నల్గోండ కాంగ్రెస్‌ లో టిక్కెట్ల లొల్లి…

నల్గోండ, అక్టోబరు 3, (న్యూస్‌ పల్స్‌)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు ముఖ్య నాయకుల చేరికలతో కాంగ్రెస్‌ మాంచి ఊపు విూదుంది. రానున్న ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాలో కనీసం పది తమవే అన్న ధీమాను ఆ పార్టీ కీలక నాయకుల వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అయిదు చోట్ల మాత్రం సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారనుంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు ముఖ్య నాయకుల చేరికలతో కాంగ్రెస్‌ మాంచి ఊపు విూదుంది. రానున్న శాసన సభ ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాలో కనీసం పది స్థానాలు తమవే అన్న ధీమాను ఆ పార్టీ కీలక నాయకుల వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించకుండానే మెజారిటీ స్థానాలు తమ ఖాతాలో పడతాయన్న ఆశాభావంలో ఉంది. కానీ, కనీసం అయిదు నియోజకవర్గాల్లో మాత్రం సీట్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారనుంది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ తన పట్టును నిరూపించుకుంది. కోదాడ, హుజూర్‌ నగర్‌, మిర్యాలగూడెం, నాగార్జున సాగర్‌, నల్లగొండ, ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి తాము ఇచ్చిన మద్దతుతో గెలిచిన దేవరకొండ.. అంటే మొత్తంగా ఆరు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.బీఆర్‌ఎస్‌ మరో ఆరుచోట్ల ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి, సూర్యాపేట ల్లో గెలవడంతో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కానీ, 2018 శాసన సభ ఎన్నికల విషయానికి వచ్చే వరకు కేవలం మూడు నియోజకవర్గాలు మునుగోడు, నకిరేకల్‌, హుజూర్‌ నగర్‌ లకే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ, ఈ సారి పరిస్థితి అలా లేదని, తామే అత్యధిక చోట్ల గెలుస్తామని ప్రకటిస్తున్నారు.ఎలాంటి వివాదాలకు తావులేకుండా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్న ఆలేరు, నల్లగొండ, నాగార్జున సాగర్‌, హూజూర్నగర్‌, కోదాడ , సూర్యాపేట, తుంగతుర్తిలను మినహాయిస్తే.. భువనగిరి, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, నకిరేకల్‌, నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు సమస్యగా మారనుందన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
భువనగిరి :
భువనగిరి నియోజకవర్గంలో పరిస్థితి నిన్నా మొన్నటి వరకు కొంత ఆశాజనకంగానే కనిపించింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును నిరసిస్తూ డీసీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి తీసకువచ్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆశీస్సులతో, టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ద్వారా తిరిగి పార్టీలోకి వచ్చిన కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ఢల్లీి కాంగ్రెస్‌ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు. ఇన్నాళ్లూ ఎంపీ కోమటిరెడ్డి ప్రోత్సహించిన రామాంజనేయులు గౌడ్‌, శివరాజ్‌ గౌడ్‌, తానే స్వయంగా కండువాకప్పి పార్టీలోకి తీసుకున్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి టికెట్‌ విషయంలో డైలమాలో పడ్డారు. ఇపుడు ఇక్కడ ఎవరికి టికెట్‌ వచ్చినా మిగిలిన వారు కలిసి పనిచేసే పరిస్థితి లేదు.
మునుగోడు:
మునుగోడు నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లో చేరడం వల్ల వచ్చన ఉప ఎన్నికల్లో తమ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ కు కోల్పోయింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి స్రవంతిరెడ్డి తనకే మళ్లీ టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలోనే తెరపైకి వచ్చిన చలమల్ల క్రిష్ణారెడ్డి టికెట్‌ రేసులో ఉన్నారు. బీసీ కోటాలో తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేని పున్నకైలాష్‌ నేత పట్టుబడుతున్నారు.మరో వైపు వామపక్షాలతో ఎన్నకల పొత్తు కుదిరతే సీసీఐ తమకు ఈ సీటును కేటాయించాలని డిమాండ్‌ చేయనుంది. ఇటీవల ఇంకో కొత్త వార్తా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి వస్తారని, ఆయన కానీ, ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మీ కాని పోటీ చేయొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే.. ఇంత మంది నాయకుల మధ్య ఐక్యత సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.
దేవరకొండ :
దేవరకొండలో 2009 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌, తన సిట్టింగ్‌ స్థానాన్ని త్యాగం చేసి ఎన్నికల పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్‌ మద్దుతో సీపీఐ గెలిచినా.. ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లోకి వెళ్లిపోయారు. దీంతో 2018 ఎన్నికల్లో తిరిగి రవీంద్ర కుమార్‌ బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్‌ గెలుపు ఆశలు పెట్టుకున్న దేవరొండలో బాలూనాయక్‌, కిషన్‌ నాయక్‌, బీల్యానాయక్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు.వీరి మధ్య అనైక్యత బీఆర్‌ఎస్‌ కు లాభిస్తుందేమోనన్న ఆందోళన స్థానిక కాంగ్రెస్‌ కేడర్‌ లో ఉంది. కానీ, ఈ ముగ్గురు నాయకులను సమన్వయం చేసే నేత కానరావడం లేదు. బీల్యానాయక్‌ టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ లోకి వచ్చిన నాయకుడు. కిషన్‌ నాయక్‌ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతోనే రాజకీయాలు నెరుపుతున్నారు. బాలూనాయక్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డికి అనుచరుడిగా పేరుంది. వీరి మధ్య ఐక్యత కుదిరే అవకాశాలు కనిపించడం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
మిర్యాలగూడెం :
మిర్యాలగూడెం నియోజకవర్గంలో టికెట్‌ ఎక్కువ పోటీ ఉంది. టీ పీసీసీకి ఇక్కడి నుంచి 18 మంది దరఖాస్తు చేసుకున్నా.. టికెట్‌ కు ప్రధాన పోటీదారులు మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్‌.ఆర్‌), కుందూరు రఘువీర్‌ రెడ్డి మధ్యే ఉండనుంది. కానీ, ఇక్కడ కూడా వామపక్షాలతో పొత్తు కుదరితే ప్రభావం చూపనుంది. కాంగ్రెస్‌ తో ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఎం కోరే సీట్లతో మిర్యాలగూడెం కూడా ఒకటి. ఒక వేళ సీపీఎం కే టికెట్‌ కేటాయిస్తే.. కాంగ్రెస్‌ శ్రేణులు ఏమేర సహకరిస్తాయన్నది ప్రశ్నార్దకమేనని చెబుతున్నారు.
నకిరేకల్‌ :
జిల్లాలో ఇపుడు హాట్‌ సీట్‌ నకిరేకల్‌. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీట్లు కాంగ్రెస్‌ గెలిచింది. కానీ, గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ తీర్ధం పుచ్చుకోవడంలో మూడేళ్లుగా పలువురు నాయకులు పనిచేసుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ పై పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవలే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుని టికెట్‌ రేసులోకి వచ్చారు.ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామన్న హావిూపైనే పార్టీలో చేరారు. దీంతో ఇప్పటి దాకా టికెట్‌ పై ఆశలు పెట్టుకున్న దైద రవీందర్‌, కొండేటి మల్లయ్య, వేదాసు శ్రీధర్‌ లు ఏమేర కలిసి వస్తారు, ఎంత మేర పార్టీకోసం పనిచేస్తారన్నది ప్రశ్నార్ధకమే అని పేర్కొంటున్నారు. ఇలా మొత్తంగా అయిదు నియోజకవర్గాల్లో సీట్ల సర్దు బాటు కాంగ్రెస్‌ నాయకత్వానికి తలనొప్పిగా మారనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *