కరోనా వైరస్ జీవాయుధమే: వ్యూహాన్ పరిశోధకులు

కరోనా మహమ్మారి(Corona) సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. కరోనా వైరస్‌ను బయోవెపన్‌గా (Bioweapon) చైనా ప్రయోగించిందని అమెరికాలాంటి పలు దేశాలు అప్పట్లో ఆరోపించాయి. ఆ తర్వాత చైనాలోని వుహాన్ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందేనని.. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. ఇంటర్నేషన్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ జెంగ్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం వెల్లడించారు.

కరోనా వైరస్ తయారీపై మానవ హక్కుల కార్యకర్త వ్యూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకుడు చావో తనతో ఏం చెప్పాడో ఓ వీడియోను విడుదల చేసింది జెన్నిఫర్ జెంగ్.

చావో షావోతో పాటు మ‌రో ప‌రిశోధ‌కుడు షాన్ చావో కూడా వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌లో ప‌నిచేశారు. త‌మ బాస్‌లు త‌మ‌కు నాలుగు ర‌కాల వైర‌స్‌లు ఇచ్చార‌ని, దాంట్లో ఏ ర‌క‌మైన వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుందో ప‌రీక్షించాల‌ని ఆదేశించిన‌ట్లు చెప్పాడు. వీలైనంత మందిని సోకే సామ‌ర్థ్యం ఏ వైర‌స్‌కు ఉందో ప‌రీక్షించిన‌ట్లు ఆ ప‌రిశోధకుడు తెలిపాడు. మ‌నుషుల‌తో పాటు ఇతర జీవాల‌కు ఏ వైర‌స్ తొంద‌ర‌గా సోకుతుందో టెస్ట్ చేసిన‌ట్లు చెప్పాడు. క‌రోనా వైర‌స్‌ను ఓ జీవాయుధంగా చైనా డెవ‌ల‌ప్ చేసింద‌ని చావో షావో పేర్కొన్నాడు.

2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని, పరిశోధనల కోసం మరికొందర్ని ఇతర దేశాలకు పంపించినట్లు చావో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చేసేందుకే తమ సహచరులను ఇతర దేశాలకు పంపి ఉండొచ్చని చావో అనుమానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *