విలవిలలాడిన చెన్నై…

మిచౌంగ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మిగ్జామ్‌’ తుపాను చెన్నై నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం అయింది. నగరంలో ఎటు చూసినా నీరే. దీనిపై తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ స్పందించారు. నగరంలో గత 70`80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని వెల్లడిరచారు. తనకు తెలిసినంతవరకు చెన్నై ఇంతటి భారీ వర్షాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని తెలిపారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, తుపాను తీవ్రత దృష్ట్యా ఆ చర్యలు సరిపోలేదని వెల్లడిరచారు. తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందని కేఎన్‌ నెహ్రూ అంగీకరించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ద్వారా 3 లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించామని చెప్పారు. సహాయ చర్యల కోసం 5 వేల మంది సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి రప్పించామని వెల్లడిరచారు. కాగా, చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో మూడు విమానాలను బెంగళూరుకు మళ్లించారు.

వరద నీరు ప్రవేశించడంతో 14 రైల్వే సబ్‌ వేలను అధికారులు మూసివేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్‌ హైకోర్టు ప్రకటించింది. అటు, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయిభారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడుపై తుఫాన్‌ ప్రభావం ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.భారీ వర్షాల కారణంగా చెన్నై అంధకారంగా మారింది. భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందారు. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టులో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెం.విూ వర్షపాతం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సబ్‌వేలు మూసివేశారు. నిత్యవసర సరకుల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. సహాయక చర్యలు కోసం సైన్యం రంగంలోకి దిగింది.మిచౌంగ్‌ తుఫాన్‌ దెబ్బకు చెన్నై అతలాకుతలమైంది. నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

ఇక చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది.చెన్నైలో పలు సబ్‌వేలను మూసేశారు. నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి.ఎన్డీఆర్‌ఎఫ్‌ , ఎస్డీఆరెఫ్‌ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి..ఇప్పటివరకూ 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు..ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇక భారీ వర్షానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.మే 9`15 మధ్య వచ్చిన మోచా తుపాను చైనా, బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంకను వణికించేసింది. 1.5 బిలియన్ల ఆస్తి నష్టం సంభవించగా 463 మంది మృత్యువాత పడ్డారు.
జూన్‌ 6`19 మధ్య వచ్చిన బిపర్‌జాయ్‌ తుపాను కూడా అదే స్థాయి నష్టాన్ని మిగిల్చింది. ఇది ఇండియా పాకిస్థాన్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. 124 మిలియన్ల రూపాయల ఆస్తినష్టం సంభంవించగా 17 మంది చనిపోయారు. తేజ్‌ పేరుతో అక్టోబర్‌లో 20`24 మధ్య వచ్చిన తుపాను ఒమన్‌, యెమెన్‌ దేశాల్లో చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.అక్టోబర్‌ 21`25 మధ్య బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మిజోరాంలో భయంకరమైన తుపాను వచ్చింది. దీని కారణంగా 567 మిలియన్ల రూపాయల నష్టం వాటిల్లింది. 17 మంది మృత్యువాత పడ్డారు. అదే ప్రాంతాన్ని కవర్‌ చేస్తూ నవంబర్‌ 14`18 మధ్య మిథిలి అనే పేరుతో తుపాను బీభత్సం సృష్టించింది. 276 మిలియన్ల ఆస్తి నష్టం జరగ్గా ఏడుగురు చనిపోయారు. ప్రస్తుతం మిగ్‌జాం పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకొని తుపాను కొనసాగుతోంది. ఇది ఎంత నష్టాన్ని మిగులుస్తుందో అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *