కడపలో స్టీల్‌ ప్లాంట్‌ అడుగులు

కడప, అక్టోబరు 19
రాయలసీమ ప్రాంత ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న కడప స్టీల్‌ ప్లాంట్‌తో ఏర్పాటుకు వడివడిగా అడుగులుపడుతున్నాయి. ఇందులో భాగంగా జేఏస్‌ డబ్ల్యూ సంస్థ రంగంలోకి దిగింది. సున్నపురాళ్లపల్లెలో స్థలాన్ని జిందాల్‌ స్టీల్‌ వర్క్‌ మేనేజ్మెంట్‌ ఇద్దరు జపనీస్‌ వారితో కలిసి ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి సందర్శించారు. ఈ మేరకు ఆర్డిఓ శ్రీనివాసులు వారికి స్వాగతం పలికారు. మండల పరిధిలోని సున్నపురాల పల్లె మాజార కన్నెతీర్థం వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం వైఎస్‌ జగన్‌ వచ్చి జిందాల్‌ వారితో రెండోసారి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో స్థలాన్ని చూపించి వారికి కావలసిన సమాచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఇకపోతే కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కడప స్టీల్‌ ప్లాంట్‌తోపాటు రాష్ట్రంలోని పలు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కడప స్టీల్‌ ప్లాంట్‌తో పాటు మొత్తం రూ.23,985కోట్ల రుపాయల పెట్టుబడులకు అమోదం లభించిందని తెలిసిందే. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండు విడతల్లో మొత్తం రూ.8,800 కోట్ల పెట్టుబడులు పెడతారు. జేఎస్‌ డబ్ల్యూ గ్రూప్‌ మొత్తం 22 బిలియన్‌ డాలర్ల కంపెనీ. ఈ జేఎస్‌ డబ్ల్యూ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా స్టీల్‌, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్‌ రంగాల్లో కంపెనీ ప్లాంటులు ఉన్నాయి. ఏడాదికి 27 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులను సాధిస్తున్న కంపెనీ కడపలో కూడా ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపడుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీగఢ్‌, ఒడిశాల్లో జేఎస్‌ డబ్ల్యూకి కర్మాగారాలు ఉన్నాయి. త్వరలోనే ఏపీలో కూడా ప్లాంట్‌ నిర్మాణం జరగబోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *