బాలినేనికి ఉలుకు ఎందుకో

బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి,. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కాబినెట్‌ లో అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌ వైఎస్సార్‌, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి అదే నియోజక వర్గం నుంచి ఆరు సార్లు పోటీ చేసి ఒక్క సారి మాత్రమే ఓడి పోయారు. ఉమ్మడి ఒంగోలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ, ఆయన కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా క్యాష్‌ డీల్స్‌ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాకుండా బధుత్వం కూడా ఉన్న బాలినేని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి కొంత దూరమయ్యారు. అసంతృప్తి స్వరాలకు వేదిక అయ్యారు. అదలా ఉంటే, ఇప్పుదు ఆయనకు మరో సమస్య వచ్చిపడిరది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెలుగు చూసిన చీకోటి ప్రవీణ్‌ కేసినో , హవాలాలో కేసులో ఆయనకు సంబంధం వుందో లేదో కానీ, ఆయనకు సంబంధాలే కాదు, అయన రోల్‌ కీలకమనే ప్రచారం అయితే జరిగింది.జరుగుతోంది.ఎక్కడ ఏ నేరం జరిగిన పాత నేరస్తులు ఉలిక్కి పడడం సహజమే, కానే మాజీ మంత్రి, అధికార వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఈ విషయంలో ఎందకు ఉల్లిక్కి పడ్డారు? ఎందుకు విూడియా ముందు వచ్చి, కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్పుకున్నారు? అంటే, ఏదో ఉండి అందుకే, ముందుగానే సంజాయషీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ఏ సంబంధం లేక పోతే మాజే మంత్రి ఎందుకు, బుజాలు తడుము కుంటున్నారు, అని ప్రశ్నిస్తున్నారు. అయితే, బాలినేని మాత్రం, ‘నేను పేకాట ఆడతాను. అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటాను’ అని ఒప్పుకుంటూనే, అంత మాత్రాన చీకోటి ప్రవీణ్‌ కేసినోతో కానీ ఆయన హవాలా దండాతో కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. అయితే, బాలినేనిపై ఇలాంటి కేసినో, హవాల ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి, కాదు. ఆయమ మంత్రిగా ఉన్న రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అప్పట్లో అయన ఆ ఆరోపణలను ఖండిరచినా, ఇప్పడు మాత్రం ‘అవును .. నాకు పేకాట, కేసినోకు పోయివచ్చే అలవాటు ఉందన అంగీకరించారు. దీంతో అనుమనాలు ఇంకా ఎక్కవ అయ్యాయని అంటున్నారు. గతంలో అయన మంత్రిగా ఉన్నరోజుల్లోనే, ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇమేజ్‌ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చ వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కేసినో, హవాల మచ్చలు మాత్రం బాలినేని, పుట్టుమచ్చల్లా, వదలడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *