ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణ మృదంగం.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం భూదాడి చేసేందుకు సిద్ధమైంది. గాజా స్ట్రిప్‌పై గాలి, సముద్రం, భూమి నుంచి సమన్వయ దాడికి సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆదివారం ఉత్తర గాజాలోని పౌరులను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లేందుకు ఇజ్రాయెల్ మూడు గంటల సమయం ఇచ్చింది. 2 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే ఈ ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ నీరు, విద్యుత్, ఆహార సరఫరాలను నిలిపివేసింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని అన్ని ఆసుపత్రులలో ఇంధన నిల్వలు మరో 24 గంటలు మాత్రమే ఉంటాయని ఐక్యరాజ్యసమితి మానవతా కార్యాలయం (OCHA) సోమవారం తెలిపింది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు భూదాడులకు సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆ దేశానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. హమాస్-పాలిత భూభాగాన్ని తిరిగి ఆక్రమించకుండా ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవాలనుకోవడం ‘పెద్ద తప్పు’ అని చెప్పారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ పూర్తి స్థాయి ఆక్రమణకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. “ఇది చాలా పెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను. నా దృష్టిలో గాజాలో ఏం జరుగుతుందంటే అక్కడి పాలస్తీనా ప్రజలందరికీ హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాతినిధ్యం వహించదు. కాబట్టి గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకుంటే పెద్ద తప్పే అవుతుంది.’’ అని బిడెన్ అన్నారు. అయినప్పటికీ గాజాలోని ఉగ్రవాదులను ఏరిపారేయడం ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లదని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. “ఇజ్రాయెల్ యుద్ధ నిబంధనల ప్రకారం పనిచేస్తుందని నాకు నమ్మకం ఉంది” అని బిడెన్ తెలిపారు. దీంతో ఇన్నాళ్లు తమకు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు మాట మార్చడంతో ఇజ్రాయెల్‌కు పెద్ద షాక్ తగిలిందనే చెప్పుకోవాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *