కొత్త అధ్యక్షుల తప్పదా

తిరుపతి, అక్టోబరు 5
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయనున్న జిల్లా పార్టీ అధ్యక్షులను ఆ పదవుల నుంచి తొలగిస్తారనే ప్రచారం వైసీపీలో ఊపందుకుంది. రెండు పదవుల్లో ఉన్న వారిని నియోజకవర్గం బాధ్యతలకు పరిమితం చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలను పార్టీ జిల్లా బాధ్యతలను తప్పించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. జిల్లా అధ్యక్షుల్లో పలువురిని పార్టీ మార్చనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న జిల్లా అధ్యక్షుల స్థానంలో కొత్తవారికి బాధ్యతలను అప్పగించనున్నట్లు చెబుతున్నారు.2022లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ తర్వాత పలు జిల్లాల్లో అధ్యక్షులను మార్చారు. అప్పట్లో మంత్రి పదవులు కోల్పోయిన వారి స్థాయికి ఏ మాత్రంగా తగ్గకుండా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తుండటంతో నియోజక వర్గ బాధ్యతలతో పాటు జిల్లా బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టంగా ఉందని పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకురావడంతో వారిని నియోజక వర్గాలకు పరిమితం చేయాలని అధిష్టానం భావిస్తోంది.ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా కె.భాగ్యలక్ష్మి కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్‌?ర చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తూర్పు గోదావరిలో జక్కంపూడి రాజా, ఏలూరులో ఆళ్ల నాని, కృష్ణాజిల్లాలో పేర్ని వెంకటరామయ్య, ఎన్టీఆర్‌ జిల్లాలో వెలంపల్లి శ్రీనివాస్‌ పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంద్యాలలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సత్యసాయి జిల్లాలో శంకరనారాయణ , అన్నమయ్య జిల్లాలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి , చిత్తూరులో డిప్యూటీ సిఎం నారాయణస్వామి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో నారాయణ స్వామి మినహా మిగిలిన వారంతా మాజీ మంత్రులుగా పనిచేసిన వారో, మంత్రి పదవుల్ని ఆశించిన వారో ఉన్నారు.ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో వీరంతా తమ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టాల్సి ఉండటంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి మంగళవారం సమావేశమై ఈ నియామకాలతోపాటు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు ఛైర్మన్ల ఎంపికపై చర్చించారు. సజ్జల, ధనుంజయరెడ్డిలతో మరో విడత చర్చించి ఎంపికలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుల కొత్త జాబితాను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిరచే అవకాశాలున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *