ఒప్పుకుంది. ఆమెతో పాటు కుమారస్వామి, అతని నలుగురి స్నేహితుల్ని అరెస్ట్‌ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *