demo

01 వలంటీర్ల తరహాలో టీడీపీ ప్లాన్‌
విజయవాడ, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు పార్టీలో జరగడం లేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. పార్టీలో నేతలు కొంత యాక్టివ్‌ అయ్యారు. అంతవరకూ ఆయన గత కొంత కాలంగా పడుతున్న శ్రమకు ఫలితం దక్కినట్లే. కానీ మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆయన తీసుకున్న మరో కీలక నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రతి యాభై ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించాలని చంద్రబాబు భావించారు. అయితే అందుకు నియోజకవర్గ నేతల్లో కొందరు అత్యుత్సాహం చూపుతున్నారు. తమ ప్రధాన అనుచరులనే యాభై ఇళ్లకు ఒకరిని నియమించేందుకు ముందుకు వస్తున్నారు. ఇది తెలిసిన పెద్దాయన ఆ నియామకాలను ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారట.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరం. లేకుటే పార్టీ చీలికలు పీలికలుగా మారుతుంది. ఆ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచే ఆయన ప్రజాక్షేత్రంలోకి పరుగులు పెడుతున్నారు. వయసును పక్కన పెట్టి ఆయన కసితో కాలు దువ్వుతున్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వచ్చే ఎన్నికల్లో ఇబ్బందిగా మారనుందని, ఆ కుటుంబాలను వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా మార్చే ప్రమాదం ఉందని ముందుగానే గ్రహించిన చంద్రబాబు అదే స్థాయిలో తమ పార్టీకి కరడు గట్టిన కార్యకర్తలను నియమించాలని భావించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు తొలుత ఆదేశాలు కూడా జారీ చేశారు. జాబితాను సిద్ధం చేయమని తెలిపారు. వారికి పార్టీ నుంచి ఎంతో కొంత గౌరవ వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించారు.కానీ ఇన్‌ఛార్జులందరూ తమకు అనుకూలమైన, అనుచరులనే యాభై ఇళ్లకు ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిసింది. ఒకవేళ పొత్తులు కుదిరి, కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తే అక్కడ ఇన్‌ఛార్జులు అసంతృప్తికి గురైతే వాలంటీర్లుగా నియమించిన వారు పార్టీకి అనుకూలంగా పనిచేయరని అనుమానం బయలుదేరింది. మరో వైపు టీడీపీ జరిపిస్తున్న సర్వేల్లో అందరు ఇన్‌ఛార్జులకు సీట్లు దక్కే చాన్స్‌ లేదు. ప్రధానంగా 40 శాతం మంది యువతకు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కూడా కొన్ని చోట్ల ఇన్‌ఛార్జులకు టిక్కెట్‌ దక్కే అవకాశం లేకపోవడంతో దానిని చంద్రబాబు కోల్డ్‌ స్టోరేజీ లో పెట్టారంటున్నారు. ఎన్నికలకు ముందు హడావిడిగా వాలంటీర్లను నియమించుకుంటే వాళ్లు అధికార పార్టీ ప్రలోభాలకు గురికారన్న నమ్మకం ఏందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అనేక నియోజకవర్గాల నుంచి తొలినుంచి పనిచేస్తున్న కార్యకర్తలను పక్కన పెట్టి తమ వారి పేర్లను జాబితాలో చేర్చినట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. అందువల్లనే ఇప్పుడే వాలంటీర్ల నియామకం వద్దని పార్టీ నుంచి ఇన్‌ఛార్జులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు వాలంటీర్ల పేర్లు ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏడాదిలో ప్రతి ఇంటికి వెళ్లి వారిని టీడీపీ వైపు మళ్లించగలిగే వారినే కార్యకర్తలుగా ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. వైసీపీ నియమించిన వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండటానికి వీలులేదని ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు అందాయి. కానీ టీడీపీ అనధికారం కావడంతో వారినే పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించాలన్న భావనలో కూడా ఆయన ఉన్నారు. అందుకే ప్రస్తుతానికి చంద్రబాబు వాలంటీర్ల నియామకాన్ని పక్కన పెట్టారంటున్నారు. నిఖార్సయిన వారి కోసం వెదుకుతున్నారని చెబుతున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRR
02బాలినేనికి ఉలుకు ఎందుకో
ఒంగోలు, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి,. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కాబినెట్‌ లో అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌ వైఎస్సార్‌, రోశయ్య మంత్రి వర్గాల్లోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి అదే నియోజక వర్గం నుంచి ఆరు సార్లు పోటీ చేసి ఒక్క సారి మాత్రమే ఓడి పోయారు. ఉమ్మడి ఒంగోలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ, ఆయన కీలక పాత్రను పోషించారు. ముఖ్యంగా క్యాష్‌ డీల్స్‌ లో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాకుండా బధుత్వం కూడా ఉన్న బాలినేని ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి కొంత దూరమయ్యారు. అసంతృప్తి స్వరాలకు వేదిక అయ్యారు. అదలా ఉంటే, ఇప్పుదు ఆయనకు మరో సమస్య వచ్చిపడిరది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో వెలుగు చూసిన చీకోటి ప్రవీణ్‌ కేసినో , హవాలాలో కేసులో ఆయనకు సంబంధం వుందో లేదో కానీ, ఆయనకు సంబంధాలే కాదు, అయన రోల్‌ కీలకమనే ప్రచారం అయితే జరిగింది.జరుగుతోంది.ఎక్కడ ఏ నేరం జరిగిన పాత నేరస్తులు ఉలిక్కి పడడం సహజమే, కానే మాజీ మంత్రి, అధికార వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఈ విషయంలో ఎందకు ఉల్లిక్కి పడ్డారు? ఎందుకు విూడియా ముందు వచ్చి, కేసినో నిర్వాగకుడు చీకోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్పుకున్నారు? అంటే, ఏదో ఉండి అందుకే, ముందుగానే సంజాయషీ ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే, ఏ సంబంధం లేక పోతే మాజే మంత్రి ఎందుకు, బుజాలు తడుము కుంటున్నారు, అని ప్రశ్నిస్తున్నారు. అయితే, బాలినేని మాత్రం, ‘నేను పేకాట ఆడతాను. అప్పుడప్పుడూ కేసినోకీ పోయివస్తూంటాను’ అని ఒప్పుకుంటూనే, అంత మాత్రాన చీకోటి ప్రవీణ్‌ కేసినోతో కానీ ఆయన హవాలా దండాతో కానీ తనకు సంబంధం ఉన్నట్లు కాదన్నారు. అయితే, బాలినేనిపై ఇలాంటి కేసినో, హవాల ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి, కాదు. ఆయమ మంత్రిగా ఉన్న రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కేసినో వ్యసనపరుడని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. అప్పట్లో అయన ఆ ఆరోపణలను ఖండిరచినా, ఇప్పడు మాత్రం ‘అవును .. నాకు పేకాట, కేసినోకు పోయివచ్చే అలవాటు ఉందన అంగీకరించారు. దీంతో అనుమనాలు ఇంకా ఎక్కవ అయ్యాయని అంటున్నారు. గతంలో అయన మంత్రిగా ఉన్నరోజుల్లోనే, ఒంగోలు నుంచి చెన్నైకు తరలిస్తున్న రూ. ఐదు కోట్ల నగదును తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఆ నగదు అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి హవాలా రూపంలో పంపుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఇమేజ్‌ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కేసినోలు.. హవాలా కేసుల గురించి చర్చ వచ్చినా ఆయన పేరు ప్రచారంలోకి వస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కేసినో, హవాల మచ్చలు మాత్రం బాలినేని, పుట్టుమచ్చల్లా, వదలడం లేదు.
RRRRRRRRRRRRRRRRRRR
03విశాఖపట్టణంలో సోలార్‌ ప్లాంట్‌
విశాఖపట్టణం, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
ప్రకృతి అందాలకు, టూరిస్ట్‌ స్పాట్‌ లకు నెలవైన విశాఖ నగరం ఇప్పుడు మరో మరో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్‌ (తేలియాడే) సౌర ప్లాంట్‌ను నిర్మించి మరో రికార్డు సృష్టించింది. పర్యావరణానికి హాని చేయకుండా… రిజర్వాయర్‌లోని నీటిని కూడా ఆవిరి కానివ్వని ఈ ప్రాజెక్టులో ఎన్నో విశిష్టతలున్నాయి. నగర వాసులకు తాగునీటిని అందిస్తున్న మేఘాద్రిగడ్డను సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ గా మార్చేసి అద్భుతమైన రీతిలో మలిచి జీవీఎంసీ గుర్తింపు పొందింది. రిజర్వాయర్‌ నీటిపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా ఓవైపు నీటిని ఆవిరికాకుండా అడ్డుకోవడం, రెండోవైపు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి ద్వారా అవసరాలు తీర్చడం వంటివి ఏకకాలంలో జరగడం విశేషం. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను జీవీఎంసీ షేర్‌ చేసింది. ఈ డ్రోన్‌ విజువల్స్‌ లో సౌర విద్యుత్‌ ను అందించే విద్యుత్‌ ప్యానెళ్లు నీటిపై తేలియాడడాన్ని గమనించవచ్చు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ పవర్‌ ప్లాంట్‌ నిర్మించామని, ఇది ప్రతి సంవత్సరం 4.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదని జీవీఎంసీ కమిషనర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. అదనంగా, మేము సంవత్సరానికి 54,000 టన్నుల బొగ్గును ఆదా చేస్తున్నామన్న ఆయన.. సంవత్సరానికి 3,022 టన్నుల ఉద్గారాలను తగ్గిస్తున్నామని స్పష్టం చేశారుఅయితే విశాఖపట్నం నగర జనాభా సుమారు 22 లక్షలు. వీరి విద్యుత్‌ అవసరాలతోపాటు నగర పరిధిలో వివిధ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, వీధి దీపాలకు రోజూ 40 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. ఇదంతా ఈపీడీసీఎల్‌ (ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌) నుంచి కొనుగోలు చేయాలి. ఇది జీవీఎంసీకి ఆర్థిక భారమే అవుతోంది. ఈ భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు సహజ ఇంధన వనరైన సౌర విద్యుత్‌ను తయారు చేసుకోవాలని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన జీవీఎంసీ… ముడసర్లోవలో రిజర్వాయర్‌లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టును నిర్మించింది. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించబడిరది. 2019 డిసెంబర్‌ లో పనులు ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. తడిచినా తుప్పుపట్టని, జర్మన్‌ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. రెండు విూటర్ల పొడవు, ఒక విూటర్‌ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్‌ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గుర్‌గావ్‌కు చెందిన రెన్యూ సోలార్‌ సిస్టమ్‌ ప్రై. లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కి సంబంధించి అర్బన్‌ క్‌లైమేట్‌ చేంజ్‌ రెసిలియన్స్‌ ట్రస్ట్‌ ఫండ్‌(యూసీసీఆర్టీఎఫ్‌) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది. సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ ను నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుంది. కానీ మేఘాద్రి రిజర్వాయర్‌లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్‌లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.విూ విస్తీర్ణంలోనే ఈ సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్‌ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్‌లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది
RRRRRRRRRRRRRRRRRR
04భూజాలు తడుముకొంటున్న కొడాలి నాని
విజయవాడ, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
గుడివాడ క్యాసినో వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తీరు ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటే ‘దొంగే.. దొంగ దొంగ అరిచినట్టు’ కొడాలి నాని తెలుగుదేశం నేతలకు సవాల్‌ వసురుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలో క్యాసినోను తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి అందజేసి తనను అరెస్ట్‌ చేయించాలంటూ కొడాలి చేసిన సవాల్‌ పట్ల టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాషినో నిర్వహించారు. అది కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించడం సంచలనంగా మారింది. అప్పటికే భూ దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడంలో నానికి అందెవేసిన చెయ్యి అనే పేరుంది. అయితే.. అప్పుడు ఇలా గోవా తరహాలో క్యాషినో నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలైతే ఓ రేంజ్‌ లో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కోసం గుడివాడ వస్తున్న టీడీపీ నేతలను పోలీసలు, కొడాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీలంక, నేపాల్‌, గోవాల్లో క్యాషినోలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఇటీవల హైదరాబాద్‌ లో చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డిల ఇళ్లు, నగర శివార్లలోని ప్రవీణ్‌ ఆస్తులపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. చీకటి వ్యాపారాల్లో సిద్ధహస్తుడైన చీకోటి ప్రవీణ్‌ కు` గుడివాడలో జరిగిన క్యాషినోకు సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిదే. చీకోటి ప్రవీణ్‌ ను కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిచయం చేశారని, ఆ క్రమంలోనే కొడాలి నాని ఫంక్షన్‌ హాల్‌ లో క్యాషినో నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు.ఈ విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఎత్తి చూపుతూ.. చీకోటి ప్రవీణ్‌ తో వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫొటోలను విూడియా ముందు ప్రదర్శించారు. గోవా తరహాలో గుడివాడలో క్యాషినో నిర్వహించడం వెనుక చీకోటి ప్రవీణ్‌, కొడాలి నాని, వల్లభనేని వంశీ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.. గుడివాడలో క్యాషినో తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి సమర్పించి తనను అరెస్ట్‌ చేయించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్‌ విసిరారు. ‘బురద పాము కోపం’ అనే సామెత ఒకటి ఉంది.. విషం లేని బురద పాము కరిచినా ప్రమాదం ఉండదు. అలాగే ఒక పక్కన మంత్రి పదవి కోల్పోయి, మామూలు ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని హవా ఇప్పుడు స్థానికంగా అస్సలు లేదట. స్థానిక అధికారులు కూడా ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే కాదు స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. చెత్తపై పన్ను వసూలు చేయొద్దని కొడాలి చెప్పినా గుడివాడ మున్సిపల్‌ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే మాట విని విధులు నిర్వర్తించకుండాఉండమని ఆయనకే ఖరాకండీగా చెప్పేశారు. దీంతో కోరలు పీకిన పాములా కొడాలి నానిలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోంది. అందుకే చెత్త పన్ను విషయంలో సీఎం జగన్‌ తోనే మాట్లాడతానంటూ తనలాగే అమాత్య పదవి కోల్పోయిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాయంకోరినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు.టీడీపీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొడాలి నాని భుజాలు తడుముకుంటున్నారని, దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు చేస్తున్నారంటున్నారు. చేతనైతే తనన అరెస్ట్‌ చేయించాలంటూ కొడాలి నాని సవాల్‌ విసరడం వెనక ఆయనలోని ఉలికిపాటు బట్టబయలైందంటున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
05చంద్రబాబుకు సమస్యగా మారిన ఆత్మీయులు
విజయవాడ,జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. ఆయన పక్కనే ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్‌ లో వ్యాపారం చేసుకుంటూ, అక్కడ ట్యాక్సులు కడుతూ ఏపీపై పెత్తనం చేయాలనుకునే వారితోనే చంద్రబాబుకు సమస్యగా మారిందని చెప్పాలి. ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు, దర్శకులు చంద్రబాబుకు వత్తాసు పలకడం ఇప్పటి నుంచి మొదలు కాలేదు. ఎన్టీఆర్‌ ను దించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు తెలివిగా సినిమా ఇండ్రస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. తాను అధికారంలో ఉండగా వారికి ఇతోధిక సాయం చేస్తుండటంతో చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు వీరంతా ఆయన వైపు నిలుస్తారు. అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారిందని చెప్పకతప్పదు. చంద్రబాబు ఒక సామాజికవర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తొలి నుంచి ప్రచారం ఉంది. వైసీపీ అందుకు అనుగుణంగా కమ్మ సామాజికవర్గం నేతలు లబ్దిపొందిన వైనాన్ని హైలెట్‌ చేస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి రావాలంటే వైసీపీ, టీడీపీలకు వారి సామాజికవర్గాలు ఒక్కరే మద్దతిస్తే సరిపోదు. ఆ విషయం పార్టీ అధినేతలకు తెలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటూ అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక చంద్రబాబు అయితే అధికారంలో లేకపోతే విలవిలలాడిపోయే వారు కొందరున్నారు. వారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, మరో చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ లు ఇద్దరూ ముందు వరసలో ఉంటారు. సీనీ పరిశ్రమలో వ్యక్తుల కంటే రాజకీయ నేతలుగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి చంద్రబాబు ఆయనను గౌరవించారు. రాఘవేంద్రరావు ఇటీవల తెనాలి లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీ మళ్లీ రావడం ఖాయమని చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి అవసరమని ఆయన చెప్పారు. నిజానికి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్‌ లో ఎలాంటి వ్యాపారం చేయరు. ఆయన బిజినెస్‌ అంతా తెలంగాణలోనే. చంద్రబాబు రావాలని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై ఆయన తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తిరిగి తనకు నామినేటెడ్‌ పదవి లభించవచ్చన ఆశకావచ్చు. తాజాగా అశ్వినీదత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బంది పెట్టేవే. వైసీపీ హయాంలో తిరుమల సర్వ నాశనం అయిందన్నారు. అక్కడ జరగని పాపం లేదని, జరుగుతున్న అన్యాయాలను చూడలేమన్నారు. ఏమయిందో? ఎందుకయిందో? అన్యాయాలేంటో మాత్రం చెప్పలేదు కాని తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అశ్వినీదత్‌ వ్యాఖ్యానించారు. అశ్వినీదత్‌ వ్యాపారాలు, నివాసం అంతా హైదరాబాద్‌ లోనే. ఆయన కారు కొన్నా తెలంగాణలో కొంటారు. ఇల్లు కొన్నా అంతే. అక్కడి ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. కృష్ణాజిల్లా స్వస్థలమైన అశ్వినీదత్‌ హైదరాబాద్‌ లో ఉంటూ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏవగింపుగా మారాయన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు కాని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారు పార్టీ సభ్యత్వం పుచ్చుకోవడమే బెటర్‌. ఇలాంటి వారితోనే టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
06దిగుబడి పెరిగింది… ధర తగ్గింది
తిరుపతి, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో, పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది.ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్‌లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40?10, రెండో రకం రూ.5.00?8.20 మధ్యన పలికింది.మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి.మదనపల్లె టమాట మార్కెట్‌ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్‌ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, వరంగల్‌, మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌, జగదల్‌పూర్‌, విహిల్‌, అంబికాపూర్‌, బవోదాబాద్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, జబల్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, గుజరాత్‌లోని జోధ్‌పూర్‌, రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్‌, దేశ రాజధాని ఢల్లీికి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది. అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు.
RRRRRRRRRRRR
నేడు భరతమాత ముద్దుబిడ్డ,స్వాతంత్ర సమరయోధుడు
సర్దార్‌ ఉద్దం సింగ్‌ బలిదాన దినోత్సవం
1919 ఏఫ్రెల్‌ 13 పంజాబ్‌ లోని అమృతసర్‌ లో జలియన్‌ వాలాబాగ్‌ అనే చిన్నతోటలో రౌలత్‌ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయకప్రజలపై జనరల్‌ డయ్యర్‌ ఆధర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతు?లైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది.. ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలవిూదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని ‘‘ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను’’అంటూ ప్రతిజ్ఞ చేశాడు. దీనికి కారకులైన డయ్యర్స్‌ ను వెతుకుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్‌ సింగ్‌ తో కలిసి విప్లవకార్యక్రమాలలో పాల్గొన్నాడు..డయ్యర్స్‌ లో ఒకరైన ఫ్రాన్సిస్‌ డయ్యర్‌ 1927లో భారత్‌ లోనే చనిపోయాడు. దానితో జనరల్‌ ఓ డయ్యర్‌ ను చంపేందుకు ఇంగ్లండ్‌ పయనమవ్వాలనుకుంటున్న సమయంలో భగత్‌ సింగ్‌ తో పాటు ఆయనను అరెష్ట్‌ చేశారు.తన కళ్ళముందే భగత్‌ సింగ్‌ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్‌ చదవాలని ఇంగ్లండ్‌ పయనమైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్‌ ఓ డయ్యర్‌ ను వెంటాడసాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు. ఒకరోజు ఓ డయ్యర్‌ ఒక కాన్ఫరెన్స్‌ కు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందిందతనికి. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్‌ సంపాదించాడు…ఒకపుస్తకంలో ఫిస్టల్‌ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో దానిని దాచాడు..ఏవిూ ఎరగనట్లు ఓ డయ్యర్‌ సభకు వెళ్ళాడు…సభలో ఓ డయ్యర్‌ ను వీరుడు,ధీరుడంటూ పొగిడేస్తున్నారు…అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలలాడసాగింది. జలియన్‌ వాలా బాగ్‌ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు..ఇంతలో డయ్యర్‌ ప్రసంగం ముగిసింది…ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆ యువకుడి కూడా గంభీరంగా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్‌ దగ్గరకు వెళుతున్నాడు…నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్‌ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి అప్రమత్తమయ్యే లోపలే పుస్తకంలోని పిష్టల్‌ మెరుపువేగంతో తీయడం,అంతే వేగంతో ఓ డయ్యర్‌ పై గుళ్ళ వర్షం కురిపించడం జరిగిపోయింది..జనరల్‌ ఓ డయ్యర్‌ నేలకొరిగాడు..ఎవరినైతే నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్‌ వాలాబాగ్‌ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో…ఆ సంఘటనలోని వ్యక్తి చేతిలోనే ప్రాణాలు విడిచాడు.ఇది 1940 జూలై 13న జరిగింది. డయ్యర్‌ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడా యువకుడు… ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా??? షంషేర్‌ ఉద్దామ్‌ సింగ్‌ ….ఆ విప్లవవీరుడి వర్ధంతి సందర్భంగా.. అమర వీరునికి నమః సుమాంజలి!!!ఉద్దమ్‌ సింగ్‌ పంజాబ్‌ లోని సంగ్రూర్‌ జిల్లా లోని సునం తెహసీల్‌ కు చెందిన కలన్‌ గ్రామంలో డిసెంబర్‌ 26 1899 నజన్మించాడు.1940 జూలై 31 (వయసు 40) కారాగారము, యునైటెడ్‌ కింగ్డమ్‌ లో ఉరితీయబడ్డారు.కోర్టులో ఉదంసింగ్‌ ప్రసంగంనేనే చేశాను ఈ హత్య ఎందుకు అంటే అతని విూద నాకు పగ నేను అతనిని చంపే అంత తప్పు చేసాడు నా దెశ ప్రజల ఆత్మ ను భంగపరచాడు అందుకనే వాడిని చంపి వేసాను అందుకోసం 21 సం!! లు వేచి చూసాను నేను ఈ పని చేసినందుకు సంతోషంగా ఉన్నాను నేను మరణంకు భయపడలేదు. నేను నా దేశం కోసం మరణిస్తున్నాను.
RRRRRRRRRRRRRRRRRR
ప్రశ్నార్థకంగా 24 క్రాఫ్ట్స్‌
విశ్లేషణ)
ఆగస్టు ఒకటి నుంచి సినిమా షూటింగులను ఆపేస్తున్నామని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రకటించింది. అకస్మాత్తుగా సినిమా షూటింగులను నిలిపివేయాల్సినంత పరిస్థితులు ఇండస్ట్రీకి ఎందుకొచ్చాయన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానాలు దొరకడం లేదు. దీని గురించి నిర్మాతలు చెబుతున్న సమాధానాలు నామమాత్రంగానే ఉన్నాయి. కొవిడ్‌ తరువాత ఆదాయ వనరులలో మార్పులు వచ్చాయని, ప్రొడక్షన్‌ కాస్ట్‌ బాగా పెరిగిందని చెబుతున్నారు. కానీ, ఈ అంశాలు షూటింగ్‌ నిలుపుదలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దీంతో పాటు ఓటీటీ అంశాన్ని కూడా తెరవిూదకు తెచ్చారు. సినిమాలు విడుదలైన కొన్ని వారాల తరువాతనే ఓటీటీలకు రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఒక్కసారిగా షూటింగ్‌ బంద్‌ పెడితే ఇండస్ట్రీ విూద ఆధారపడిన సుమారు 26 వేల మంది కార్మికుల జీవితాలపై నీలినీడలు అలుముకుంటాయి. నిజానికి ప్రస్తుత పరిస్థితికి ఇండస్ట్రీ స్వయంకృతాపరాధమనే స్పష్టమవుతోంది.’ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరిగింది, ఆదాయ వనరులు తగ్గిపోయాయి’ అంటున్న నిర్మాతలు అసలు కాస్ట్‌ను పెంచింది ఎవరన్న అంశాన్ని మర్చిపోయారు. ఇందుకు కరోనాను సాకుగా చూపించడం మరీ విడ్డూరంగా ఉంది. కరోనాకు ముందు, తరువాత కూడా సినిమాలు తీసిన నిర్మాతలకు ఒక్కసారిగా నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇందుకు అడ్డూ అదుపూ లేని బడ్జెట్‌, ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్లు, మ్యూజిక్‌ డైరక్టర్లు, వర్కర్లతో పాటు సాంకేతిక నిపుణులను తీసుకురావడమేనని అంటున్నారు. షూటింగులను మన ప్రాంతాలలో కాకుండా ఇతర దేశాలు, రాష్ట్రాలలో తీయడం వలన కూడా బడ్జెట్‌ అమాంతంగా పెరుగుతోంది.హీరోలకు అమాంతంగా రెమ్యూనరేషన్‌ పెంచడం కూడా బడ్జెట్‌ పెరుగుదలకు కారణంగా కనబడుతోంది.పోటీ పడి మరీ ధరలు పెంచుకుంటూ పోయి, ఇప్పుడు నష్టం వస్తుందని అనడం ఎంతవరకు సమంజసమో ఆత్మ విమర్శ చేసుకోవాలి. భారీ బడ్జెట్‌ సినిమాలు తీయమని ప్రజలు అడగలేదు? కోట్ల రూపాయలతో సినిమాలు తీసి నష్టపోయామంటూ షూటింగులను ఆపడం ఎంతవరకు కరెక్టో నిర్మాతలు ఆలోచించాలి. షూటింగ్‌ ఆపుతామంటున్న పెద్దలు అగ్రహీరోల ధరలు తగ్గిస్తామని అనడం లేదు. ఆయా హీరోలతో చర్చించడం లేదు. హీరోయిన్లు, ఇతర ప్రాంతాల మ్యూజిక్‌ డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులతో చర్చించడం లేదు. షూటింగులను నిలిపివేస్తామంటే ప్రభుత్వానికీ, ప్రజలకు వచ్చే నష్టమేవిూలేదన్న అంశాన్ని నిర్మాతలు గ్రహించకపోవడం బాధాకరంనిత్యం ఎన్నో సమస్యలు, టెన్షన్‌లతో ఉండే ప్రజలు వినోదం కోసం సినిమాకు వెళదామనుకుంటారు. టికెట్‌ ధరలు చూసి బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారు. కొవిడ్‌కు ముందు టికెట్‌ ధరలు సాధారణంగానే ఉన్నా కొవిడ్‌ తరువాత ఒక్కసారిగా పెంచేశారు. దీంతో బడా హీరోల సినిమాలు కూడా నామమాత్రంగానే నడిచాయి. కోట్ల రూపాయలతో సినిమా తీసి ప్రజలపై భారం మోపింది కూడా విూరే కదా? టికెట్‌ ధరలను అమాంతంగా పెంచడంతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. లేకపోతే సినిమాలు థియేటర్లలో ఆశించిన మేరకు నడిచేవి. నిర్మాతలకు నష్టం వచ్చేది కాదు.ఆంధ్రప్రదేశ్‌లో నిర్ధిష్ట ధరలను నిర్ణయించడంతో అక్కడ థియేటర్లలో సినిమాలు బాగానే నడిచాయి. తెలంగాణలో ధరలను పెంచడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కాదా? సినిమాలను ఓటీటీలకు నెలన్నర తరువాతే రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు. అసలు ఓటీటీలను తీసుకొచ్చింది ఎవరు? ఆ వ్యాపారానికి ఆజ్యం పోసింది ఎవరు? ఇండస్ట్రీ పెద్దలే దానికి రూపకర్తలుగా ఉండడం గమనార్హం. ఓటీటీలను కూడా వ్యాపారం చేసి ఏడాదికి ఇంత చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేలా చేసి, ఇపుడు ఓటీటీలతో నష్టమొస్తుందనడంలో ఆంతర్యమేమిటో నిర్మాతలు చర్చించుకోవాలి.షూటింగులను ఆపేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే జవాబు లేదు. ఎవరి కోసం బంద్‌ పెడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతల కోసం ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో గ్రీవెన్స్‌ సెల్‌ ఉంటుంది. అక్కడ పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకూ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాలకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రతీ రెండేళ్లకొకసారి దేశవ్యాప్తంగా రూ. నాలుగు వేల కోట్లు కేటాయిస్తుంది.2021`22 ఏడాదికి రూ.4,071.23 కోట్లను కేటాయించింది. 1974 ఆగష్టు 15 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది, సౌత్‌ ఇండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాలు వస్తుండగా, హిందీ (ముంభై) భోజ్‌పురి (బిహార్‌) ఒడిసీ (ఒడిశా) ఈ ఏడు రాష్ట్రాలు మాత్రమే యాక్టివ్‌గా సినిమాలను తీస్తున్నాయి. కార్పొరేషన్‌లో పరిష్కారం లభించే అవకాశం ఉన్నా నిర్మాతలు దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం.షూటింగులు ఆగిపోతే ఇండస్ట్రీనే నమ్ముకుని బతుకుతున్నవారి పరిస్థితి ఏమిటి? 24 క్రాఫ్ట్స్‌ కింద సుమారు 26 వేల మంది కార్మికులున్నారు. ఇందులో సినిమానే బతుకుగా ఉన్నవారు 13 వేల మంది. ఇప్పుడు వీరంతా ఎటుపోవాలి? నిర్మాతలు సినిమాలు తీయడం వల్లనే వీరికి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నది వాస్తవమే. ప్రస్తుతం వీరి పరిస్థితి ఏమిటన్నదాని విూద క్లారిటీ లేదు. భారీ కుదుపు చోటుచేసుకున్నా ‘మా’ మాత్రం చప్పుడు చేయడం లేదు.టాలీవుడ్‌ మొదటి నుంచి కూడా మన దగ్గర ఉన్న ప్రతిభావంతులకంటే కూడా ఇతర ప్రాంతాలవారికే ప్రాధాన్యత ఇస్తుందన్నది జగమెరిగిన సత్యం. అందుకే ప్రొడక్షన్‌ కాస్ట్‌ అమాంతం పెరుగుతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సుమారు 200 మంది మ్యూజిక్‌ డైరెక్టర్లు, రెండు వేల మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 3,200 మంది నిర్మాతలుంటే, 150 మందే సినిమాలు తీస్తున్నారు. నిర్మాతలు, డైరెక్టర్లు, మేనేజర్ల తప్పిదాలను ఇండస్ట్రీ విూద వేసి షూటింగులను ఆపేయడం పెద్దల స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు.
RRRRRRRRRRRRRRRRRRRRRR
07 కేసీఆర్‌ కు న్యాయ పోరాటమే శరణ్యమా
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్‌ గత మూడు నాలుగు రోజులుగా దేశ రాజదాని ఢల్లీిలో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢల్లీి ఎందుకు వెళ్లారు, ఏమి చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ స్పష్టత ఉన్నట్లు లేదు. చివరకు, టీవీ డిబేట్స్‌ లో పాల్గొనే తెరాస అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యమంత్రి ఢల్లీి ఎందుకు వెళ్ళారో చెప్పలేక పోతున్నారు. నిజంగా వారికి తెలియదో, తెలిసినా చెప్పలేని పరిస్థితో ఉన్నారో తెలియదు కానీ, ‘ది బాస్‌ ఈజ్‌ ఆల్వేస్‌ రైట్‌’ అన్న పద్దతిలో ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా తెలంగాణకు మంచి మాత్రమే చేస్తారని అంటున్నారు. అంతే, కానీ ఆ ‘మంచి’ ఏమిటో మాత్రం బయట పెట్టడం లేదు. మరో వంక అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారానని బట్టి , ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహుముఖ వ్యూహాలతో ఢల్లీిలో అడుగు పెట్టారని తెలుస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటుగా, రాష్ట్రం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితికి సంబందించి సీరియస్‌ స్టెప్స్‌ తీసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్డం అవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అవసరం అయితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును వెళ్లేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారనీ అంటున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, విద్యుత్తు శాఖ కార్యదర్శి సునీల్‌ శర్మతో పాటు పలువురు అధికారులు, న్యాయనిపుణులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించడం కాకుండా, ముందు కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా లేఖ రాయాలని, అందుకు సరైన జవాబు రాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు, న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. ఇదే విషయంగా ముఖ్యమంత్రి ఢల్లీి నుంచే చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ కసరత్తులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2022 మార్చి 31న రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి రాసిన పది పేజీల లేఖపై అధికారులు చర్చలు జరిపారని సమాచారం. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాల జీఎస్డీపీలో 3.5 మేరకు నికర రుణ పరిమితిని విధించామని కేంద్రం ఆ లేఖలో పేర్కొందని, నిజానికి ఆర్థిక సంఘం అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పూర్తిగా సవరించాలని సూచించిందన్నారు. కేంద్రం మాత్రం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తూ నికర రుణ పరిమితిని పాటించకుండా రాష్ట్రాలపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాక విద్యుత్తు రంగం పని తీరును బట్టి అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో మరో 0.5% పెంచుతామని కేంద్రం లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా పరిమితులు విధించడం చెల్లదని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.కార్పొరేషన్లు, ఇతర సంస్థలు చేసే రుణాలపై కేంద్రం ఎలా ఆంక్షలు విధిస్తుందని ? వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోనవసరం లేదనీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రం కేంద్రం నుంచి, మార్కెట్‌ నుంచి చేసే అప్పులకు మాత్రమే రుణ పరిమితిని వర్తింపజేయాలని.. కార్పొరేషన్లు చేసే అప్పులనూ రాష్ట్ర రుణాలుగా పరిగణించే అధికారం కేంద్రానికి లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకే అయితే ఢల్లీి వెళ్ళడం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఢల్లీి నుంచి సమాలోచనలు జరపడం ఎందుకు? అదీ కాక, ఈ సమాలోచనలో చర్చించినట్లు చెపుతున్న అన్ని అంశాలపైన, రాష్ట్రంలో చాలా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ అన్ని విషయాలపైనా ముఖ్యమంత్రికి పూర్తి స్పష్టత వుంది. విలేకరుల సమావేశాల్లో, ఇతరత్రా ఆయన ఈ విషయాలను ఒకటికి పదిసార్లు ప్రస్తవించారు. నిజానికి కేంద్రానికి లేఖ రాసే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గతంలోనే చూచాయగా చెప్పారు.అదలా ఉంటే, ఇటీవల సుప్రీం కోర్టు ఆర్థిక క్రమశిక్షణ అవసరాన్ని నొక్కి చెపుతూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హావిూలను నియంత్రించ వలసిన అవసరం ఉందని అభిప్రాయ పడిరది. సో.. అప్పులు చేస్తాం అనుమతివ్వండి .. అంటే సుప్రీం కోర్టు అయినా అంగీకరిస్తుందా .. అనుమానమే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి ఢల్లీి యాత్రకు, సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలనే ఆలోచనకు లింక్‌ కుదరడం లేదని అంటున్నారు. అందుకే, ముఖ్యంత్రి ఢల్లీి ఎందు కెళ్ళారు … అనేది జవాబు లేని ప్రశ్నగానే మిగిలి పోయిందని, అంటున్నారు.
RRRRRRRRRRRRRRR
08 అప్పుల లెక్కలపై మాటాల మంటలు
న్యూఢల్లీి, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుంటే.. గురివింద గింజ సామెతలా ఉంది కేంద్రం తీరు అంటూ రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నాయి. అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న రగడ నేను చవటనే కానీ నాకంటే విూరు మరింత పెద్ద చవట అని పరస్పర నిందన యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాల అప్పులను ప్రశ్నిస్తుంటే.. మా సంగతి సరే విూ సంగతేంటని రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. విూరు అప్పులు ఎక్కువ చేశారంటే విూరు ఎక్కువ అప్పులు చేశారంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రజలు దొందూ దొందే అనుకుని పరిస్థితి కల్పించారు. అప్పుల తగాదాలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ చేరవు. అలా చేరాల్సిన అవసరమూ వాటికి లేదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట ఆయా రాష్ట్రాల నిబంధనల ఉల్లంఘనను, అప్పుల అరాచకాన్ని కేంద్రం ఎత్తి చూపుతుంటే… అప్పుల విషయంలో కేంద్రం చిల్లులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిగ్గు తేలుస్తున్నాయి. రగడలో రాష్ట్రాల తప్పిదాల కంటే కేంద్రం తప్పిదమే ఎక్కువ ఉందని పరిశీలకులు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల అప్పులకు కేంద్రం అనుమతి ఉండాలి. నిబంధనలకు మించి ఒక్క రూపాయిఎక్కువ అప్పు చేయాలన్నా గ్రీన్‌ సిగ్నల్‌ఇవ్వాలి. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టారీతిన అప్పులు చేసేసి తీరా చేతులు కాలక తప్పదన్న పరిస్థితి వచ్చే సరికి ఆకుల కోసం వెదుక్కుంటున్నాయి. శ్రీలంక పరణామలు సంభవించి ఉండక పోతే కేంద్రం, రాష్ట్రాలూ కూడా తోడు దొంగల్లా అప్పు భారతీయాన్ని అలా కొనసాగిస్తూనే ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పులపై పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటన చేసిన రోజునే.. ఏపీకి పెద్ద మొత్తంలో అప్పుకు అనుమతించడమే నిదర్శనంగా పరిశీలకులు చూపిస్తున్నారు. నిజమే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎఫ్‌ ఆర్‌ఎంబి( ఫెనాన్స్‌ రెస్బాన్స్‌ బులిటీ` బడ్జెట్‌ మేనేజ్‌ మెంట్‌)ను మించి అప్పులు చేశాయి. విచ్చల విడిగా ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలిచ్చి మరీ ఉచిత హావిూలు నెరవేర్చి తదుపరి ఎన్నికలలో విజయానికి పెట్టుబడిగా ఉపయోగించేశాయి.కానీ ఆ రాష్ట్రాలు అలా చేయడానికి కారణం కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరించడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం, రాష్ట్రాలూ రెండూ కారణమేనని వారు వివరిస్తున్నారు. ఇంత కాలం కేంద్రం, రాష్ట్రాలూ కూడా తేలుకుట్టిన దొంగల్లా అప్పుల విచ్చలవిడితనంపై మౌనంగా ఉండి.. శ్రీలంక సంఘటనలతో ఒక్కసారి ఉలిక్కిపడి తప్పు విూదంటే విూదని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ పంచాయతీ అని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పరిమితిని మించి అప్పులు చేశాశాయంటే కేంద్రం, ఆర్బీఐ ఎత్తి చూపిన రాష్ట్రాలలో దాదాపు అన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే కావడం వెనుక ఉన్నది రాజకీయ కారణమే తప్ప మరొకటి కాదనడంలో సందేహాలకు తావులేదని వాస్తవమే అయినా.. ఆయా రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయనడంలోనూ, అందుకు పరిమితికి మించిన అప్పులే కారణమనడంలోనూ ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్రాల పరిస్థితి ఎలా తయారైందంటే.. చేసిన అప్పులు తీర్చడం మాట అటుంచి వాటికి వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రం పరిస్థితి అయితే కేంద్రం ఏం తక్కువ తినలేదు. ఈ సంగతీ తమను వేలెత్తి చూపిన కేంద్రంపై రాష్ట్రాలు ప్రతి విమర్శలు చేయడంతోనే బయట పడిరది.కేంద్రం రుణాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల చేతనే ఇంత కాలం కేంద్రం రాష్ట్రాల అప్పులపై నోరెత్తలేదు. అలాగే కేంద్రం రుణాలపై రాష్ట్రాలు నోరెత్త లేదు. ఇప్పుడైనా కేంద్రం, రాష్ట్రాల బండారం బయటపడటానికి శ్రీలంక పరిణామాలే కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో జనాలకు వెల్లడయ్యేందుకు కారణమైన శ్రీలంకకు ప్రజలు ధ్యాంక్స్‌ చెప్పుకోవాలి.కేంద్రం అప్పులూ దేశాన్ని దివాళా దిశగా తీసుకు వెళ్లేలాగే ఉన్నాయనడానికి ఆ అప్పులు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతానికి మించిపోవడమే తార్కానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం తన ఖాతాలోనే జమ వేసుకుంటూ రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి పరోక్షంగా కేంద్రమే కారణమైంది. అవి చాలవన్నట్లు విదేశీ బాండ్ల రూపంలో అప్పుల సేకరణ లేదా సవిూకరణకు కేంద్రం తెరతీసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది.ఇవన్నీదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా సంక్షోభం దిశగా పయనిస్తున్నదనడాకి తార్కానాలు. ఇంత పంచాయతీ జరుగుతున్నా కేంద్రం, కానీ రాష్ట్రాలు కానీ అప్పులను నియంత్రించుకుని పొదుపు పాటించాలని భావించడం లేదు. వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలూ కూడా జనాలకు నగదు పంపిణీయే పెట్టుబడి అని భావిస్తున్నాయి. దేశం మరో శ్రీలంక అయినా వాటికి పట్టింపు లేదు. అధికారం చేజిక్కించుకుంటే చాలు అన్న ధోరణిలోనే ఉన్నాయి. ఒక చేత్తో ఉచితాల పేరున ప్రజలకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలే మరో వైపునుంచి జనం నుంచి పన్నుల రూపంలో రెండు చేతులా పిండేస్తున్నారు.
RRRRRRRRRRRRRRR
09 ఎన్నికల ముందే పట్టాభిషేకం..?
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
టీఆర్‌ఎస్‌ కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన కె. తారక రామారావు ముఖ్యమంత్రి కావాలని అనేక మంది నేతలు కోరుకుంటున్నారు. కేటీఆర్‌ అయితే పార్టీ మరింత పరుగులు తీస్తుందని వారు భావిస్తున్నారు. కేసీఆర్‌ వ్యూహరచనలు చేస్తూ పార్టీకి అండగా నిలబడాలని ఎక్కువ మంది ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేటీఆర్‌ అందరికీ అందుబాటులో ఉంటారు. ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే ఆయనను కలవడం పెద్ద విషయం కాదు. నియోజకవర్గంలో తమ సమస్యలను ఎప్పటికప్పుడు చెప్పుకునే వీలుంటుందన్నది అధిక శాతం మంది అభిప్రాయంగా వినిపిస్తుంది. ప్రశాంత్‌ కిషోర్‌ టీం చేసిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడయిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్‌ ను కలవాలంటే గత ఎనిమిదేళ్ల నుంచి ఎమ్మెల్యేలకు సాధ్యపడటం లేదు. ఆయన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు కూడా కలసి వినతి పత్రం సమర్పించడం మినహా తమ బాధలను చెప్పుకునే వీలు దొరకడం లేదు. ఏదున్నా మంత్రిగా ఉన్న కేటీఆర్‌ కు చెప్పుకోవాల్సిందే. కేటీఆర్‌ కూడా నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేలకు దొరకరు. ప్రగతి భవన్‌ లోనే ఆయన ఉంటుండటంతో లోపలికి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలకు అనుమతి దొరకని పరిస్థితి. కేటీఆర్‌ ను కలిసి… అయితే కేటీఆర్‌ ఎక్కువగా పర్యటనలు చేస్తుండటంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆయన పర్యటించే ప్రాంతానికి వచ్చి కలసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. కేటీఆర్‌ తో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నా మేజర్‌ ప్రాబ్లమ్స్‌ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిధుల అవసరం ఎక్కువగా ఉన్న పనులకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌ ను నియోజకవర్గంలో ఉన్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరాలన్నా వీలుకాదు. ఆ సంగతి తెలిసినా ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని ఎమ్మెల్యేలు కేటీఆర్‌ ను కలిసి తమ గోడును వినిపిస్తున్నారు. కేసీఆర్‌ వ్యూహాలు పార్టీకి ఎంతో అవసరమని, అదే సమయంలో కేటీఆర్‌ కు బాధ్యతలను అప్పగించడం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఇక కేటీఆర్‌ తో ఇంట్రాక్ట్‌ అయినట్లుగా కేసీఆర్‌ తో అనేక మంది కాలేరు. కేసీఆర్‌ హావిూ ఇచ్చినా అది అమలు కాలేదని చెప్పడానికి మరోసారి కలుసుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తేలింది. టీఆర్‌ఎస్‌ అభిమానులు, ప్రజలు కూడా కేసీఆర్‌ కంటే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయితే అందరికీ అందుబాటులో ఉంటారని భావిస్తున్నట్లు పీకే టీం సర్వేలో కూడా తేలింది. తమ సమస్యలను సత్వరం నియోజకవర్గంలో పరిష్కారమయితేనే మళ్లీ గెలిచే ఛాన్సులున్నాయంటున్నారు ఎమ్మెల్యేలు. కేసీఆర్‌ మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్‌ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. మరి అందరూ కోరుకుంటే రామన్న ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందే అయ్యే ఛాన్స్‌ లేకపోలేదని గులాబీ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్‌.
RRRRRRRRRRRRRRR
10 చీకోటి కారులో చినజీయర్‌
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కాసినో స్కాం సూత్రధారి చీకోటి ప్రవీణ్‌ కారులో చినజీయర్‌ స్వామా? అవును ఇప్పుడు ఈ వార్తే, ఇందుకు సంబంధించిన ఫొటోలే సంచలనంగా మారాయి. చీకోటి కారులో కూర్చున్న చినజీయర్‌ స్వామిగారి ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌ గా సర్క్యులేట్‌ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఒకప్పటి ఆధ్యాత్మిక గురువు, ఏపీ సీఎం జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించిన స్వామి త్రిదండి చినజీయర్‌ స్వామి చీకోటి కారులో షికారు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. త్రిదండి చినజీయర్‌ స్వామిని చీకోటి తన కారులో కూర్చోబెట్టుకుని తిప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలే చినజీయర్‌ స్వామిని మరింత ‘పాపులర్‌’ చేసేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యమా బిజీగా ఉండే స్వామివారు కాసినో నిర్వాహకుడి కారులో ఎక్కి షికార్లు చేయడమేమిటని నెటిజన్లు తెగ ట్రోల్‌ చేసేస్తున్నారు. అత్యంత నిష్టాగరిష్టుడు, ఎందరో బడా బడా రాజకీయ నాయకులకు ఆధ్మాత్మిక గురువు, సమతామూర్తి విగ్రహివిష్కరణకు ఏకంగా ప్రధానిని రప్పించిన క్రేజీ స్వామి వారు.. ఒక కాసినో నిర్వాహకుడి కారులో తిరగడమేమిటి? అన్నది నెటిజన్ల సందేహం.అసలు త్రిదండి చినజీయర్‌ స్వామి వారి దర్శనం దొరకడమే సామాన్యులకు దుర్లభం. ఆయనపై పరమ భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన వారు కూడా ఆయనను అల్లంత దూరం నుంచి చూసి దణ్ణం పెట్టుకుని వెళ్లాల్సిందే. అసలు సామాన్యులకు స్వామి వారి అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టం. మామూలు భక్తులు అల్లంత దూరం నుంచి స్వామివారిని మొక్కవలసిందే.అలాంటిది చీకోటి కారులో చీకోటి పక్కన కూర్చుని మరీ షికార్లు చేశారేమిటి చినజీయర్‌ స్వామివారు… వారికి చీకోటితో ఎలా పరిచయం, ఎలాంటి పరిచయం అంటూ నెటిజన్లు తమ సందేహాలను సోషల్‌ విూడియాలో పోస్టు చేస్తున్నారు.ఇక్కడే వారు చినజీయర్‌ స్వామి జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడాన్ని గుర్తు చేస్తూ.. గుడివాడ కాసినోకు, చిన జీయర్‌ స్వామి జగన్‌ ను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించడానికి, చీకోటి కారులో స్వామి వారి షికార్లకు ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సందేహాలకూ, ప్రశ్నలకూ సమాధానం చెప్పేంత తీరిక స్వామి వారికి ఉంటుందా మరి.
RRRRRRRRRRRRRRలీలీ
11రెండు మృతదేహాలు లభ్యం
విశాఖపట్నం
పూడిమడక సముద్రతీరంలో మరో 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. నేవీ హెలికాప్టర్‌ సాయంతో మృతదేహాలను ఒడ్డుకు తరలించినట్లు చెప్పారు. మృతులు జగదీష్‌, గణేష్గా గుర్తించారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. విశాఖ సముద్రతీరంలో గల్లంతైన విద్యార్థుల కోసం శనివారం ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్‌, కోస్ట్గార్డ్‌ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో నలుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూడిమడక బీచ్కు 15 మంది విద్యార్థులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
RRRRRRRRRRRRRR
12చక్రబంధంలో విపక్ష నేతలు
వ్యూహాలు రచిస్తున్న గులాబీ బాస్‌
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో చక్రబంధంలో బంధించేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతుంది. అందుకోసం పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. వారు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గట్టిపోటీనిచ్చే అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నాలను షురూ చేసింది. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసే అవకాశం ఇవ్వకుండా ఆ నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావిస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా అధికారపార్టీ పావులు కదుపుతోంది. ప్రతిపక్ష పార్టీలపై పైచేయి సాధించేలా కార్యచరణ సిద్ధం చేసింది.రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను దింపే ప్రయత్నంతో పాటు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలను ఇరుకున బెట్టేందుకు పై చేయి సాధించేందుకు సొంతపార్టీ అభ్యర్థుల పక్షాన రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అందరి అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయాలి. అదే విధంగా వీరు సైతం నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తుండటంతో వీరిని కదలనీయకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. బండి, రేవంత్‌పై ధీటైన అభ్యర్థులు నిలబడితే పోటాపోటీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో సొంత నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాలపై ప్రభావం పడనుంది. అంతేకాదు వారి కదలికలను నియోజకవర్గానికే పరిమితం, కట్టడి చేసే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ పార్టీ స్టార్ట్‌ చేసింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో వారిని ఓడిరచే సత్తా ఉన్న ధీటైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలను ఇప్పటినుంచే ప్రారంభించినట్లు సమాచారం. 2014, 2018 ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ ఇదే ప్రణాళికలను రూపొందించింది. కేసీఆర్‌ ప్రజల నాడీ తెలిసిన వ్యక్తి. రాజకీయ చతురత అమోఘం. దీంతో ఎప్పుడు ఎన్నికలు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని అనేది తెలుసు. ప్రత్యర్థులను ఎత్తులను చిత్తుచేసి రాజకీయ ఎత్తుగడులు వేసి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతారు. అయితే గత ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే రాబోయే ఎన్నికల్లో అనుసరించి మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.రాష్ట్రంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులను సైతం నియోజకవర్గానికే పరిమితం చేశారు. 2014లో పీసీసీ ప్రెసిడెంట్‌గా పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచి పోటీ చేయగా టీఆర్‌ఎస్‌ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బరిలో దించింది. దీంతో పొన్నాల రాష్ట్రం కన్నా నియోజకవర్గానికే ఎక్కవ సమయం కేటాయించాల్సి వచ్చింది. చివరకు ఒటమిపాలు కావల్సివచ్చింది. అదే విధంగా హుజూర్నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కాసోజుశంకరమ్మను, సాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్యను బరిలో నిలుపడంతో వారు గెలుపుకోసం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 22 నియోజకవర్గా?ల్లో మాత్రం విజయం సాధించింది. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియామకం కావడంతో 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలిపింది. దీంతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కావడంతో పక్కన ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్‌ పద్మావతిని కూడా గెలిపించుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలకే కాంగ్రెస్‌ పరిమితం అయింది. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌లో పద్మావతి బరిలో నిలువగా టీఆర్‌ఎస్‌ శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. 2018లో జానారెడ్డి సీఎం రేసులో ఉన్నాడని భావించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి నోముల నర్సింహయ్యను బరిలో నిలుపడంతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నుంచి భూపాల్‌ రెడ్డిని బరిలో నిలుపవడంతో ఓటమిపాలయ్యారు. తిరిగి భువనగిరిపార్లమెంట్‌ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటంతో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి నియోజకవర్గానికే కట్టడిచేయాలని భావిస్తుంది. 2018 ఎన్నికలో రేవంత్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పట్నం నరేందర్‌ రెడ్డి ఓడిరచిన విషయం తెలిసిందే. టీబీజేపీ ప్రప్రథమ అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కిషన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ పార్టీ సుధాకర్‌ రెడ్డిని నియమించడంతో గెలుపుకోసం శ్రమించాల్సి వచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కిషన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నుంచి కాలేరు వెంకటేష్‌ పోటీ చేసి విజయం సాధించారు. అదే విధంగా బీజేపీ అధ్యక్షుడిగా 2018లో కే.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయడంతో ఆయనపై టీఆర్‌ఎస్‌ నుంచి ముఠా గోపాల్‌ను నియమించింది. దీంతో లక్ష్మణ్‌ నియోజకవర్గానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ సైతం కరీంనగర్‌ నుంచి 2018లో పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ పై ఓడిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తిరిగి అసెంబ్లీ పోటీ చేయాలని భావిస్తుండటంతో బండిపై మరోసారి బలమైన అభ్యర్థిని బరిలో దింపి నియోజకవర్గానికే పరిమితం చేసేలా టీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేస్తుంది. ఒకవేళ నియోజకవర్గాన్ని వీడి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే ఇక్కడ ఓటమిపాలయ్యే అవకాశం ఉందన్న విధంగా గట్టి అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు కళ్లేం వేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
13 పాపం.. కోమటిరెడ్డి
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఏదైనా ఉంది అంటే..! అది కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిదే.. ఓవైపు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతున్నా.. ముందస్తు ముంచుకొస్తోంది.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అనే తరహాలో.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే పనిలో పడిపోయారు.. ఇప్పటికే పలువురు నేతలు.. అటు బీజేపీలో.. ఇటు కాంగ్రెస్‌లో చేరుతూనే ఉన్నారు.. ఈ సమయంలో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ సహా ఆ పార్టీ నేతలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నా.. కాంగ్రెస్‌ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక బాధ్యతల్లో ఉన్నారు.. ఈ నేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఈ గట్టునే ఉంటారా? ఆ గట్టుకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. ఇలా వివిధ హోదాలో పనిచేశారు.. అయితే, రెండోసారి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన వైఖరిలో మార్పు వచ్చింది.. మాటల్లో తేడా కనబడిరది.. కాంగ్రెస్‌ పని అయిపోయింది.. ఇక, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని.. ప్రధాని నరేంద్ర మోడీ బలమైన నేతగా కీర్తించారు.. దీనిపై పెద్ద రచ్చే జరిగినా.. అది టీ కప్పులో తుఫాన్‌గా కొంతకాలానికి కనుమరుగైపోయింది.. కొన్ని సందర్భాల్లో పీసీసీపై, పార్టీ అధిష్టానంపై ఆయన హాట్‌ కామెంట్లు చేసినా.. కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చిఆరు.. కానీ, ఇప్పుడు మరోసారి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తాను ప్రాతినథ్యం వహిస్తోన్న మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాల నేతలు, తన అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఆయన.. పార్టీ మారడం, కాంగ్రెస్‌ పార్టీలో తనకు జరిగిన అన్యాయం.. కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది? అనే విషయాలపై సలహాలు తీసుకున్నారు.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. పీడ్‌ బ్యాక్‌ కూడా కోరారు.. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చెబుతుండగా? రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారని.. ఉండేలా చూస్తామంటూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌.. మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అనే విధంగా పరిస్థితి మారిపోయింది.. ఇంతకీ ఆయన కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారా? లేక కమలం పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది..ఒకవేళ కోమటిరెడ్డి పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? ఉప ఎన్నికలను ఎదుర్కొంటారా? అనేది మాత్రం అంతుచిక్కడం లేదు.. కోమటిరెడ్డి బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ మరికొందరు కీలక నేతలతో ఢల్లీి వెళ్తారని.. బీజేపీ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి.. ఇంతలోనే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్‌ హైకమాండ్‌.. ఢల్లీిలో సమావేశం నిర్వహించింది. కేసీ వేణుగోపాల్‌ నివాసంలో ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సుదీర్ఘంగా రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌పై చర్చించారు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యేను వదులుకోవద్దు అనే నిర్ణయానికి వచ్చారు.. ఆయనను బుజ్జగించే బాధ్యతను ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నెత్తినపెట్టారు.. ఇక, ట్రబుల్‌ షూటర్‌ గా పేరున్న దిగ్విజయ్‌ సింగ్‌ ను కూడా రంగంలోకి దింపింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.. ఈ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ.. లేట్‌ చేస్తే.. కోమటిరెడ్డి రాకకు బ్రేక్‌లు పడే ప్రమాదం ఉందని గ్రహించి.. వెంటనే బీజేపీలో చేరాలంటూ కోమటిరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం.పార్టీలో చేరికపై బీజేపీ నుంచి ఒత్తిడితో పాటు.. కండీషన్‌ కూడా ఉందట.. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వస్తేనే.. కండువా కప్పుతామని స్పష్టం చేశారట.. దీంతో, రాజీనామా చేద్దామా? వద్దా..? రాజీనామా చేసి బైపోల్‌కు వెళ్తే.. గెలుస్తామా? ఉప ఎన్నిక కాబట్టి.. ఓడిపోతే పరిస్థితి ఏంటి? అనే విషయాలపై తర్జనభర్జన పడుతున్నారట.. అయితే, రాజీనామా చేయడం మాత్రం కోమటిరెడ్డికి ఇష్టం లేదనే టాక్‌ నడుస్తోంది.. అందుకు తగ్గట్టుగానే తన వ్యూహాలను అమలు చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారని.. పీసీసీ, సీఎల్పీ, కాంగ్రెస్‌ అధిష్టానం.. ఇలా అందరినీ టార్గెట్‌ చేస్తున్నారని.. పొగపెడితే.. వాళ్లే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారనే భావనలో కూడా ఉన్నట్టుగా టాక్‌ నడుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ కూడా రాజగోపాల్‌రెడ్డి విషయంలో దూకుడుగా వెళ్లడం లేదు.. క్రమశిక్షణా చర్యలకు సిద్ధం అవుతుందనే వార్తలు వస్తున్నా.. వేచిచూసే ధోరణిలోనే వెళ్తోంది.. ఈ పరిణామాలతో.. కాంగ్రెస్‌లోనే ఉండాలా? రాజీనామా చేయాలా? బీజేపీ కండువా కప్పుకోవాలా? ఇలా ఏ విషయాన్ని కూడా తేల్చుకోలేక డైలమాలో పడిపోయిన రాజగోపాల్‌రెడ్డి.. క్యాడర్‌ను కూడా ఆయోమయానికి గురిచేస్తున్నారనే టాక్‌ నడుస్తోంది.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి.. మరి ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు, సోషల్‌ విూడియాలో రాజగోపాల్‌రెడ్డిపై జోకులు కూడా పేలుతున్నాయి..
RRRRRRRRRRRRRRRRRRRRRRR
14 చీకోటిలో చీకటి కధలు
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ పేరు హాట్‌ టాపిక్‌ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చికటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.. చికోటీ ప్రవీణ్‌?అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్‌ ఏ బ్రాండ్‌ అని టాక్‌ నడుస్తోంది. దీంతో, అసలు ఎవరు ఈ చికోటి ప్రవీణ్‌..? అనే విషయం ఆసక్తికరంగా మారింది..ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ గురించి గూగుల్‌లో కూడా సెర్చ్‌ చేస్తున్నారట.. ! ఈడీ సోదాలతో అంతలా ఫేమస్‌ అయిపోయిన చికోటి.. అసలు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది.. అతడి లైఫ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసొచ్చిన వ్యక్తే.. ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులతో సెల్ఫీ దిగేవరకు వెళ్లినా.. ఈవెంట్లకు బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్లను పిలిచి రెమ్యునరేషన్‌ ఇచ్చినా.. తన చుట్టూ.. హంగు ఆర్భాటం ఉన్నా.. క్యాసినోతో పాటు.. చీకటి వ్యాపారాన్ని నడుపుతూ.. ప్రైవేట్‌ సైన్యాన్ని నడుపుతున్నా.. గతంలో వ్యాపారాలు చేసిన దివాలా తీసిన వ్యక్తే.. హైదరాబాద్‌, సైదాబాద్‌లోని వినయ్‌ నగర్‌ కాలనీ లో 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్‌ చిన్న సిరామిక్‌ టైల్స్‌ వ్యాపారి.. సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.. విలన్‌గా నటించినా సంపాదించింది లేదు కానీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.. అయితే, అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేయడం.. ఆ కేసులో జైలుకు సైతం వెళ్లాడు.. ఇక, ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చిన చికోటి.. అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. అన్ని డిపార్ట్‌మెంట్లతో టచ్‌లోకి వెళ్లాడు.. రాజకీయ నేతలను సైతం బుట్టలో వేసుకున్నాడు.జంట నగరాల్లో తొలినాళ్లలో బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడట.. చిన్న చిన్న పార్టీలతో అందరినీ ఆకర్షిస్తూ.. పరిచయాలు పెంచుకుంటూ.. తన బిజినెస్‌ ను విస్తరించాడు.. ఇక, రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో 2014 తర్వాత చికోటి ప్రవీణ్‌ బిజినెస్‌ టర్న్‌ అయింది. సిటీకే పరిమితమైన తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు.. దేశాలకు విస్తరించేశాడు.. ఈ చీకటి బాగోతంలో పలువురు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు సైతం చికోటి కస్టమర్ల లిస్ట్‌లో ఉన్నారట. వాళ్ల సాన్నిహిత్యం, సహకారంతోనే చికోటి వ్యవహారం విదేశాలకు విస్తరించాడు.. అంతెందుకు.. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు కస్టమర్లను తీసుకెళ్లి కోట్ల రూపాయలతో పేకాట ఆడిరచాడంటే అర్థం చేసుకోవచ్చు..చికోటి లైఫ్‌ స్టైల్‌ పూర్తిగా మార్చేశాడు.. హైక్లాస్‌గా గడుపుతాడు.. ఎక్కడికి వెళ్లినా హంగు ఆర్భాటాలు.. అనునిత్యం ఓ ప్రైవేట్‌ సైన్యం అతడి వెంటే ఉంటుందట.. తాజాగా జరిగిన లష్కర్‌ బోనాలకు వెళ్లిన చికోటి ప్రవీణ్‌ వెంట బాడీ గార్డ్స్‌ వచ్చి హంగామా చేశారు.. ఇక, ఇటీవల కర్మాన్‌ ఘాట్‌లో చికోటి ప్రవీణ్‌ బర్త్‌ డే వేడుకలో ఓ రేంజ్‌లో నిర్వహించారు.. బర్త్‌డే పార్టీకి ప్రత్యేకంగా పాఠల సీడీనే విడుదల చేశారు.. మొత్తంగా నభూతో నభవిష్యతి అనే తరహాలో చికోటీ బర్త్‌డే జరిగింది.. క్యాసినో కింగ్‌ మేకర్‌గా ఉన్న చికోటి గతంలో అనేకసార్లు పోలీసులకు పట్టుబడిన సందర్భాలు ఉన్నా.. మళ్లీ బయటకు రావడం.. యథావిథిగా తన పని చేసుకోవడం జరుగుతూ వచ్చాయి.. ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఈడీ.. ఇప్పుడు చికోటి ప్రవీణ్‌ బర్త్‌డే పార్టీపై ఆరా తీస్తోంది.. బర్త్‌డే కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈడీకి సమాచారం అందింది.. ఆ మొత్తం హవాలా రూపంలో చెల్లించినట్లు గుర్తించారు.. ప్రవీణ్‌ బర్త్‌డేకి రాజకీయ నాయకులు, ప్రముఖుల క్యూ కడితే.. అధికార, ప్రతిపక్షాల నేతలు కూడా వాలిపోయారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు కూడా హాజరయ్యారు.. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనది అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరికుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట.. ఇక, హైదరాబాద్‌ శివారులోని కడ్తాల్‌ సవిూపంలో సాయిరెడ్డిగూడెం దగ్గర చికోటికి ఫామ్‌హౌస్‌ ఉంది.. జూలో ఉండాల్సిన పాములు, ఇతర కొన్ని జంతువులను నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌లో ఉంచాడు.. తాజాగా ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ హేమ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు.. నిబంధనలకు విరుద్ధంగా పాములు, ఆఫ్రికన్‌ దేశానికి చెందిన ఇగుణలు ఉన్నాయని.. ఫామ్‌హౌస్‌లో పైథాన్‌ వుందని సమాచారం వచ్చింది? కానీ, అది కనిపించట్లేదని తెలిపారు. ఫామ్‌హౌస్‌ మొత్తం తనిఖీ చేశాం.. జూలో స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారని తెలిపారు.. అయితే, చికోటి ప్రవీణ్‌ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారు? ఇక్కడ ఎలాంటి పార్టీలు జరగవు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ వున్న జంతువులు, పక్షులకు అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా చికోటి ప్రవీణ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా
RRRRRRRRRRRRRRRRRR
15 పల్లె ప్రగతి నిధులు గోల్‌ మాల్‌
కరీంనగర్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
మునిసిపాలిటీలో నిధులు గతి తప్పుతున్నాయా..? పట్టణ ప్రగతి, హరితహారం కోసం మంజూరైన డబ్బు ఖర్చు చేయడంలో గోల్‌ మాల్‌ జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు స్థానిక కౌన్సిలర్లు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించిన ఆ ప్రాంతంలోనే అక్రమాలకు తెరలేపారన్న విషయమే ఇప్పుడు అక్కడ హాట్‌ టాపిక్‌ గా మారింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మునిసిపాలిటీలో రూ. 40 లక్షల మేర స్కారం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు కౌన్సిలర్లు కూడా ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. హరిత హారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిర్లు డిమాండ్‌ చేస్తున్నారు.
పట్టణ ప్రగతిలో డీజిల్‌ ఖర్చులు రూ. 5,00,000, డ్రైవర్ల జీతాలు రూ. 2,80,000 వెచ్చించినట్టుగా చూపించిన లెక్కలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలపై చర్చించేందుకు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా 2020` 21లో నెలకు రూ. 44 లక్షల చొప్పున ఏడాదికి గాను రూ. ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు, 2021 `22లో రూ. రెండు కోట్ల 88లక్షలు, 2022 `23లో రూ. కోటి 92 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది. రూ. 83 లక్షలతో స్వీపింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశారు. ఈ నెల19న జరిగిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించారు. మున్సిపల్‌ లో రూ. 40 లక్షల కుంభకోణం జరిగిందని కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.రూ. ఎనభై మూడు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ ఎండకు ఎండుతూ వానకు నానుతుండగా, ఖాళీ మద్యం సీసాలను రేకుల షెడ్డులో స్టోర్‌ చేస్తున్నారు. కానీ స్వీపింగ్‌ మిషన్‌ ను మాత్రం ఆరు బయటే పార్క్‌ చేరడం విమర్శలకు దారి తీస్తోంది.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
16 కొమటిరెడ్డి పాదయాత్ర…. రేవంత్‌ లో టెన్షన్‌
నల్గొండ, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణలో పాదయాత్రల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దఫాలు పూర్తి చేసుకుని మూడోసారి ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ పాదయాత్రల అంశం హాట్‌ టాపిక్‌ అవుతోంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అధికార టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి తీసుకువచ్చేలా త్వరలో పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విజయదశమి నుండి తన పాదయత్రను షురూ చేస్తానని.. ఈ పాదయత్రలో భాగంగా టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నట్లు వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పాదయాత్ర థీమ్‌ సాంగ్‌ను సైతం ప్రారంభించారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌లో ఎవరి అనుమతి తీసుకుని ఈ పాదయాత్ర ప్రకటన చేశారనే విషయం పక్కన పెడితే.. ఆయన చేసిన ప్రకటన పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.కోమటిరెడ్డి పాదయాత్ర విషయంలో ప్రకటన చేయడంతో టీపీసీసీ చీఫ్‌పై ఆయన అభిమానులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన రేవంత్‌ రెడ్డికి చాలా కాలంగా ఉంది. ఈ విషయాన్ని ఆయనే గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా కోమటిరెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పడంతో రేవంత్‌ రెడ్డి సైతం పాదయాత్ర చేపట్టాలని అభిమానులు సోషల్‌ విూడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ సారి పాదయాత్ర చేపట్టేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నాలు కొసాగించారని, అయితే అదే సమయంలో బండి సంజయ్‌తో పాటు వైఎస్‌ షర్మిల కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుండటంతో తన పాదయాత్రకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి అనుమతి రాలేదని అందువల్లే రేవంత్‌ రెడ్డి తన ప్రతిపాదనను వాయిదా వేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన పాదయాత్ర అంశాన్ని ప్రస్తావిస్తూ అతి తక్కువ కాలంలో పాదయాత్ర నిర్వహించడం సాధ్యమే అని రేవంత్‌ రెడ్డి పేర్కొనడం అప్పట్లో ఆసక్తిని రేపింది. తాజాగా పార్టీలో కోమటిరెడ్డి పాదయాత్రకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో టీపీసీసీపై ఆయన అనుచరులు, అభిమానులతో పాటు పార్టీలోని ఓ వర్గం పాదయత్రకు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
2021 ఫిబ్రవరిలో నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో రేవంత్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా దీక్షలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన దీక్షను ఒక్కసారిగా పాదయాత్రగా మార్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయం హస్తం పార్టీలో అలజడి రేపింది. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా రావిలాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంటే సీనియర్లు మాత్రం రేవంత్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేక సంప్రదాయం ఉంటుందని హైకమాండ్‌ పర్మిషన్‌ లేనిదే పాదయాత్ర చేపట్టడానికి వీలు లేదని అప్పట్లో సీనియర్లు పెదవి విరిచారు. అయితే, తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాదయాత్రను ప్రకటించడం, యాత్ర ఎక్కడ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే విషయాలు పేర్కొనడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. అయితే, తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడుతాడనే ప్రచారం జరుగుతున్న తరుణంలో వెంకట్‌ రెడ్డి తాను పార్టీ కోసం పాదయాత్ర చేపడతానని ప్రకటన చేయడం పార్టీకి కలిసి వచ్చే అంశమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఈ పాదయాత్రకు మిగతా నేతలు కలిసి వస్తారా? లేక అలకబూనుతారా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
RRRRRRRRRRRR
17 కమలం గూటికి మాజీ ఐపీఎస్‌…?
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. చేరికలపై మరింత ఫోకస్‌ పెట్టారు. చేరికల కమిటీని ఏర్పాటు చేసుకున్న కమలదళం.. మేధావులు, విద్యావంతులను పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానించేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడంపై సస్పెన్స్‌ కొనసాగుతుండగానే.. తాజాగా మాజీ ఐపీఎస్‌ అధికారి టి.కృష్ణ ప్రసాద్‌ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం హాట్‌ టాపిక్‌ గా మారింది. సమాజ సేవ చేస్తూ ప్రజల్లో ఆదరణ కలిగిన కృష్ణ ప్రసాద్‌ ను పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ సుముఖతతో ఉందని తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఆయన కషాయ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ప్రసాద్‌ తో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి.కృష్ణప్రసాద్‌ 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌. ఆయన 2020లో పదవీవిరమణ చేశారు. రిటైర్మెంట్‌ తర్వాత పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా క్షేత్రంలో ఉంటున్నారు. గత కొంతకాలంగా బీజేపీ కీలక నేతలతో టచ్‌ లో ఉన్నారని, నిజానికి ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా.. ఆ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ టీఆర్‌ఎస్‌ ను డిఫెన్స్‌ లో పడేసేలా ఎత్తుగడలను వేస్తోంది. ఇప్పటికే ఓ వైపు ఎమ్మెల్యేలకు, ఎన్నికల్లో ప్రభావం చూపగలిగిన నేతలను పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే.. మరో వైపు మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులపై దృష్టి సారించింది. వచ్చే నెల నుంచి మంచి మూహుర్తాలు రానుండటంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుండి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
18 మళ్లీ తెలంగాణపై టీడీపీ ఫోకస్‌
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్‌ కమిటీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోట అని అన్నారు. తెలంగాణలో మళ్లీ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని.. అద్భుతమైన స్పందన వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ పుట్టింది హైదరాబాద్‌లోనే అని బాబు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని అన్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉండగా.. బాబును ఎమ్మెల్యే పొడెం వీరయ్య, అఖిల పక్షనేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్‌, భద్రాద్రి సరిహద్దులోని 5 గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని కోరారు.ఎంతో ఘన చరిత్ర కలిగిన టీడీపీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ కనుమరుగైపోయింది. టీ టీడీపీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో తెలంగాణలో టీడీపీ మరింత బలహీనమైంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మరో సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.
RRRRRRRRRRRRRRRR
18 మళ్లీ తెలంగాణపై టీడీపీ ఫోకస్‌
హైదరాబాద్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్‌ కమిటీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీకి కంచుకోట అని అన్నారు. తెలంగాణలో మళ్లీ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని.. అద్భుతమైన స్పందన వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ పుట్టింది హైదరాబాద్‌లోనే అని బాబు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని అన్నారు. సెప్టెంబర్‌ రెండో వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉండగా.. బాబును ఎమ్మెల్యే పొడెం వీరయ్య, అఖిల పక్షనేతలు కలిసి.. ఆంధ్రప్రదేశ్‌, భద్రాద్రి సరిహద్దులోని 5 గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని కోరారు.ఎంతో ఘన చరిత్ర కలిగిన టీడీపీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ కనుమరుగైపోయింది. టీ టీడీపీలోని కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో తెలంగాణలో టీడీపీ మరింత బలహీనమైంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మరో సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.
RRRRRRRRRRRRRRRR
19 కాళేశ్వరానికి కేంద్ర బృందం
కరీంనగర్‌, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌? హౌస్‌లు మునగడంపై కేంద్రం పరిశీలన మొదలుపెట్టింది. సీడబ్ల్యూసీ బృందాన్ని కాళేశ్వరానికి పంపించింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌?పీఎస్‌?కుటియాల్‌?నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం మేడిగడ్డ, అన్నారం పంప్‌?హౌస్‌లు, బ్యారేజీలను పరిశీలించింది. ఈ సందర్భంగా కీలక విషయాలపై ఆరా తీసింది. ప్రాజెక్టు పంప్‌ హౌస్‌లు మునగడంపై పలు ప్రశ్నలు సంధించారు. అనుమతులు తీసుకునే సమయంలో ఇచ్చిన డిజైన్లలో లోపాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేసినట్లు అధికారికవర్గాల సమాచారం.అన్నారం పంప్‌?హౌస్‌?మునగడం పై నిర్మాణ లోపాలే కారణమని సీడబ్ల్యూసీ బృందం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 107 అడుగుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించినట్లుగా ప్రభుత్వం డీపీఆర్‌ లో సూచించినట్లు ఇంజినీర్లు చెప్తుండగా.. 105 అడుగుల్లోనే వరద వచ్చిందని, దీనితో ఎందుకు మునిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ 107 అడుగులకు మించి వరద వస్తే.. బ్యారేజీ ల నుంచి ఓవర్‌?ఫ్లో కాలేదనే ప్రశ్నలు వేసినట్లు తెలిసింది.మరోవైపు 24 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంలో మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు నిర్మించగా.. ఇక్కడ గరిష్టంగా 21 లక్షల క్యూసెక్కలు వరద దాటలేదని, దీని ప్రకారం ఎలా మునిగిందని సీడబ్ల్యూసీ ఇంజినీర్ల బృందం అనుమానిస్తోంది. దీనితో పాటుగా హెడ్‌?రెగ్యులేటర్‌? ప్రాంతాలను పరిశీలించారు. హెడ్‌?రెగ్యులేటర్‌?లాక్‌?ఓపెన్‌?కాకుండా నీరెలా వచ్చాయనే దానిపై వివరాలు అడిగారు. దానిపై పరిశీలన చేస్తున్నామని కాళేశ్వరం ఇంజినీర్లు సమాధానమిచ్చారు. అదే సుందిళ్ల దగ్గర ఎందుకు ముంపు లేదనే విషయాలపై ఇంజినీర్ల బృందం వివరాలు సేకరించింది. అటు దేవాదుల ప్రాజెక్టు పరిస్థితిని కూడా సీడబ్ల్యూసీ బృందం అంచనా వేసింది.కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి వరదలతో మునగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరకగా మారింది. మేడిగడ్డ, అన్నారం పంప్‌?హౌస్‌ల్లోకి నీరు వెళ్లడం, మోటర్లు మునిగిపోవడంపై దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు, ఇరిగేషన్‌?నిపుణులు రీ డిజైన్‌ను తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం కూడా పరిశీలనకు దిగడం కొంత మేరకు ఆసక్తిగా మారింది. అయితే, దీనికి సంబంధించిన 10 రకాల అనుమతులు బీజేపీ ప్రభుత్వమే ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. కానీ, అనుమతుల కోసం ఇచ్చిన డిజైన్‌ల మేరకు కాకుండా.. కొన్ని మార్పులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీడబ్ల్యూసీ బృందం.. కేంద్రానికి ఇచ్చే నివేదికపై ఉత్కంఠ నెలకొంది.కాళేశ్వరం థర్డ్‌?టీఎంసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీ అనుమతి కోసం నివేదించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన సీడబ్ల్యూసీ డైరెక్టర్‌?పీఎస్‌? కుటియాల్‌?బృందం.. థర్డ్‌ టీఎంసీ పనులను సైతం పరిశీలించింది. ఇక్కడ సివిల్‌? వర్క్స్‌, కాలువ సామర్థ్యం, మూడో టీఎంసీ తరలింపునకు ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే వివరాలను ఇంజనీర్ల దగ్గర నుంచి సేకరించింది. సీడబ్ల్యూసీ బృందంతో పాటుగా జీఆర్‌?ఎంబీ ఇంజనీర్లు కూడా ఈ పరిశీలన పర్యటనలో ఉన్నారు
RRRRRRRRRRRRRRRRRRలీలీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *