తెలంగాణలో కర్ణాటక వ్యూహం పార్టీకి కలిసొచ్చేనా ?

ఈ ఏడాది చివర్లో తెంలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే ఎన్నికలు వస్తాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. దూకుడుగా వ్యవహరిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలకు గాలం వేస్తున్నాయి. గెలుపు గుర్రాలు, ఎన్నికల్లో ప్రభావం చూపే సత్తా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచకళ్ల దామోదర్‌ రెడ్డి మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.. కేసీఆర్‌ పాలనను అంతమె?ందించేందుకు తమతో కలిసి రావాలని వారిని కోరారు. అందుకు ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించారు. జులై 2న వారివురు నేతలు పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక కాంగ్రెస్‌ స్ట్రాటజీని తెలంగాణలోనూ అప్లై చేసి సక్సెస్‌ కావాలని టీ కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బంఫర్‌ విక్టరీ సొంతం చేసుకుంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌, సీనియర్‌ నేత సిద్ధరామయ్య ఇద్దరూ కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డారు. ఎన్నికలకు ముందు సీఎం కుర్చీ కోసం డీకే, సిద్ధూ మధ్య పోటీ ఉన్నా.. అవేవీ బయటపకుండా నేతలు కలిసి పని చేశారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందర్ని కలుపుకుపోయారు. తమ పార్టీలో గ్రూపులు ఉండవని తామంతా ఒకటేనని మెసేజ్‌ను పార్టీ కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ స్ట్రాటజీతోనే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.అదే ఫార్ములాను తెలంగాణలోనూ అప్లై చేయాలని టీ కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగానే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో గ్రూప్‌ తగదాలు ఎక్కువ. నిత్యం నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇది పార్టీకి నష్టమని భావించిన అదిష్ఠానం అందర్ని కలుపుకుపోయేలా టీసీసీసీకి కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే టీపీసీసీ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కలిసిపోయారు. స్వయంగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్‌.. చేరికల విషయమై ఆయనతో చర్చించారు. అట్నుంచి ఇద్దరు నేతలు కలిసి జూపల్లి, పొంగులేటి నివాసాలకు చేరుకున్నారు. రేవంత్‌ నల్గొండ జిల్లాలో చేరికలపై కోమటిరెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సలహాలు తీసుకుంటామన్నారు. వారికి తెలియకుండా ఏ ఒక్కరిని పార్టీలోకి తీసుకోమని చెప్పారు. అలాగే ఖమ్మం జిల్లాలో సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వంటి నేతలుతో సంప్రదింపులు జరిపాకే చేరికలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీనియర్ల సలహాలు, సూచనలతో కాంగ్రెస్‌ పార్టీని పటిష్ఠం చేస్తామని రేవంత్‌ అన్నారు. కోమటిరెడ్డి తనకు ఆత్మీయ సహోదరుడని.., రాహుల్‌ గాంధీని ప్రధాని చేసేంత వరకు తాము కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ పార్టీకి బహుమానంగా ఇస్తామని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారుతెలంగాణ కాంగ్రెస్‌లో ఇవాళ చోటు చేసుకున్న ఈ పరిణామాల పట్ల టీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ వచ్చింది. ఇలా సీనియర్లు, జూనియర్లను కలుపుకొనిపోతే కాంగ్రెస్‌ పార్టీకి తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా విభేదాలు, ఆధిపత్యధోరణిని పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సఖ్యతా రాగం చివరి వరకు ఉంటుందా.. లేక షరా ముమూలే కదా అని అనేలా నేతలు వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *