ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు ఫోన్.. పలు కీలక అంశాలపై చర్చ

రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin) ప్రధాని మోదీ(PM Modi)తో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌‌లో(Ukraine) ప్రస్తుత పరిస్థితి, రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుపై(Armed Mutiny) ఇరుదేశాల నేతలు సమీక్షించారు. జూలై 4న భారత్ ఆతిథ్యమిస్తున్న శాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ నేపథ్యంలో ప్రధాని మోదీ, పుతిన్ ఫోన్ కాల్ సంభాషణ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్రధాని కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం..ఇరుదేశాల నేతలు ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారు. రష్యాలో ఇటీవల జరిగిన పరిణామాలను పుతిన్ ప్రధాని మోదికి వివరించారు. ఉక్రెయిన్ విషయంలో చర్చల సందర్భంగా భారత్ దౌత్యం అవసరంపై నేతలు పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు.

ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్న ప్రధాని మోదీ, పుతిన్.. ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిబద్ధతను పునరుద్ఘాటించారని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.శుక్రవారం నాటి ప్రధాని మోదీ, పుతిన్ ఫోన్ సంభాషణ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం, కమ్యూనికేషన్ కొనసాగించేందుకు అంగీకరించారని క్రెమ్లిన్ తెలిపింది.

దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉక్రెయిన్ నిరాకరిస్తోంది: పుతిన్

తూర్పు ఐరోపాలో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉధృతమైన యుద్ధం, ఉక్రెయిన్ పరిస్థితిపై ఇరువురు నేతలు చర్చించారు. దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉక్రెయిన్ నిర్ద్వంద్వంగా నిరాకరించిందని ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ జోన్‌లో ప్రస్తుత పరిస్థితిని పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. సంఘర్షణను పరిష్కరించేందుకు రాజకీయ, దౌత్యపర చర్యకు కీవ్ వర్గీకరణ తిరస్కరణను సూచిస్తూ ఓ ప్రకటన చేసినట్లు క్రెమ్లిన్ సర్వీస్ తెలిపింది.

అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. దైత్యం, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని భారత్ ప్రయత్నిస్తో్ంది. ఈ నేపథ్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO), G20లో తమ దేశాల సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, భారత్ నాయకత్వం వహిస్తున్న G20 సమ్మిట్, బ్రిక్స్ ఫార్మాట్‌లో సహకారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

జూన్ 24న రష్యాలో ఇటీవల విరమించుకున్న తిరుగుబాటు ప్రయత్నానికి ప్రధాని మోదీ మద్దతు తెలిపినట్లు రష్యా వార్తాసంస్థ క్రెమ్లిన్‌ తెలిపింది. భారత్‌తో రష్యాకు ఉన్న ప్రత్యేక అనుబంధంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీతో ఫోన్ సంభాషించారు. శాంతి భద్రత పరిరక్షణ, దేశంలో స్థిరత్వం, రష్యా నాయకత్వం నిర్ణయాత్మక చర్యలకు ప్రధాన మోదీ మద్దతు తెలిపారని క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *