డిజిటల్‌ క్యాంపెయిన్‌ కు బ్రహ్మాండమైన స్పందన

ఆంధ్రప్రదేశ్‌ లో రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం, జనసేన ప్రారంభించిన డిజిటల్‌ క్యాంపెయిన్‌ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. చెత్త రోడ్లు.. చెత్త సీఎం అంటూ తెలుగుదేశం, గుడ్‌ మార్నింగ్‌ సిఎం సర్‌ అంటూ జనసేన రోడ్ల దుస్థితిపై డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించిన సంగతి తెలసిందే. వారి క్యాంపెయిన్‌ కు మద్దతుగా నెటిజనులు సైతం ఆంధ్రప్రదేశ్‌ రోడ్ల పరిస్థితిపై సామాజిక మాధ్యమంలో వ్యంగ్య కార్టూన్లు, వ్యాఖ్యలతో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆ పోస్టులన్నీ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. సామాన్య జనులు సైతం రోడ్ల దుస్థితిపై వాస్తవ పరిస్థితికి సామాజిక మాధ్యమం అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. : ఏపీలో ప్రస్తుతం యుద్ధం నడుస్తుంది.. యుద్ధం అంటే ఏదో శత్రు దేశాల మధ్య కాదండోయ్‌.. సోషల్‌ విూడియా వేదికపై జనసేన వర్సెస్‌ వైసీపీ సపోర్టర్స్‌ మధ్య.. ఇరువురు రోడ్ల విూద పెడుతున్న పోస్టులు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. అటు వైసీపీ.. ఇటు జనసేన సోషల్‌ విూడియా టీమ్స్‌ అటాకింగ్‌ పొలిటికల్‌ ఫైట్‌ చెయ్యడంలో ఎప్పుడూ కూడా స్పీడ్లో ఉంటాయి. ఎప్పుడు ఏ నాయకుడు టంగ్‌ స్లిప్‌ అయినా వెంటనే కౌంటర్‌ అటాకింగ్‌ చేసుకుంటాయి. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్‌, ఇన్‌స్టా,ఫేస్బుక్‌ వేదికగా గుడ్‌ మార్నింగ్‌ వెర్సెస్‌ బ్యాడ్‌ మార్నింగ్‌ జోరుగా నడుస్తుంది.జూలై 15 ఉదయం 7 గంటల 45 నిముషాలకు చఉనీనీటఓనీతీనితినిణఅఓూతితీ అనే డిజిటల్‌ క్యాంపెయిన్‌ని పవన్‌ కళ్యాణ్‌ లాంఛనంగా మొదలు పెట్టారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విట్టర్‌లో ఒకటి పోస్టు చేశారు. ఆ వీడియోలో కోనసీమ జిల్లా కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితిని క్లియర్‌గా చూపిస్తూ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు.జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ పోస్ట్‌ తరువాత జన సైనికులు ఎక్కడికక్కడ గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో సెటైరిక్‌గా పోస్టులు పెట్టడంలో స్పీడ్‌ పెంచారు. వైసీపీ పార్టీని ఒక్కమాటంటే ఉతికి పడేసే వైసీపీ సోషల్‌ విూడియా యాక్టివిస్టులు.. హ్యాష్‌ ట్యాగ్‌తో సీఎంను టార్గేట్‌ చేస్తే ఊరుకుంటారా..? వారు కూడా వెంటనే రియాక్ట్‌ అయ్యారు. వైసీపీ సైనికులు సైతం రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు.. సాఫీగా ప్రయాణం చేస్తున్న వీడియోలు తీసి ట్విట్టర్లో కౌంటర్‌ అటాక్‌ మొదలు పెట్టారు.గతేడాది శ్రమదానం పేరుతో రహదారుల వద్ద నిరసన వ్యక్తం చేసిన జనసెన టీమ్స్‌.. ఇప్పుడు గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌ అంటూ సోషల్‌ విూడియాలో హోరెత్తిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో అయితే గుంతలకు వైసీపీ రంగులు వేసిన ఫోటోలు పెట్టారు.గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌ అంటున్న పవన్‌ కల్యాణ్‌కు.. బ్యాడ్‌ మార్నింగ్‌ దత్తపుత్రుడు అంటూ సోషల్‌ విూడియాలో హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కావాలంటే వచ్చి చూసుకో అంటూ ఫోటోలు పోస్టు చేస్తున్నారు. వర్షాలకు రోడ్లు గుంతలు పడటం సాధారమెనని వరద వచ్చిన గోదావరి జిల్లాలో ఫోటోలు తీయడం కాదు.. తమ ప్రాంతానికి వస్తే బాగున్న రోడ్లు చూపిస్తామంటూ వైసీపీ సోషల్‌ విూడియా సపోర్టర్స్‌ కామెంట్లు చేస్తున్నారు. బ్యాడ్‌ మార్నింగ్‌ దత్తపుత్రుడు అనే హ్యాట్‌ ట్యాగ్‌తో పోస్టులు పెడుతూ కౌంటర్‌ అటాక్‌ చేస్తున్నారు.ఇలా వీడియోలే కాదు రోడ్ల నాడు ? నేడు అని ఫోటోలు వైసీపీ పెడుతుంటే.. జనసేనా కూడా అదే స్థాయిలో కౌంటర్‌ అటాక్‌ చేస్తుండడంతో సోషల్‌ విూడియా వేదికపై ఏపీ పొలిటికల్‌ వార్‌ జరుగుతుంది. ఎదిఏమైనా ఈ గుడ్‌ మార్నింగ్‌ వెర్సెస్‌ బ్యాడ్‌ మార్నింగ్‌ రాజకీయాలో ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.ఆంధ్రప్రదేశ్‌ లో రోడ్లు అద్దాల్లా ఉన్నాయని అధికార పార్టీ కొన్ని ఫొటోలు పెట్టి సొంత భుజాలను తడుముకుంటోంది. అదే సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాల విమర్శలపై మండి పడుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఏపీలోని రోడ్ల బండారాన్ని సామాజిక మాధ్యమం సాక్షిగా బట్టబయలు చేసేశారు. రోడ్ల పరిస్థితిపై వ్యంగ్య బాణాలు సంధిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. చూడగానే ఆకట్టుకునే కార్టూన్లతో సామాజిక మాధ్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై నెటిజన్ల పోస్టులు ఇప్పడు సమాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. దీనిపై సామాన్యులు సైతం స్పందిస్తున్నారు. పెద్ద పెద్ద గోతులతో ఛిద్రమైన రహదారుల చిత్రాలు, వీడియోలకు బలమైన పంచ్‌ డైలాగులతో… సినిమాలలోని చిత్రాలతో కూడిన మైమ్‌ లను జోడిరచి నెటిజన్లు చేస్తున్న పోస్టులు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. గుడ్‌ మార్నింగ్‌ సీఎం సర్‌ అంటూ జనసేన ప్రారంబించిన హాష్‌ ట్యాగ్‌ డిజిటల్‌ క్యాంపైన్‌ విపరీతంగా పాపులర్‌ అయ్యింది. అలాగే తెలుగుదేశం సోషల్‌ విూడియా వేదికగా చేస్తున్నప్రచారానికీ ప్రజా స్పందన అమోఘంగా ఉంది. రాష్ట్ర రహదారులపై రాజమహేంద్ర వరంలో ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో చిన జీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలూ సోషల్‌ విూడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి.అలాగే ఏప్రిల్‌ 19న మంత్రి కేటీఆర్‌ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలకు నొచ్చుకున్న వైకాపా నేతలు తెలంగాణలో రోడ్లు, కరెంట్‌ పరిస్థితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఎంతగా ఎదురుదాడి చేసినా కేటీఆర్‌ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలకు వచ్చినంత స్పందన వైసీపీ నేతల విమర్శలకు రాలేదు. అసలు వైసీపీ విమర్శలను రెండు రాష్ట్రాలలో కూడా పట్టించుకున్న నాథుడే లేకపోయాడు.వ్యాఖ్యలను బేస్‌ గా చేసుకుని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వ్యంగ్య వైభోగం సామాజిక మాధ్యమంలో బ్రహ్మాండంగా పేలుతోంది. జగన్‌ నిర్వాకం వల్ల ఏపీలో కార్లు, బైకుల మెకానిక్‌ లు బాగుపడుతున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో జులై 15నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదు అంటూ జగన్‌ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *