జనసేన లెక్కేంటీ…

హైదరాబాద్‌, అక్టోబరు 4
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి డిసైడైంది జనసేన. 32 నియోజకవర్గాల్లో బరిలో ఉంటామని ప్రకటించింది. అయితే ఇక్కడే రకరకాల డౌటనుమానాలు వస్తున్నాయి రాజకీయ పరిశీలకులకు. ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదు. మిగతా పార్టీలన్నీ ముమ్మర కసరత్తులో ఉన్నాయి. కానీ.. ఆ దిశలో ఇప్పటిదాకా జనసేన పరంగా పెద్దగా చేసిందేం లేదు. ఒకవేళ 32 సీట్లే కదా అని అనుకున్నా.. జనసేనకు ఆ స్థాయిలో చేయగల యంత్రాంగం ఉందా అన్నది క్వశ్చన్‌ మార్క్‌. ఏపీలో ఓకేగానీ.. తెలంగాణలో గ్లాస్‌ పార్టీకి ఉన్న బలం, బలగం ఎంత? ఆ బలగంతో ఇంత తక్కువ టైంలో ఎలా నెగ్గుకు వస్తుందన్న సందేహాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఏపీలో టిడిపితో పొత్తు కన్ఫామ్‌ అయింది. మరి ఆ పొత్తు తెలంగాణలో కూడా ఉంటుందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ లేదు. ఆ దిశగా అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఈ పరిస్థితుల్లో టీఎస్‌ పొత్తు సంగతేంటి? జనసేన ముందే ప్రకటించిన 32 స్థానాల్లో టిడిపి పోటీచేయదా? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. తాము మొత్తం 119 సీట్లలో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ గతంలోనే ప్రకటించారు.అందులో టీడీపీ ఇప్పటికీ బలంగా ఉందని చెప్పుకుంటున్న జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం లాంటి జిల్లాలు ఉన్నాయి. జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్లు కూడా ఈ పరిధిలోనే ఉన్నాయి. అంటే.. జనసేన కోసం తమకు బలం ఉందనుకుంటున్న సీట్లను టీడీపీ త్యాగం చేస్తుందా? లేక పొత్తు ఏపీ వరకే.. ఇక్కడ ఎవరి దారి వారిదే అంటారా? లాంటి సవాలక్ష సందేహాలు వస్తున్నాయి. కానీ, వాటికి క్లారిటీ ఇచ్చే నాయకుడు మాత్రం కనిపించడం లేదు. గతంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయగా.. ఆమెకు బహిరంగంగానే మద్దతు ప్రకటించింది జనసేన. హైదరాబాద్‌లో కూడా జనసేన, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ బాగానే ఉన్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ వైపు యూత్‌ ఓట్లర్లు మొగ్గు చూపితే బిఆర్‌ఎస్‌ కు నష్ఠం జరుగుతుందా? అన్న అనుమానాలు సైతం ఉన్నాయి.దీనికితోడు ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌ పై కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ నష్టం కలిగించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నేతలే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓట్లు చీలితే నష్టం ఎవరికన్న లెక్కలు కడుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో?32 నియోజకవర్గాల్లో పోటీకి పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ గట్టిగానే జరుగుతోంది. యూత్‌ పరంగా చూసుకుంటే బీఆర్‌ఎస్‌కు నష్టమన్న వాదన ఓవైపు ఉంటే? మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలితే అంతిమంగా బీఆర్‌ఎస్‌కే లాభమన్న చర్చ నడుస్తోంది. ఈ చర్చను నమ్మేవారికి మాత్రం?. పవన్‌ పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూరుస్తున్నారా? ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయట. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటుండగా? మొత్తంగా చూసుకుంటే? జనసేన పోటీ తెలంగాణలో పార్టీల విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది మాత్రం అందరి నుంచి వినిపిస్తున్న మాట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *