01 అజ్ఞాతంలో టీడీపీ నేతలు
గుంటూరు, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
వరుపుల రాజా. ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్‌. 2019లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. మధ్యలో ఒకసారి పార్టీ పై విమర్శలు చేసి దూరంగా ఉండి.. తిరిగి పసుపు కండువా కప్పుకొన్నారు. రాజా గతంలో లంపకలోవ పియేసీఎస్‌ ప్రెసిడెంట్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డిసిసిబి చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హస్తానికి హ్యాండ్‌ ఇచ్చి సైకిల్‌ ఎక్కేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. లంపకలోవ సొసైటీలో అక్రమాలు జరిగాయని గతంలో సిఐడి కేసు నమోదైంది. 15 కోట్ల మేర అవినీతి జరిగిందని సహకార శాఖ విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేసును పోలీసులు దర్యాప్తు చేసి సిఐడి కి బదిలీ చేశారు.ఆ సమయంలో వెంటనే అలెర్ట్‌ అయిన వరుపుల హైకోర్టు నుంచి అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే పది రోజుల క్రితం సిఐడి అధికారులు గండేపల్లి సొసైటీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. చనిపోయిన వ్యక్తులు బతికి ఉన్నట్టుగా సంతకాలు పోర్జరీ చేసి కోట్ల రూపాయల నొక్కేశారనేది ఆరోపణ. ఆ కేసులో సిఐడికి చిక్కకుండా కరెంట్‌ పోయినప్పుడు రాజా ఎస్కేప్‌ అయ్యారు. అది జరిగి పది రోజులు గడుస్తున్నా.. టీడీపీ నేత ఎక్కడున్నారో జాడ తెలియడం లేదట.ఈ మొత్తం వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో రాజా వల్ల లబ్ధి పొందిన కొందరు పోలీసులు ఆయనకు లీకులు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు రాజా ఇంటికి వచ్చినప్పుడు స్థానిక పోలీసులు భారీగా మోహరించారు. అదే సమయంలో కరెంట్‌ పోవడంతో రాజా తప్పించుకోవడం.. అది ఆయన ఒక్కరి వల్ల సాధ్యం కాదని చెవులు కొరుక్కుంటున్నారట. బ్యాక్‌ బోన్‌ సపోర్ట్‌ వల్ల కథ సుఖాంతమైందనే టాక్‌ నడుస్తోంది. ఎవరో కావాల్సిన వాళ్లు ఉప్పు అందించారని అనుమానిస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు ఈ కేసుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. రాజాను అరెస్ట్‌ ఛేస్తే తమ పరిస్థితి ఏంటి అని విచారణలో మొత్తం కూపీ లాగుతున్నారట. అసలు ఈ కేసు గురించి అధికారులకు ఎందుకు? వాళ్లెందుకు హైరానా పడుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు మాత్రం పది రోజులు గడిచినా సీరియస్‌గా లేరనే టాక్‌ నడుస్తోంది. గతంలో కూడా బెయిల్‌ వచ్చేంత వరకు ఇలాగే సాగదీశారని గుర్తు చేసుకుంటున్నారట. ఇప్పుడూ అదే జరుగుతుందేమోనని కొందరి సందేహం.వరపుల రాజా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ముందస్తు సమాచారంతోనే ఎప్పటిలాగే అవుటాఫ్‌ స్టేషన్‌కి వెళ్లిపోయారని చర్చ జరుగుతోంది. షరా మామూలుగా సిఐడి అధికారుల గాలింపు కొనసాగుతోంది. మరి.. దర్యాప్తులో మలుపులు ఉంటాయో లేక పాత సీనే రిపీట్‌ అవుతుందో చూడాలి.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
02 ఎట్టకేలకు బుట్టాకు పదవి
కర్నూలు, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి పదవులు లభిస్తాయో తెలీదు. అందునా ఇతర పార్టీల్లోకి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చినవారి విషయంలో వెయిట్‌ అండ్‌ సీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా మాజీ ఎంపీ బుట్టా రేణు విషయంలో అదే జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాజీ ఎవ్పిూ బుట్టా రేణుకకు పార్టీ పదవి వరించింది. కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించింది వైసీపీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ.బుట్టారేణుక గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆమె దీనిపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కంటే ఎంపీగా కొనసాగడమే తనకు అమితంగా ఇష్టమని.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననడం ఊహాగానాలేనన్నారు. తనకు ఈ విషయంపై అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా గాని.. ఎంపీగా గాని పోటీ చేసి గెలిచి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు రేణుక.ఎమ్మిగనూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి వున్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని, తన వారసుడిగా తన కొడుకు జగన్‌ మోహన్‌ రెడ్డిని నిలబడతారనే ప్రచారం సాగింది. అక్కడ బుట్టా రేణుక పోటీచేసే అవకాశమే లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీచేయడం బెటర్‌ అంటున్నారు.బుట్టా రేణుక వైసీపీ తరఫున గెలిచి, తర్వాత 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరడంపై విమర్శలు వచ్చాయి. పారిశ్రామిక వేత్తగా వున్న బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. వైఎస్సార్‌సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీని వీడి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలో చేరారు.2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనను మోసం చేసిందంటూ మళ్లీ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.. పార్టీని వీడినందుకు జగన్‌కు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. అలాగే గత ఎన్నికల్లో ఎలాంటి పదవి లేకపోయినా జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల్ని గెలిపించేందుకు ఆమె ప్రయత్నించారు. ఆమె పై వున్న అపప్రథ పోవడంతో పార్టీ అధిష్టానం ఆమెకు పదవి కట్టబెట్టింది. మరి 2024 ఎన్నికల్లో బుట్టా రేణుక ఎక్కడినించి పోటీచేస్తారో వేచి చూడాల్సిందే.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
03 అప్పులు లెక్కలు
విజయవాడ, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖను దాటేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అడ్డగోలుగా అప్పులు చేసి వాటిని బడ్జెట్‌ లో చూపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందుకే కార్పొరేషన్లు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జగన్‌ సర్కార్‌ చేసిన అప్పులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే కేంద్రం పరిగణించింది. ఈ విషయాన్ని గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ కుండబద్దలు కొట్టినట్లు వెల్లడిరచారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు బదులిచ్చారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు రూ. 65,489.36 కోట్లకు పైగా గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. ఇందులో 2020`21లో రూ.46,719.42 కోట్లు, 21`22లో రూ.18,770.54 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చినట్లు చెప్పారు.ఈ సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వమే ఈ ఏడాది ఏప్రిల్‌ 27న కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలియజేసిందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. అలాగే 2020`21లో వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.22,549.5 కోట్లు, 21`22లో రూ.6.287.7 కోట్లు అప్పులు తెచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం 22`23లో కూడా అప్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని వెల్లడిరచారు.ఇక వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డిఅడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్‌ (ఏపీఎస్డీసీ) సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సాధారణ నికర రుణ పరిమితిని ఉల్లంఘించి రుణాలు చేసినట్లు చెప్పారు. వాణిజ్యపరమైన లాభ నష్టాలను, రుణాలను చెల్లించగల ఆదాయ సామర్థ్యాన్ని, నిధులు ఎక్కడకు మళ్లిస్తున్నారో గమనించకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు బ్యాంకులు రుణాలివ్వడాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కూడా తప్పు పట్టిన విషయాన్ని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బీఐ ఆదేశాలను పాటించాలని బ్యాంకులను నిర్దేశించినట్లు తెలిపారు.
కౌంటర్‌ ఇచ్చిన విజయసాయిరెడ్డి
కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న విషయం ఆయనకు ఇప్పుడు తెలిసింది. అంతే రాజ్యసభ సాక్షిగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించేశారు. కేంద్రం రాష్ట్రాలను దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతలా పెంచేస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని నిలదీశారు.ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇంత చేసినా ఆయన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిని వేటినీ ప్రస్తావించలేదు. విశాఖ రైల్వే జోన్‌ కానీ, పోలవరం బకాయిల గురించి కానీ, విశాఖ ఉక్కు ప్రైవైటైజేషన్‌ ఆపాలని కానీ, ఆఖరికి కడప ఉక్కు కర్మాగారం గురించి కానీ ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. జనరల్‌ గా కేంద్రం రాష్ట్రాలను అన్యాయం చేస్తోందని ఓ ప్రసంగం దంచేశారు. అందులో కేంద్రం రాష్ట్రాలను దోచేస్తోందని విమర్శలు గుప్పించారు.ఇంత కాలంగా కేంద్రం తిట్టినట్టు చేస్తే వైసీపీ సర్కార్‌ కనీసం ఏడ్చినట్లు కూడా చేయలేదు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంపై విమర్శలు గుప్పించినట్లు చేశారు. కేంద్రం పట్టించుకోనట్లు చేస్తుంది అంతే అని పరిశీలకులు అంటున్నారు. సెస్‌, సర్‌ చార్జీల్లో రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదనీ అన్నారు. ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఆర్థిక సంక్షోభం అంచున నిలిచిన నేపథ్యంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నమే విజయసాయి రాజ్యసభలో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెత్తపై పన్ను కేంద్రం వేసిందా అని పరిశీలకులు నిలదీస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పుల కారణంగా ఇకపై అప్పులు పట్టిని దుస్థితిలో ప్రజల దృష్టి మరల్చి గట్టెక్కాలన్న ఉద్దేశంతోనే విజయసాయి కేంద్రంపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
04 పెరుగుతున్న అమ్మాయిల మిస్సింగ్‌
అనంతపురం, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా … తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు.జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657 మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్‌ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు. రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సవిూపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్‌ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు.
రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్‌ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు.
పోలీసు కౌన్సిలింగ్‌ తీరు…
ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి.
అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి?
ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది.
ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది.
మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి.
ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
05 తిరుపతిలో భారీగా ఉసిరి…సాగుబడి
తిరుపతి, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది.పండిరచే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్‌లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది.ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి?విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్‌ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది.విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు.ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్‌లు, ఆయిల్‌, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
06 ఎన్నికలపై ఫుల్లు ఫోకస్‌
విజయవాడ, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
జగన్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల కు ముందు నుంచే పార్టీ పై ఫుల్లుగా ఫోకస్‌ పెట్టారు. వరసగా ఎమ్మెల్యేలతో సమావేశాలు. ఆ తర్వాత ముఖ్య కార్యకర్తలతోనూ సమావేశం కాబోతున్నారు. అయితే మూడేళ్లుగా పార్టీని పట్టించుకోని జగన్‌ ఈ రెండేళ్లు పాలనతో పాటు పార్టీకి కూడా కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే వ్యూహరచనలో ఉన్నారు. తాను సంక్షేమ పథకాలను అమలు చేసి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. కానీ నియోజకవర్గాల్లో నాయకత్వం సరిగా లేకపోతే ఓటు బ్యాంకు కీలకమైన ఎన్నికల సమయంలో చెల్లాచెదురై పోయే ప్రమాదముంది. అందుకే క్యాడర్‌ తోనూ సమావేశమవుతున్నారు. ఇలా పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలకు జగన్‌ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసులతో అనేక మందిని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు వినిపించినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను అనుకున్నట్లు నియోజవకర్గాల్లో పరిస్థితులను బట్టి అక్కడి నేతల ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు. కానీ టీడీపీని మరింత వీక్‌ చేసేందుకు మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ముఖ్యమైన నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు జగన్‌ సిద్ధమవుతున్నారని సమాచారం. అనేక నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ వ్యతిరేకతను టీడీపీ నేతలు సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి. అయితే వారిలో కొందరికి టీడీపీపై నమ్మకం లేదు. టిక్కెట్‌ కోసం చివరి నిమిషం వరకూ వెయిట్‌ చేయాల్సి వస్తుంది. టెన్షన్‌ పడాల్సి వస్తుంది. అంతేకాకుండా 40 శాతం యువతకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో కొందరు అసహనంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ఉన్నా తమకు టిక్కెట్‌ దక్కే అవకాశం లేదని కొందరు నమ్ముతున్నారు.పార్టీలోకి తీసుకునేందుకు జగన్‌ సిద్ధమయ్యారని తెలిసింది. జగన్‌ కూడా సిట్టింగ్‌ లలో చాలా మందిని మారుస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో కొందరు టచ్‌ లోకి వచ్చారని తెలిసింది. అయితే టిక్కెట్‌ పై హావిూ ఇవ్వకపోయినా జగన్‌ పై ఉన్న నమ్మకంతో చేరవచ్చని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. జగన్‌ ను నమ్మివచ్చిన నేతలందరికీ పదవులతో న్యాయం చేశారని, అందుకే చాలా మంది చేరేందుకు ఆసక్తిక కనపరుస్తున్నారని సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ శ్రావణ మాసంలో కొందరు చేరే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి. జగన్‌ చెంతకు ఇప్పటికే చేరికలకు చెందిన జాబితా సిద్ధమయిందని, అయితే దానికి జగన్‌ ఓకే చెప్పాల్సి ఉంది.
RRRRRRRRRRRRRRR
07 అండర్‌ సీ టూరిజం…
విశాఖపట్టణం, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్‌ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్‌ అకాడవిూ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్‌లో 3 స్పాట్స్‌, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్‌ అకాడవిూ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్‌దీవులు, అండమాన్‌ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో విూటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్‌ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్‌ చేయించడంతో పాటు అకాడవిూ ద్వారా సర్టిఫికేషన్‌ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్‌ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్‌ వాటర్‌, అడ్వాన్స్‌ ఓపెన్‌ వాటర్‌ విభాగాల్లో చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్‌ పూల్‌ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సవిూపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ దీవుల్లో మాత్రమే డైవింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్‌ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్‌ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్‌ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్‌ మాస్టర్‌ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 విూటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో విూటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్‌ చేయిస్తారు. రెండిరటిలోనూ 8?11 విూటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు. ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్‌ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్‌కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్‌ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్‌ నుంచి అకాడవిూ సేవలను ప్రారంభించనున్నాం.
RRRRRRRRRRRRRRRRRRRRRR
చంద్రుడిపై కాలు మోపిన మొట్టమొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌.
`నేడు ఆయన జయంతి
చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇతను ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్‌,, యు.ఎస్‌. నావికదళ చోదకుడు (అవియేటర్‌). ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్‌ పైలట్‌. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక లో తోటి పైలట్‌ డేవిడ్‌ స్కాట్తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్‌ యొక్క రెండవ, ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్‌ కొరకు జూలై 20 1969 న అమలుపరచబడిరది. ఈ మిషన్‌ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్‌, బజ్జ్‌ ఆల్డ్రిన్‌ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్‌ కాలిన్స్‌ కమాండ్‌ మాడ్యూల్‌ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్‌ కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడిరది… ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఒహియోలోని వాపకోనెటాలో ఆగస్టు 5, 1930న పుట్టి పెరిగాడు . పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ , అతను ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడుÑ అతని కళాశాల ట్యూషన్‌ కోసం యుఎస్‌ నావికాదళం హోలోవే ప్లాన్‌ కింద చెల్లించింది . అతను 1949లో మిడ్‌షిప్‌మ్యాన్‌ అయ్యాడు మరియు మరుసటి సంవత్సరం నౌకాదళ ఏవియేటర్‌ అయ్యాడు. అతను కొరియన్‌ యుద్ధంలో చర్యను చూశాడు , విమాన వాహక నౌక యుఎస్‌ఎస్‌ ఎసెక్స్‌ నుండి గ్రుమ్మన్‌ ఎఫ్‌9ఎఫ్‌ పాంథర్‌ను ఎగురవేసాడు . . సెప్టెంబరు 1951లో, తక్కువ బాంబింగ్‌ రన్‌ చేస్తున్నప్పుడు, ఆర్మ్‌స్ట్రాంగ్‌ యొక్క విమానం ఒక లోయకు అడ్డంగా ఉన్న యాంటీ`ఎయిర్‌క్రాఫ్ట్‌ కేబుల్‌తో ఢీకొనడంతో దెబ్బతింది, ఇది ఒక రెక్కలో ఎక్కువ భాగాన్ని కత్తిరించింది. ఆర్మ్‌స్ట్రాంగ్‌ బలవంతంగా బెయిల్‌ను పొందవలసి వచ్చింది. యుద్ధం తరువాత, అతను పర్డ్యూలో తన బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసాడు మరియు కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ వద్ద నేషనల్‌ అడ్వైజరీ కమిటీ ఫర్‌ ఏరోనాటిక్స్‌ (నాసా) హై`స్పీడ్‌ ఫ్లైట్‌ స్టేషన్‌లో టెస్ట్‌ పైలట్‌ అయ్యాడు. అతను సెంచరీ సిరీస్‌ యుద్ధ విమానాలపై ప్రాజెక్ట్‌ పైలట్‌ మరియు ఉత్తర అమెరికా యెక్స్‌`15 ని ఏడుసార్లు నడిపాడు. అతను యుఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ యొక్క మ్యాన్‌ ఇన్‌ స్పేస్‌ సూనెస్ట్‌ మరియు యెక్స్‌`20 డైనా`సోర్‌లో కూడా పాల్గొన్నాడు. మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమాలు.ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాసా ఆస్ట్రోనాట్‌ కార్ప్స్‌లో రెండవ సమూహంలో చేరాడు , ఇది 1962లో ఎంపిక చేయబడిరది. అతను మార్చి 1966లో జెమిని 8 యొక్క కమాండ్‌ పైలట్‌గా తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేసాడు, అంతరిక్షంలో ప్రయాణించిన నాసా యొక్క మొట్టమొదటి పౌర వ్యోమగామిగా నిలిచాడు. పైలట్‌ డేవిడ్‌ స్కాట్‌తో ఈ మిషన్‌ సమయంలో , అతను రెండు అంతరిక్ష నౌకలను మొదటి డాకింగ్‌ చేశాడు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ తన రీ`ఎంట్రీ కంట్రోల్‌ ఫ్యూయెల్‌లో కొంత భాగాన్ని ఇరుక్కుపోయిన థ్రస్టర్‌ వల్ల ఏర్పడే ప్రమాదకరమైన రోల్‌ను స్థిరీకరించడానికి ఉపయోగించిన తర్వాత మిషన్‌ రద్దు చేయబడిరది. అపోలో 11 యొక్క కమాండర్‌గా ఆర్మ్‌స్ట్రాంగ్‌ యొక్క రెండవ మరియు చివరి అంతరిక్షయానం కోసం శిక్షణ సమయంలో , అతను లూనార్‌ ల్యాండిరగ్‌ రీసెర్చ్‌ వెహికల్‌ నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది.క్రాష్‌కి క్షణాల ముందు. జూలై 20, 1969న, ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరియు అపోలో 11 లూనార్‌ మాడ్యూల్‌ పైలట్‌ బజ్‌ ఆల్డ్రిన్‌ చంద్రునిపై ల్యాండ్‌ చేసిన మొదటి వ్యక్తులు అయ్యారు , జులై 20, 1969న మానవ జాతి చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అప్పటివరకు భూగోళానికే పరిమితమైన మనిషి తన ప్రస్థానాన్ని మరో ప్రపంచంలో ప్రారంభించాడు. తొలిసారిగా చందమామను అందుకున్నాడు. లక్షల మంది శ్రమ, కోట్లాది మంది ఆశలు, ఆకాంక్షలు నెరవేరిన శుభదినం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన అపోలో`11 వ్యోమనౌక ద్వారా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైకెల్‌ కొల్లిన్స్‌, ఎడ్విన్‌ ఇ అల్డ్రిన్‌ను చంద్రుడిపైకి పంపింది. వీరిలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డులకు ఎక్కాడు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్‌ చంద్రుడిపై కాలు మోపాడు. వాళ్లు దాదాపు 21 గంటలు చంద్ర మండలంపై గడిపారు.ఇక, చంద్రుడిపై ఏముందో తెలుసుకోడానికి తొలిసారిగా ప్రయోగాలు చేసిన దేశం.. రష్యా. సోవియట్‌ 1957లో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించింది. 1959లో లూనా`2 ద్వారా చంద్రుడిపై తొలిసారి ఉపగ్రహాన్ని పంపింది. ఇది విజయవంతం కావడంతో 1961 ఏప్రిల్‌ 21న ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న అమెరికా నేరుగా వ్యోమగాములను పంపాలనే సాహోసేత నిర్ణయం తీసుకుంది. చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర కోసం నాసా అపోలో మిషన్‌ చేపట్టింది. దీనికోసం దాదాపు 2,500 కోట్ల డాలర్లు ఖర్చుచేయగా, దాదాపు 4 లక్షల మంది నిపుణులు పనిచేశారు.1969 జులై 16న జాన్‌ ఎఫ్‌ కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్‌`5 అనే రాకెట్‌ ద్వారా అపోలో`11 వ్యోమనౌక అంతరిక్షంలోకి పంపారు. 110 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జులై 20న అపోలో`11 చంద్రుడిపై దిగింది. వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మైకేల్‌ కొలిన్స్‌ లూనార్‌ మాడ్యూల్‌లో చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టారు. మరో వ్యోమగామి బజ్‌ ఆల్డ్రిన్‌ కమాండ్‌ మాడ్యూల్‌లో ఉండి వారిని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చడానికి సహకరించారు. లూనార్‌ మాడ్యూల్‌ చంద్రుడి ఉపరితలంపై ఉన్న సీ ఆఫ్‌ ట్రాన్‌క్విలిటీ అనే ప్రాంతంలో దిగింది.ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై దిగిన 20 నిమిషాల తర్వాత కొలిన్స్‌ అడుగుపెట్టాడు. ‘ఇది మనిషిగా ఒక చిన్న అడుగు.. మానవాళికి మాత్రం భారీ గెంతు’ అని ఈ సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ గట్టిగా అరిచారు. చంద్రుడి ఉపరితలంపై దాదాపు రెండు గంటలు గడిపారు. అక్కడ అమెరికా జెండాను నాటారు. చంద్ర శిలలు, మట్టి నమూనాలను సేకరించి, ఫొటోలు తీసుకొని, ప్రయోగ పరికరాలను అక్కడ వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ నుంచి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత జులై 24న పసిఫిక్‌ మహాసముద్రంలోకి అపోలో`11 సురక్షితంగా దిగింది.వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన దాదాపు 21.5 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను పరిశోధనల కోసం వివిధదేశాలకు నాసా పంపిణీ చేసింది. ఆస్ట్రోనాట్లు చంద్రుడిపై దిగడాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా, ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది దీన్ని వీక్షించినట్లు అంచనా. నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ టెలిఫోన్‌`రేడియో ట్రాన్స్‌మిషన్‌ ద్వారా వ్యోమగాములతో మాట్లాడారు. వైట్‌హౌస్‌ నుం చి చేసిన చారిత్రక ఫోన్‌కాల్‌ ఇది అని అభివర్ణించారు. అప్పట్లో వాళ్లు ఉపయోగించిన గైడెన్స్‌ సిస్టమ్‌ కేవలం 64 కేబీ మెమరీ ర్యామ్‌తోనే పనిచేయడం గమనార్హం. అంటే, మన స్మార్ట్‌ ఫోన్‌లోని ఉన్న మెమరీ కంటే చాలా తక్కువ. అప్పుడప్పుడే టెక్నాలజీ ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలో నాసా ఏకంగా మనిషిని చంద్ర మండలంపై పంపిందంటే సాధారణ విషయం కాదు…. ఆర్మ్‌స్ట్రాంగ్‌ మొదటిసారి చంద్రుని ఉపరితలంపైకి అడుగుపెట్టినప్పుడు, అతను ప్రముఖంగా ఇలా అన్నాడు: ‘‘ఇది మనిషికి ఒక చిన్న అడుగు, మానవజాతికి ఒక పెద్ద ఎత్తు.’’ ఇది ప్రపంచవ్యాప్తంగా 530 మిలియన్ల మంది వీక్షకులకు ప్రత్యక్ష ప్రసారం చేయబడిరది. అపోలో 11 అంతరిక్ష పోటీలో యుఎస్‌ విజయాన్ని సమర్థవంతంగా నిరూపించింది, 1961లో అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ ప్రతిపాదించిన జాతీయ లక్ష్యాన్ని నెరవేర్చడం ద్వారా , దశాబ్దం ముగిసేలోపు ‘‘చంద్రునిపై మనిషిని దింపడం మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం’’. కాలిన్స్‌ మరియు ఆల్డ్రిన్‌లతో పాటు, ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ నిక్సన్‌ ద్వారా ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడం లభించింది మరియు 1969 కొలియర్‌ ట్రోఫీని అందుకున్నారు . ప్రెసిడెంట్‌ జివ్మిూ కార్టర్‌ అతనికి 1978లో కాంగ్రెషనల్‌ స్పేస్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌ను అందించాడు , అతను 1979లో నేషనల్‌ ఏవియేషన్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ప్రవేశించబడ్డాడు మరియు అతని మాజీ సిబ్బందితో కలిసి 2009 లో కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు.అతను 1971లో నాసా నుండి వైదొలిగిన తర్వాత, ఆర్మ్‌స్ట్రాంగ్‌ 1979 వరకు సిన్సినాటి విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో బోధించాడు . అతను అపోలో 13 ప్రమాద పరిశోధనలో మరియు రోజర్స్‌ కమిషన్‌లో పనిచేశాడు , ఇది స్పేస్‌ షటిల్‌ ఛాలెంజర్‌ విపత్తును పరిశోధించింది . ఆగష్టు 25,2012లో ఆర్మ్‌స్ట్రాంగ్‌ 82 సంవత్సరాల వయస్సులో కరోనరీ బైపాస్‌ సర్జరీ వల్ల ఏర్పడిన సమస్యల కారణంగా మరణించాడు .
RRRRRRRRRRRRRRRRRRRRRRR
కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చె మహాలక్ష్మే ఈ వరలక్ష్మి
`సాక్షాత్తు లక్ష్మి స్వరూపులైన అక్కాచెల్లెళ్లకు నేటి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్‌ , కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారత దేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు. ప్రార్థన నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితేశంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతేతాత్పర్యంమహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. పురాణ గాధ స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.ఎందుకు ఈ వ్రతం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం విూదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది ` పెద్దది, దీపారాధన కుంది ` చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము ` దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, పానకము, పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,వ్రత విధి విధానం తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనవిూయవలెను.తోరగ్రంథి పూజ తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.ఓం కమలాjైు నమ ప్రథమ గ్రంథిం పూజయామి.ఓం రమాjైు నమ ద్వితియ గ్రంథిం పూజయామి.ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.వరలక్ష్మి వ్రత కథ ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, ’’ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు’’డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, ‘‘దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను’’ అనెను. అది విని యామె, ‘‘స్వావిూ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ’’య వేడెను. మరియు, ‘‘ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద’’ ననెను. అంతట పరమేశ్వరుడు ‘‘ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము’’ అని కథ చెప్పెను.పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, ‘‘చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద’’ నని చెప్పి మాయమవుతుంది. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాంశ్రీ రంగథామేశ్వరీం।
దాసీభూత సమస్తదేవ వనితాంలోకైక దీపాంకురాం।
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవఃబ్రహ్మేంద్ర గంగాధరాం।
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాంవందేముకుందప్రియాం॥అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరుతుంది.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRR
తుపాకి కల్చర్‌ నియంత్రించే చర్యలు,,
విశ్లేషణ)
ఇంకా నాగరిక విలువలూ, ప్రజాస్వామిక విలువలూ పూర్తిగా వికసించని మూడు శతాబ్దాలనాడు అంటిన తుపాకి సంస్కృతి చీడను అమెరికా సమాజం ఇప్పటికీ వదుల్చుకోలేకపోతున్నదని గురువారం అక్కడ జరిగిన రెండు భిన్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈమధ్యకాలంలో వరసగా టెక్సాస్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఉన్మాదుల తుపాకి గుళ్లకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాక అమెరికన్‌ కాంగ్రెస్‌ ఈ సంస్కృతిని నియంత్రించడానికి నడుం బిగించింది.
తుపాకి పరిశ్రమల లాబీకి అండదండలందించే రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనెటర్లను సైతం ఈ ఉదంతాలు పునరాలోచింపజే సిన పర్యవసానంగా గురువారం రాత్రి సెనేట్‌ 65?33 వోట్ల తేడాతో తుపాకుల లభ్యతను కఠినం చేసే బిల్లును ఆమోదించింది. అదే రోజు మధ్యాహ్నం తుపాకి నియంత్రణకు న్యూయర్క్‌ రాష్ట్రం 109 ఏళ్లక్రితం తీసుకొచ్చిన చట్టం చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలు ధరించి తిరగడం అమెరికన్‌ పౌరుల హక్కని తేల్చిచెప్పింది.ఈ తీర్పు ఇంగిత జ్ఞానానికీ, రాజ్యాంగ విలువలకూ గొడ్డలిపెట్టని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరిగానే వ్యాఖ్యానించారు. ఈమధ్య బఫెలోలో జరిగిన హత్యాకాండకు పదిమంది పౌరులు బలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తుపాకుల బెడదను మరింత పెంచగల ఈ తీర్పునివ్వడానికి న్యాయమూర్తులు వెనకాడలేదు. వాస్తవానికి న్యూయార్క్‌ తుపాకి నియంత్రణ చట్టం అంత కఠినమైనదేవిూ కాదు. మారణాయుధాలు దగ్గర ఉంచుకుంటామనేవారు అందుకు గల కారణాలు వివరించాలి.అవి సంతృప్తికరమైతే లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఇలా షరతు విధించడం పౌరుల హక్కులను హరించడమే అంటున్నది సుప్రీంకోర్టు. గడపదాటి బయటి కెళ్లే ప్రతి ఒక్కరివద్దా ఆత్మరక్షణ కోసం మారణాయుధం ఉండాల్సిందేనని చెబుతున్నది. అందుకు రెండో రాజ్యాంగ సవరణను చూపుతున్నా దాన్ని న్యాయమూర్తులు సక్రమంగా అవగాహన చేసుకోలేదన్నది న్యాయ కోవిదుల వాదన. వరదలూ, తుపానులూ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల ముందు ఎటూ మనిషి నిస్స హాయంగా తలవంచక తప్పడంలేదు. అమెరికాలో తుపాకి సంస్కృతి కూడా ఈమాదిరి వైపరీత్యం గానే పరిణమించింది. మొత్తం 19 రాష్ట్రాలు, వాషింగ్టన్‌లలో ఏదోమేరకు తుపాకి నియంత్రణ చట్టాలున్నాయి. కానీ అవి పెద్దగా అక్కరకు వచ్చిన దాఖలాలు లేవు. అయినా కూడా రాలిపడు తున్న అమాయక ప్రాణాలకు కాదు… ఉన్మాదుల హక్కుకే విలువ అధికమన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.సుప్రీంకోర్టు తాజా తీర్పుతో న్యూయార్క్‌లోనూ, అదే మాదిరి చట్టాలు అమల్లో ఉన్న కాలిఫోర్నియా, హవాయీ, మసాచూసెట్స్‌, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ మారణా యుధాలు విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. తాజాగా అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించిన బిల్లు కూడా ఏమంత సమర్థవంతమైనది కాదు. అది డెమొక్రాట్లు ఆశించిన స్థాయి బిల్లు కాదురిపబ్లికన్‌లలో కొందరి ఆమోదమైనా పొందడం కోసం డెమొక్రాట్లు రాజీ పడి చేసిన మార్పుల పర్యవసానంగా రూపొందిన బిల్లు. మరో వారం పదిరోజుల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టమవుతుంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం ఆ చట్టంపై ఏమేరకుంటుందో చూడాల్సి ఉంది. ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి మారణాయుధాలు పోకుండా ప్రయత్నించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని సెనేట్‌ ఆమోదించిన బిల్లు ప్రతిపాదిస్తోంది. విద్యాసంస్థల భద్రతకూ, మానసిక వ్యాధులను అరికట్టడానికీ రాష్ట్రాలకు వందలకోట్ల డాలర్ల అదనపు నిధులివ్వడానికి వీలుకల్పిస్తోంది. అలాగే 21 ఏళ్లలోపువారికి మారణాయుధాల లభ్యత కఠినతరం చేస్తోంది. అలాంటివారి గత చరిత్రనూ, వారి మానసిక ఆరోగ్యాన్నీ మారణాయుధాల విక్రేత పోలీసుల సాయంతో తెలుసుకోవాల్సి ఉంటుంది.మూడురోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అనుమానాస్పద అంశాలు కనిపిస్తే రెండో దశ తనిఖీ ఉంటుంది. అది పదిరోజులపాటు సాగుతుంది. అసలు మారణాయుధాల కొనుగోలుకు ఇప్పుడున్న కనిష్ఠ వయసు అర్హతను 18 నుంచి 21కి మార్చాలన్న డెమొక్రాట్ల ప్రతిపాదనకు రిపబ్లికన్‌లు అంగీకరించలేదు. సాధారణ పౌరులకు తుపాకులు దక్క నీయకుండా ఏం చేయాలన్న ఆలోచనకు బదులు వాటి పేరుతో విద్యాసంస్థలకూ, ఆసుపత్రులకూ కోట్లాది డాలర్లు దక్కేలా చేయడం వల్ల ఒరిగేదేమిటో అంతుబట్టదు. ప్రజాస్వామ్య దేశంగా కనబడే అమెరికాలో తుపాకుల తయారీ యాజమాన్యాల నేతృత్వంలోని నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌(ఎన్‌ఆర్‌ఏ) సమాజాన్ని శాసిస్తున్నది. తుపాకి కలిగి ఉండటం ఒక హోదాకు చిహ్నమనీ, అది లేకపోతే ఆత్మరక్షణ అసాధ్యమనీ పౌరులకు భ్రమలు కల్పించడంలో అది ఎన్నడో విజయం సాధించింది. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఎన్‌ఆర్‌ఏ లాబీలు పనిచేస్తుంటాయి.కాకపోతే రిపబ్లికన్‌లతో పోలిస్తే డెమొక్రాట్లు కాస్త నయం. 2020లో తుపాకులకు 45,222 మంది మరణించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో మూకుమ్మడి హత్యా కాండలు మొదలుకొని ఆత్మహత్యల వరకూ అన్నీ ఉన్నాయి. తుపాకి నీడన బతుకీడ్చే దుస్థితినుంచి సాధ్యమైనంత త్వరగా అమెరికా బయటపడాలని, బైడెన్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ఆ దిశగా ఒక మంచి ప్రారంభమవుతుందని ఆశించాలి.
RRRRRRRRRRRRRRRRRRRRRR
08 మళ్లీ వలసలు తప్పవా
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో తెలంగాణా కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో ఉండగా మరోవంక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం అంతకు మించి అన్నట్టు తయారయింది. నిత్యం వార్తల్లో ఉండే జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా మౌనం వహించారు. కనీసం గాంధీభవన్‌ మెట్లన్నా ఎక్కడం లేదు. ఢల్లీిలో రాహుల్‌ గాంధీతో సమావేశం తర్వాత జగ్గారెడ్డి వ్యవహార శైలిలో ఊహించని మార్పే వచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ అధినేతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందువల్ల పార్టీ విషయాలు విూడియాకు చెప్పనని పేర్కొన్న ఆయన అప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలకు దూరం దూరంగానే ఉంటున్నారు. కాగా ఆమధ్య పార్టీ లక్ష్మణరేఖ దాటితే తల గోడకేసి కొడతానని రేవంత్‌ రెడ్డి అనడం జగ్గారెడ్డిని ఆగ్రహానికి ఆజ్యం పోసినట్టయింది. యశ్వంత్‌ సిన్హాను కలిసిన వి.హనుమంతరావును ఉద్దేశించే రేవంత్‌ ఆ విధంగా నోరుపారేసుకున్నాడని జగ్గారెడ్డి ఘాటుగానే విమర్శచేశారు. జగ్గారెడ్డి మౌనం మరింత విస్తరించి ఏకంగా మాణికం ఠాకూర్‌ తో పీసీసీ నాయకుల సమావేశానికి కూడా హాజరు కాలేదు. అంతెందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలతో కాకుండా ఆయన విడిగా ఆఖరి నిమిషంలో వచ్చి ఓటేసి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆయన ఏం చేయబో తున్నారు? ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పటికీ అందరికీ ఓ పజిల్‌ గానే ఉంది. సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజ రైన రోజు కూడా హైదరాబాద్‌లో ఈడీ ఆఫీస్‌ ముందు చేసిన ధర్నాలో పాల్గొనకుండా జగ్గన్న సంగారెడ్డిలో నిరసన దీక్ష చేశారు. ఈయన కూడా ఏదైనా పిడుగు లాంటి మాట చెబుతారమోనని తెలంగాణా పిసిసి నాయకులు ఖంగారుపడుతున్నారు.మరో వైపు కొద్దితేడాతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెరాసాకు పిడగు పాటు వంటి కబురు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే, ఆయన కొంతకాలం నుంచి బీజేపీ లో చేరుతారన్న ప్రచారం గట్టిగానే వినవస్తోంది. త్వరలో బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ ఎస్‌ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం. వీరితో పాటు కాంగ్రెస్‌, టీఆర్‌ ఎస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు కూడా క్యూ కట్టవచ్చని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.తెలంగాణా రాజకీయ రంగం వేడెక్కిన తరుణంలో కేసీఆర్‌ ముందస్తుకు సిద్ధపడితే తుమ్మల వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతోనే కార్యకర్తలను ఉత్సాహపరుస్తు న్నారని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెరాసకు తుమ్మల, కాంగ్రెస్‌ కు జగ్గారెడ్డి ఇద్దరూ పిడుగులాంటి వార్తతో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించి కాంగ్రెస్‌, టీఆర్‌ ఎస్‌ పార్టీలకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నారని పరిశీలకులు అంటున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRR
09 కోటిశ్వరులు పైనే కమలం గురి
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
ఇప్పటికిప్పుడు వ్యాపారం పెంచుకోవాలంటే లక్షాధికారి అవసరం మావా..అంటాడు ఓ సినిమాలో విలన్‌ తాలూకు అల్లుడు. వ్యాపారంతో నలుగురిని పోగేసి ఎగస్పార్టీఓడిని తాటిచెట్టుక్కట్టేయొచ్చు.. అని అసిస్టెంటు సలహా! ఈ రెండో మాట ఎలా వున్నా ప్రస్తుత రాజకీయాలకు ప్రతీ చిన్న ఎన్నికకూ ధనికుల అవసరం బాగా పడుతోంది. ప్రతీ పార్టీ ధనికుల అండదండలతో ప్రశాంతంగా గెలుపు ధీమాతో ఉంటోం ది. ఇపుడు బీజేపీ వారి ఆలోచనా అదే.అసలు బీజేపీ అంటేనే సంపన్నుల పట్ల ప్రత్యేకాదరణ ఉన్న పార్టీ అనే అభి ప్రాయం ఎలాగూ ఉంది. ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరికల తీరు ఉంది. కేవలం సంపన్నులను, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లను ఎంచుకుని మరీ బీజేపీ గాలం వేస్తోంది. ఆర్థికంగా దన్ను ఉన్న వారికి మాత్రమే తమ పార్టీలో ఎంట్రీ అని చెప్పకనే చెబుతోంది. పార్టీని నిలబెట్టడానికి, నడిపించడానికి బీజేపీకి అభిమానులు ఉన్నారు, జెండా భుజాన వేసుకుని జీవితాన్నిపార్టీకోసం పణంగా పెట్టే వీరాభిమానులూ ఉన్నారు. అయితే పార్టీకి ఆర్థిక దన్నుగా నిలబడి అవసరమైనప్పుడు సొమ్ములు వెదజల్లి మరీ పార్టీకి అండగా నిలబడే వారే బీజేపీకి ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి ఇప్పుడు అవసరం అందుకే బీజేపీ ఏరి కోరి మరీ ఆర్థకంగా బాగా పరిపుష్టత ఉన్నవారికి పార్టీలో చేర్చుకుంటోంది. మొన్నటికి మొన్న కొండా విశ్వేవ్వరరెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావులకు బీజేపీ రెడ్‌ కార్పెట్‌ పరిచింది. పరిశీలకుల అబ్జర్వేషన్‌ మేరకు ఎన్నికల ఖర్చుకు వెనకాడని వారిని పార్టీలోకి ఆహ్వానించడం వల్ల చిన్నపాటి సమస్యల్ని ఎదుర్కొనడా నికి వారికి శక్తి ఉంటుందని, ప్రతీ అంశంలోనూ అధిష్టానం కల్పించుకుని పనులు జరిగేలా చూడాల్సిన సమస్య ఉండదని పార్టీ సీనియర్ల మాట. ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించడానికి అవసరమైన ఆర్దిక మద్దతు, జనాకర్షణ సమాజంలో ప్రముఖులు, ధనికులతోనే అవుతుందన్నది బీజేపీ నమ్మకం.ఇకపై పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించాలనుకున్నప్పటికీ ఆర్ధికంగా బలంగా ఉన్న వారినే తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ అధ్యక్షుడికి మౌఖిక ఆదేశాలించ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా సుసంపన్నులన్న సంగతి తెలిసిందే.
RRRRRRRRRRRRRRRRRR
10 యూత్‌ ఫుల్‌ సినిమాలో మాజీ మంత్రి పల్లె
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
చూడు కమిషనర్‌ నేను టై వేసుకున్నంత వరకే కలెక్టర్‌.. టై తీశానంటే టైగర్‌.. ఈ డైలాగ్‌ వింటుంటే బాలయ్య బాబు చెప్పినట్టు ఉంది కదా.. అలా అనుకుంటే విూరు పొరబడినట్టే.. ఈ డైలాగ్‌ చెబుతోంది ఒక మాజీ మంత్రి.. సీనియర్‌ పొలిటీషియన్‌. అందునా రియల్‌ లైఫ్‌ లో కాదు.. రీల్‌ లైఫ్‌ లో పంచ్‌ డైలాగ్‌ లతో అదరగొడుతున్నారు. ఇంతకీ ఎంతో సీనియర్‌ అయిన ఆయన సినిమా ఏంట్రీకి కారణం ఏంటంటే.. గతంలో ఆయన ఫ్యాన్స్‌ హీరోలా ఉన్నావని చెప్పారట.. దీనికి తోడు అనుకోకుండా అవకాశం రావడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారట. లేటు వయసులో ఫేస్‌కు మేకప్‌ వేసుకున్న ఈ మాజీ మంత్రి ఎవరో తెలుసుకుందాం..పల్లె రఘునాథ్‌ రెడ్డి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న నేత. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గా పనిచేసిన ఆయనలో ఇది మరో కోణం అన్నమాట.. అంతేకాదు.. విద్యాసంస్థల అధినేతగా కూడా ఆయన సుపరిచితమే. అందుకే పల్లె రఘునాథ్‌ రెడ్డిని చాలామంది సార్‌ అని.. మరింత దగ్గరైనవాళ్లు అయ్యవారు అని పిలుస్తారు. ఆయన అందరిలాంటి రాజకీయ నేత కాదు.. సాధారణంగా పొలిటికల్‌ లీడర్లు ఓ స్థాయికొచ్చాక.. వాళ్ల ప్రవర్తనే వేరుగా ఉంటుంది. కానీ.. పల్లెలో అలాంటి యాంగిల్‌ కనిపించదు. కొత్తైనా పాతైనా అందరితో కలిసిపోతారు. నవ్వుతూ మాట్లాడుతుంటారు.ఇక పబ్లిసిటీలోఅయితే..పల్లె.. రామ్‌గోపాల్‌ వర్మను గుర్తు తెస్తుంటారు. మంత్రిగా ఉన్న టైమ్‌లో కూడా పల్లె చేసిన కొన్ని పనులు నవ్వు తెప్పించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే డ్రస్సింగ్‌ స్టయిల్‌ , ఇంకొకటి మంత్రిగా ఉన్న సమయంలో బహిరంగంగా షర్ట్‌ ఫ్యాంట్‌ తీసి చెరువుల్లో ఈత కొట్టడం, కూలీలా పని చేయడం ఇలా చెబుతూ పోతే పల్లె వేషాలు చాలానే ఉన్నాయి. ఎక్కడికెళ్లినా.. తనే అట్రాక్షన్‌గా ఉండేలా చూసుకుంటారు. మైకు అందుకుంటే గంటలు నిమిషాలవుతాయన్నమాట.ఇప్పటివరకు ఇలా కనిపించిన పల్లె ఇప్పుడు మూడో అవతారం చూపిస్తానంటున్నారు. అదే..యాక్టింగ్‌.. అనంతపురం జిల్లాకు చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే నిర్మాత..ఐక్యూ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. పల్లె సార్‌కు చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా. సినిమా కోసం కాలేజీలు అడిగారు దర్శక నిర్మాతలు. అలాగే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర ఉందని.. దానికి విూరు సూట్‌ అవుతారని చెప్పగా..పల్లె రెడీ అని వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో పల్లె రఘునాథరెడ్డి జిల్లా కలెక్టర్‌గా పవర్‌ ఫుల్‌ రోల్‌ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి సీన్లు కూడా పూర్తయ్యాయి.ఇందులో మన పల్లె చెప్పిన తొలి డైలాగ్‌ ఏంటంటే.. చూడు కమిషనర్‌ నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్‌.. టై తీస్తే టైగర్‌ అని.. ఈ సినిమాలో కమిషనర్‌ గా సుమన్‌ సహా.. పలువురు ప్రముఖ నటీనటులు ఉన్నారట. గతంలో పల్లె ఐటీ మినిస్టర్‌ గా ఉన్నప్పుడు అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగువారు..విూరు హీరోలా ఉన్నారు సార్‌..సినిమాల్లో ఎందుకు నటించకూడదని అన్నారట. ఆ ముక్క సారు బుర్రలో బాగా పాతుకుపోయింది. ఇంతకాలానికి అనుకోకుండా అలాంటి అవకాశం రావడంతో..రెండో మాట లేకుండా ఒప్పుకున్నారు. మరి ఇప్పటికే విద్యావేత్తగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన పల్లె ఇప్పుడు నటుడిగా కూడా కనిపించబోతున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRR
11 సెకండ్‌ ఇన్నింగ్స్‌ దారి చూపిస్తున్న ఓటీటీలు
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
ఒకప్పుడు రాణించిన తారలందరూ ఇప్పుడు తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు మెల్లగా ఫెడ్‌ అవుట్‌ అయిపోయారు. కొత్త అందాలు, కొత్త టాలెంట్‌ లు వస్తున్న తరుణంలో చాలా మంది కనుచూపు మేరలో కూడా కనపడకుండా వెళ్లిపోయారు. కొంతమందిని అయితే జనాలు పూర్తిగా మర్చిపోయారు కూడా.. అయితే చాలా మంది తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ఛాన్స్‌ దొరికితే మరోసారి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే అవకాశాలు మాత్రం పలకరించడం లేదు. ఇటీవల ఓటీటీల హంగామా ఎక్కువ కావడంతో ఫేడ్‌ అవుట్‌ అయిన స్టార్స్‌ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ లు వరదలా వస్తున్న నేపథ్యంలో ఓటీటీలు ఆ స్టార్స్‌ ను ఎంచుకుంటున్నారు. ఇలా వస్తున్న వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు వీరే..హీరోయిన్‌ సదా ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. జయం సినిమాతో పరిచయం అయిన సదా ఆతర్వాత తమిళ్‌ భాషల్లోనూ సినిమాలు చేసి పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువకాలం రాణించలేక పోయింది. మెల్లగా అమ్మడి కి నిమ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ మధ్య పలు టీవీషోలో జేడ్జ్‌ గా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీ పరిచయం అయిన ఆర్యన్‌ రాజేష్‌ కూడా హీరోగా పలు సినిమాలో మెప్పించారు. అయితే ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు. చాలా కాలం తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా హిట్‌ అవలేదు. ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌ తో మరోసారి తన అదృష్ఠంని పరీక్షించుకుంటున్నారు.ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వాళ్లలో సుశాంత్‌ ఒకరు. కరెంట్‌ కాళిదాస్‌ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుశాంత్‌. కరెంట్‌ సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఆతర్వాత వరుస గా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయాయి. చివరిగా అల్లు అర్జున్‌ నటించిన అలవైకుంఠపురం లో సినిమాలో సెకండ్‌ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మా ఊరి నీళ్ల ట్యంక్‌ అనే సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే హీరోయిన్‌ లయ కూడా చాలా కాలం తర్వాత సోషల్‌ విూడియాలో దర్శనమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో లయ సోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. రకరకాల డాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు లయ. మరి ఇలా ఫేడ్‌ అవుట్‌ అవుతున్న తారలు ఓటీటీ ద్వారా తిరిగ్గి క్లిక్‌ అవుతారేమో చూడాలి.
RRRRRRRRRRRRRRRRRRRRచీచీచీ
12 మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం …ఇద్దరు మృతి
కాకినాడ
తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి శివారులో గల పరమేష్‌ బయోటెక్‌ మొక్కజొన్న ఫ్యాక్టరీ లో ప్రమాదం చోటు చేసుకుంది.బాయిలర్‌ క్లీన్‌ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఒడిస్సాకు చెందిన డమా బీరువా(23), తిరుగుడు మెట్ట గ్రామానికి చెందిన గాజుల శ్రీను (26)గా గుర్తించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా మేనేజ్‌మెంట్‌ కార్మికులను బాయిలర్‌ క్లీనింగ్‌కు పంపించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ అందక అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా పరిశ్రమలోకి విూడియాను అనుమతించేందుకు యాజమాన్యం నిరాకరించింది.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
13 మునుగోడులో రేవంత్‌ టార్గెట్‌ పాలిట్రిక్స్‌
నల్గొండ, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా.. అన్ని పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. మొన్నటిదాకా రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారుతారా? లేదా, రాజీనామా చేస్తారా.. చేయరా.. అనే అంచనాల్లో ఉన్న రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఉపఎన్నిక వస్తే మునుగోడులో ఎవరు గెలుస్తారనే లెక్కలు మొదలయ్యాయి. ప్రధానంగా సిట్టింగ్‌ స్థానం కావడంతో ఫోకస్‌ అంతా కాంగ్రెస్‌ పైనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు తామే ప్రత్యామ్నాయం అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్‌.. ఇక్కడ గెలవకుంటే దాని పర్యావసనాలు పార్టీ భవిష్యత్‌ కు తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక, నాగార్జున సాగర్‌?, హుజురాబాద్‌? ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌? చావు దెబ్బ తింది. మొదట్లోనే సిట్టింగ్‌? స్థానం హుజూర్‌ నగర్‌? ను చేజేతులా జారీ చేసుకుంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆసలే చక్రబంధంలో కొట్టుమిట్టాడుతున్న రేవంత్‌? రెడ్డికి మొన్న హుజురాబాద్‌?, ఇప్పుడు మునుగోడు కీలకంగా మారాయి. ఇదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌? ఒక్కటే రాగమెత్తారు. ఇప్పటికే రాజగోపాల్‌? రెడ్డి.. టీపీసీసీ చీఫ్‌? రేవంత్‌?పై అగ్గై మండుతుంటే.. తాజాగా దానికి ఎంపీ వెంకటరెడ్డి తోడయ్యాడు. తనదీ కాంగ్రెస్‌? కుటుంబం అంటూనే.. సొంత పార్టీలో మళ్లీ వ్యతిరేక జెండా ఎగురవేశారు. తాజాగా ఢల్లీిలో మాట్లాడిన వెంకటరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో ఒక్కసారిగా దుమారం రేపాయి.నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌? గా పేరొందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌? రెడ్డిల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేస్తే.. మరోకరు ఇంకా పార్టీలోనే ఉన్నారు. రేవంత్‌? రెడ్డి పీసీసీ చీఫ్‌? ప్రకటన తర్వాత వెంకటరెడ్డి పలుమార్లు వ్యతిరేకస్వరం వినిపించినా.. రాజగోపాల్‌? రెడ్డి మాత్రం పేరెత్తలేదు. అంతేకాకుండా రేవంత్‌? కు అవకాశం ఇవ్వాలని కూడా రాజగోపాల్‌? రెడ్డి చెప్పారని తాజాగా రేవంత్‌? రెడ్డి ప్రకటించారు.పార్టీకి రాజీనామా తర్వాత రాజగోపాల్‌? రెడ్డి.. ప్రధాన టార్గెట్‌? రేవంత్‌? పైనే పెట్టారు. ఇలాంటి సమయంలో ఎంపీ వెంకటరెడ్డి కూడా జత కలిశారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారో స్పష్టత లేని రాజగోపాల్‌?.. రేవంత్‌? రెడ్డిని బ్లాక్‌? మెయిలర్‌? అంటూ విమర్శించారు. తాజా పరిణామాల్లో రెండు రోజుల నుంచి సైలెంట్‌? గా ఉన్న వెంకటరెడ్డి కూడా బుధవారం సాయంత్రం రేవంత్‌? రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది కాంగ్రెస్‌? కుటుంబమని, పార్టీ ఏం ఆదేశిస్తే అదే చేస్తానంటూ చెప్తూనే.. రేవంత్‌? రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని, రాజగోపాల్‌? రెడ్డి అంశంపై మాట్లాడుతూ విూరు.. విూరూ అంటూ తనను కూడా కలిపి మాట్లాడరని, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్‌? రెడ్డి పుట్టలేదంటూ సీరియస్‌? అయ్యారు. బ్రాందీ షాపులు పెట్టుకున్నారని అన్నారని, తనపై అలా మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాంటూ మండిపడ్డారు. దీంతో అన్నదమ్ములది ఒక్కటే స్వరంగా మారింది. పార్టీ వ్యవహారాలు, ఉప ఎన్నికలు వంటి అంశాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ఇద్దరన్నదమ్ములు రేవంత్‌? రెడ్డి టార్గెట్‌? గా తుపాకీ పేల్చుతున్నారు.రాజగోపాల్‌ రెడ్డి ఏపిసోడ్‌ లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ముప్పెట దాడికి దిగుతోంది. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి విరుచుకుపడగా.. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో మునుగోడు అంశంలో బీజేపీ టార్గెట్‌ రేవంత్‌ రెడ్డిగా రాజకీయం చేయబోతోందా? అనే అనుమానాలున్నాయి. కనీసం సొంత పార్టీలోనైనా తనకు అండ దొరుకుతుందనే ఆశ కూడా రేవంత్‌? కు లేదు. తాజాగా వెంకటరెడ్డి కూడా రేవంత్‌? పైనే మాటలదాడికి దిగుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఆయనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం పట్టు లేదు. దానికితోడుగా ఉత్తమ్‌?, వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్‌? రెడ్డి వంటి వారితోనూ విభేదాలున్నాయి. బయటకు కనిపించకున్నా.. అంతర్గతంగా కత్తులు నూరుకుంటూనే ఉన్నారు. వీరికి అనుకూలంగా రాష్ట్రంలోని ఇతర సీనియర్లు కూడా కలిసి వస్తారు. హుజురాబాద్‌? ఇష్యూ అంటే ఏదో జరిగిపోయింది కానీ.. మునుగోడు మాత్రం రేవంత్‌? పీఠానికి ప్రభావం చూపించనుంది. హుజురాబాద్‌? ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిందంటూ కొంత సమర్ధించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ, మునుగోడు అలా కాదు.. ఇక్కడ కాంగ్రెస్‌? కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయి పరిశీలనలో మాత్రం కాంగ్రెస్‌? పరిస్థితి దారుణంగానే మారింది. ఇక్కడ కనీసం రెండో స్థానంలో నిలిచేందుకైనా ఆయన ముందు నుంచీ ఆచితూచీ వ్యవహరించాల్సిందేనని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ మునుగోడు సెగ్మెంట్‌? లో కాంగ్రెస్‌? బలంగానే ఉంది. కానీ, ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. ఓవైపు రాజగోపాల్‌? రెడ్డి నిర్లక్ష్యం కూడా దీనికి తోడైందనే ప్రచారం కూడా ఉంది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజగోపాల్‌? రెడ్డి మోసం చేశారంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తూ చండూరు జెడ్పీటీసీ సభ్యుడు కారెక్కారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు రాకపోవడం, చిన్నా,చితకా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో ఆయా మండలాల ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్‌? ను వీడారు. అంతేకాకుండా రెడ్డి వర్గం చేతుల్లో పని చేయలేమంటూ కొంతమంది బీసీ నేతలు సైతం హస్తానికి బై చెప్పారు. రాజగోపాల్‌? రెడ్డి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించడంలో కాంగ్రెస్‌? పార్టీ బలహీనమవుతుందనే కారణం కూడా ఒక్కటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్‌? కు ప్రతికూల పరిస్థితి ఉందనే ప్రచారం సాగుతోంది.మరోవైపు కాంగ్రెస్‌? సీనియర్‌? నేత కుందూరు జానారెడ్డికి కూడా ఇది సవాలే. ఇప్పటికే సాగర్‌? ఉప ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డారు. ఇప్పుడు తమ సిట్టింగ్‌? సీటు కావడం, కాంగ్రెస్‌? కంచుకోటగా చెప్పుకునే మునుగోడులో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పటికే జానారెడ్డిపై పెట్టారని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌? కుమార్‌? రెడ్డి ఇటీవల సైలెంట్‌? గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఏదో వస్తున్నట్లుగానే ఉంటోంది. ముందు నుంచీ ఈ సెగ్మెంట్‌? లో ఈ నలుగురు రెడ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు అంతా ఒక్కతాటిపైకి రావాల్సిందే. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా మళ్లీ రాజకీయాలు చేస్తే అటు రేవంత్‌? తో పాటుగా ఈ సీనియర్ల కుడా మరక అంటినట్టే.మునుగోడులో బలమైన నేతగా, పార్టీకి పట్టున్న వ్యక్తిగా ఉన్న రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడటంతో ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేది కాంగ్రెస్‌ కు పెద్ద సవాల్‌ గా మారుతోంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం అంతా ఆశామాషీ కాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఫలితం బెడిసికొట్టడమే కాదు.. కనీసం డిపాజిట్‌? కూడా రాదంటున్నారు. వాస్తవానికి నెల రోజుల నుంచే ఈ వివాదం సాగుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక కూడా కాంగ్రెస్‌? పార్టీ అధిష్టానానికి అందింది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌? రెడ్డి చేజారిపోకుండా కొంత రాయబారాలు సాగించారు. కానీ ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డికి ధీటుగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్‌ కసరత్తు మొదలు పెట్టినా.. ప్రత్యామ్నాయ లీడర్‌? కనిపించడం లేదు. పాల్వాయి గోవర్ధన్‌? రెడ్డి స్రవంతి పేరు తెరపైకి వస్తున్నా.. స్రవంతిని స్థానిక నేతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. రాయలసీమ కోడలుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో టీఆర్‌?ఎస్‌? నేత కూసుకుంట్ల ప్రభాకర్‌? రెడ్డితో విభేదాలు పెట్టుకుని, పార్టీ నుంచి సస్పెన్షన్‌? కు గురైన వేనేంపల్లి వెంకటేశ్వర్‌? రావు పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన కాంట్రాక్టర్‌? గా ఉన్నారు. టీఆర్‌?ఎస్‌? లో ముందుగా కీలక నేతగా ఉన్నా.. ప్రభాకర్‌? రెడ్డి ఆయన్ను టార్గెట్‌? చేయడంతో కొంత సైలెంట్‌? గా ఉంటున్నారు. తాజా పరిస్థితుల్లో ఆయనతో రేవంత్‌? రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక, బలమైన బీసీ నేతకు అవకాశం ఇస్తే.. హస్తం పార్టీకే చాన్స్‌? ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చండూరు ఎంపీపీ భర్త, కొన్నేండ్లు జర్నలిస్టుగా పని చేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌? లో ఉన్న పల్లె రవి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. జానారెడ్డి తనయుడు రఘువీర్‌? పేరు కూడా తెరకెక్కుతోంది. ఇలా పలువురి పేర్లను పరిశీలించి వారి బలాబలాపై లెక్కలు కడుతున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
14 విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లు పెరుగుతున్న గిరాకీ
హైద్రాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లకు గిరాకీ పెరుగుతోంది. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్‌ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి సంఖ్యను పెంచడంలో ఎటువంటి శ్రద్ద చూపడం లేదు. విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణకు సహకరించండి అని అధికారులు ప్రచారం చేస్తున్నారు. దీంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తున్నారువిద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేందుకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉచితంగానే చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా 6 గంటల నుంచి 7 గంటల పాటు చార్జింగ్‌ పెట్టుకునే సదుపాయాన్ని ఆయాకేంద్రాలు కల్పిస్తున్నాయి.అయినా విద్యుత్‌ వాహానాలను వినియోగించేందుకు మాత్రం కొనుగోలు దారులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసినప్పటికి అనంతర పరిణామాల అంశంలో కొనుగోలు దారులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు అందుబాటులో ధరల్లోనే లభిస్తున్నప్పటికి ఛార్జింగ్‌ కోసం ఆరు నుంచి ఏడు గంటలు సమయం వెచ్చించలేని పరిస్థితుల్లో నగర వాసులు ఉన్నారు. వేగంగా చార్జింగ్‌ చేసే పరికరాలు ఉన్నప్పటికి బ్యాటరీ సంబంధిత ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఏం చేయాలనే సందేహలను వినియోగ దారులు వ్యక్తం చేస్తున్నారు. ఎంత దూరం ప్రయాణం చేయగలం, ఒక వేళ చార్జింగ్‌ కేంద్రాలు లేని ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి ఏంటి ? ఎక్కువ సమయం చార్జింగ్‌ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఎంటి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న సందేహాలు వ్యక్త అవుతున్నాయి.ఇతర వాహనాలకు ఉన్న సదుపాయాలతో పోలిస్తే పోల్చితే, పెట్రోల్‌, డిజిల్‌ వాహానాలే మేలు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో అధికారుల కోసం ప్రస్తుతం 350 అద్దెకార్లును వినియోగిస్తున్నారు. ఒక్కో దానికి సుమారు రూ. 35 వేలు అద్దె చెల్లిస్తున్నారు. సుమారు ఇదే ధరతో ఎలక్ట్రిక్‌ వాహానాలను అధికారికి కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డ్రైవర్‌ వేతనం కాకుండా నెలవారీగా అద్దెపై వీటిని ఇచ్చేందుకు ఈసిఐఎల్‌ కంపెనీ అంగీకరించింది. అద్దెను ఏటా 10 శాతం పెంచేలా ఆరేళ్ళ వ్యవధికి ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పటి వరకు ఇది అమలు కాలేదు. అయితే కొన్ని ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగుల సౌకర్యం కోసం విద్యుత్‌ వాహనాలు వినియోగిస్తున్నాయి.విద్యుత్‌ వాహనాల కొనుగోలు చేసిన వారికి కొన్ని రకాల ఇబ్బందులు తప్పడం లేదు. చార్జింగ్‌ అయిపోయిన ప్రాంతం నుంచి దగ్గరలో చార్జింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నగరంలో ఇప్పటి వరకు 1500 విద్యుత్‌ వాహనాలు ఉన్నట్లు అంచనా. బంజారాహిల్స్‌, రాజ్‌భవన్‌ రోడ్డు, బేగంపేట, పంజాగుట్ట,గచ్చిబౌలీ, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌ ,బోరబండ, ఓల్డ్‌ మలక్‌పేట, నాంపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా వీటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టిసీ జోన్‌ పరిధిలో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు నగరం నుంచి విమానాశ్రయం వరకు రాకపోకలు సాగిస్తు పర్యావరణహితంగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు పెంచేందుకు ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నప్పటికి కొనుగోలు దారులు వీటిని పై ఆసక్తి చూపడం లేదు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
15 గ్రామ పంచాయితీల్లో ఆన్‌ లైన్‌ ఆడిట్‌
నల్గొండ, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ ఆడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అందులో భాగంగానే ఈ ఆడిట్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఇప్పటికే పేపర్‌ లెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఈ ఆఫీస్‌కు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో ఆన్‌లైన్‌ ఆడిట్‌లోనూ తెలంగాణ ముందుంది. రాష్ట్రంలోని 542 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయితీల్లో సుమారు 3,830 (30%) గ్రామ పంచాయితీల్లో ఈ ఆన్‌లైన్‌ ఆడిట్‌ను ప్రారంభించనుంది. ఆన్‌లైన్‌ ఆడిట్‌పై పంచాయితీరాజ్‌ శాఖ, ఆడిట్‌ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఎలా ఆడిట్‌ నిర్వహించాలనే దానిపై గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఆడిటర్లకు సంయుక్తంగా ఇరు శాఖల ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు.ఆన్‌లైన్‌ ఆడిట్‌ ప్రక్రియపై గ్రామ పంచాయితీల కార్యదర్శులకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ వెబ్‌ సైట్‌ ద్వారా సమాచారాన్ని కూడా అందజేశారు. దాదాపు 336 మంది ఆడిట్‌ అధికారులు శిక్షణా పూర్తి చేసుకుని ఆడిట్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఆడిట్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్‌ చివరి నాటికి దేశవ్యాప్తంగా 20 శాతం గ్రామపంచాయితీల ఆడిట్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. 15వ ఆర్ధిక సంఘం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రంలో 30 శాతం గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ మార్తినేని వెంకటేశ్వరరావు ఆన్‌లైన్‌ ఆడిట్‌ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 3830 గ్రామ పంచాయితీల్లో 336 మంది ఆడిటర్లతో ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్‌ 31 వ తేదీ వరకు ఈ ఆన్‌ లైన్‌ ఆడిట్‌ జరగనుంది.ఈ మేరకు డైరెక్టర్‌ కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే తెలంగాణ మాదిరి దేశంలో ఆన్‌ లైన్‌ ఆడిట్‌కు ఇంకా పలు రాష్ట్రాలు సిద్ధ కాకపోవడం గమనార్హం. జిల్లాల వారీగా ఆడిటర్ల కేటాయింపు ఇలా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 10, కరీంనగర్‌ 17, ఖమ్మం 19, మహబూబ్‌నగర్‌ 8, మెదక్‌ 8, నల్లగొండ 18, నిజామాబాద్‌ 19, రంగారెడ్డి 13, వరంగల్‌ అర్బన్‌ 11, మంచిర్యాల్‌ 6, నిర్మల్‌ 10, కొమురం భీం ఆసిఫాబాద్‌ 5, పెద్దపల్లి 9, జగిత్యాల 14, రాజన్న సిరిసిల్ల 8, భద్రాద్రి కొత్తగూడెం 12, జనగాం 9, జయశంకర్‌ భూపాలపల్లి 6, జోగులాంబ గద్వాల 6, కామారెడ్డి 10, మహబూబాబాద్‌ 09, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 7, నాగర్‌కర్నూల్‌ 8, సంగారెడ్డి 13, సిద్ధిపేట 11, సూర్యాపేట, వికారాబాద్‌కు 12, వనపర్తి 6, వరంగల్‌ రూరల్‌ 14, యదాద్రి భువనగిరి 15, ములుగు 5, నారాయణపేట జిల్లాలో 6గురు ఆడిటర్లను ప్రభుత్వం నియమించింది.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
16 గులాబీ అభ్యర్ధిగా కర్నె ?
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అభ్యర్థిగా ఫిక్స్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు పేర్లు పరిశీలించిన గులాబీ అధినేత కేసీఆర్‌ … నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేల్లో కర్నెకు సానుకూలంగా వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ మాత్రం చివరి వరకు అభ్యర్థులను ప్రకటించరు. ఎన్నికల నామినేషన్లకు ఒకరోజు ముందు.. లేకుంటే అదే రోజూ అభ్యర్థిని ప్రకటించి భీఫాం అందజేస్తారు. అయితే ఆయన మదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది మాత్రం చివరి వరకు గోప్యత పాటిస్తారు. గులాబీ పార్టీలో మాత్రం ఆశావాహులు పదుల సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల వరకు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.టీఆర్‌ఎస్‌ మునుగోడు ఉపఎన్నికకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీపై, మునుగోడు నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలపై సర్వే చేస్తుంది. ఎన్నికలకు గడువు సైతం ఉండటంతో సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలపై సైతం నిర్వహిస్తుంది. బలబలాలను తెలుసుకుంటుంది. టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు నేతలకు ప్రజల్లో ఎవరికి సానుకూలత ఉందనే వివరాలను పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఆ సర్వేల్లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కు అనుకూలంగా వచ్చిందని, ఆయనకే ఉప ఎన్నికల్లో టికెట్‌ దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు పలువురు టికెట్‌ ను ఆశిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల భూపాల్‌ రెడ్డి కలువడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018లో పోటీ చేసిన ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా అమిత్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్‌, కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ నారబోయిన రవితో పాటు పలువురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.మునుగోడులో ఇప్పటికే పీకే టీం పలు దఫాలు సర్వే చేసింది. పార్టీకి, నేతలపై ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రతిపక్షాల బలాలు, బలహీనతలను నివేదిక రూపంలో అందజేసింది. మరోమారు సర్వే నిర్వహిస్తుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి 2018లో విజయం సాధించారు. అయినప్పటికీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అది టీఆర్‌ఎస్‌ కు కలిసివచ్చే అంశమనిపార్టీ భావిస్తుంది. కానీ రాజగోపాల్‌ రెడ్డికి నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు ధీటుగా ఎవరిని బరిలో నిలపాలనేదానిపై కసరత్తు చేస్తుంది. కర్నె ప్రభాకర్‌ 2001 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరోగా పనిచేస్తున్నారు. 2014లో ఎమ్మెల్సీగా నియామకం అయ్యారు. ఆయనకు నియోజకవర్గంలోని పద్మశాలీలతో పాటు బీసీ వర్గాలు, ప్రజాప్రతినిధులు సైతం సానుకూలంగా ఉన్నారని, టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ఆయనవైపు టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం మొగ్గచూపుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ చివరకు అధినేత ఆశిస్సులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో వేచిచూడాల్సిందే.
RRRRRRRRRRRRRRRRRR
17 మునుగోడు కోసం బండి ప్రణాళికలు
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
పుల్‌ ఆర్‌కు మరో ఆర్‌ను కలిపేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా ప్రకటించి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ఆ నియోజకవర్గంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో స్పీడ్‌ పెంచారు.2018 సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీలో బీజేపీ ఒకే సీటుకు పరిమితమైంది. అయితే బీజేపీ స్టేట్‌ చీఫ్‌ గా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపొంది సీట్ల సంఖ్యను మూడుకు పెంచుకున్నది. రాజాసింగ్‌, రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్‌ లు ‘ట్రిపుల్‌ ఆర్‌’గా ప్రాచుర్యం పొందారు. ఈ నేపథ్యంలో మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించడం ద్వారా మరో ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకొని, నాలుగో ఆర్‌ ను చేర్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నది.ఓ వైపు ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్‌.. మరోవైపు రాజగోపాల్‌ రెడ్డిని చేర్చుకోవడం, ఉప ఎన్నిక వస్తే రచించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు రచిస్తున్నారు. బుధవారం పాదయాత్ర లంచ్‌ విరామ సమయంలో బండి సంజయ్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మధ్యప్రదేశ్‌ ఇన్‌ చార్జి మురళీధర్‌ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు దీటుగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా అధికార పార్టీని ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిసిందిమునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గట్టుప్పల్‌, చండూర్‌, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడతోపాటు రెండు మున్సిపాల్టీలు చౌటుప్పల్‌, చండూర్‌ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో బండి సంజయ్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. దుబ్బాక, హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి పార్టీ సీనియర్‌ నేతను మునుగోడు ఉప ఎన్నికల ఇన్‌ చార్జీగా నియమించాలని పార్టీ శ్రేణులు బండికి సూచించినట్లు తెలుస్తున్నది. ఏపీ జితేందర్‌రెడ్డి లక్కీ హ్యాండ్‌ అని భావిస్తున్న బీజేపీ ఆయన్నే ఇన్‌ చార్జీగా నియమిస్తే ఉప ఎన్నికల్లో గెలుపొందడం తథ్యమనే భావన కమలనాథులు ఉన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. పార్టీలో అందరితో సంప్రదించిన తరువాతే నియమించే యోచనలో బండి సంజయ్‌ ఉన్నట్లు టాక్‌అంతేకాకుండా త్వరలోనే కోర్‌ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌ నాయకులతో సంప్రదించి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. అంతేకాకుండా పలు మండలాలకు, మున్సిపాలిటీలకు సైతం ఇన్‌ చార్జీలను నియమించాలని బండి సంజయ్‌ యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై సీనియర్‌ నాయకుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే బండి పలు దఫాలుగా సవిూక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా చూస్తే గౌడ్స్‌, యాదవులు, రెడ్డి, పద్మశాలి, లంబాడ, మాదిగ సామాజికవర్గాలవారు అధికంగా ఉన్నారు. సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇన్‌ చార్జీలను నియమించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభావితం చేసే నేతలకు అధిక ప్రాధాన్యత కల్పించే యోచనలో బండి సంజయ్‌ ఉన్నట్లు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయపరిస్థితులపై పలు సంస్థలతో వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వే రిపోర్డుల ఆధారంగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నది. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రనాయకత్వానికి ఇప్పటికే పార్టీ రాష్ట్రశాఖ తరుపున ఒక నివేదికను పంపినట్టు తెలుస్తున్నది. దీని ఆధారంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నది.
RRRRRRRRRRRRRRRRRRRRR
18 లోన్‌ యాప్‌ లపై ఈడీ దృష్టి
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)
మొబైల్‌ ఫోన్‌ లోన్‌ యాప్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ కొరడా రaళిపించింది. పన్నెండు యాప్‌లకు సంబంధించిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు చెందిన రూ. 105.32 కోట్లను జప్తు చేసింది. గత నెల 7 నాటికి రూ. 1,589 కోట్లను స్వాధీనం చేసుకున్నది. ఇప్పటివరకు రూ.4,430 కోట్లను వినియోగదారులకు లోన్‌ యాప్‌ల ద్వారా జారీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. మంజూరు చేసిన రుణాల విూద ఇప్పటికే రూ. 819 కోట్ల మేర లాభాలను ఆర్జించినట్లు గుర్తించింది. రాష్ట్రంలో లోన్‌ యాప్‌ బాధితుల సమస్య తీవ్రంగా ఉండడంతో రిజర్వు బ్యాంకుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గత నెలలోనే రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పుడు మరింత దూకుడు పెంచిన ఈడీ.. ఒక్క రోజులోనే పన్నెండు యాప్‌లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోని అమౌంట్‌ను జప్తు చేసింది.తాజాగా జప్తు చేసిన డబ్బు ఇండీట్రేడ్‌ ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌, ఆగ్లో ఫిన్‌ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితరాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్నదే కాక పేమెంట్‌ గేట్‌వే ఖాతాల్లోనూ మరికొంత ఉన్నట్లు ఈడీ పేర్కొన్నది. చైనాతో పాటు పలు దేశాలకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలతో లోన్‌ యాప్‌లకు అవగాహనా ఒప్పందాలు ఉన్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆండ్రాయిడ్‌ ఆధారిత గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో కొన్నింటిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గత నెలలో నాలుగు యాప్‌లకు చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి ఈడీ జప్తు చేసింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ లోన్‌ యాప్‌ బాధితులు ఉన్నారుతెలంగాణ కేంద్రంగా సుమారు 80 లోన్‌ యాప్‌లు పనిచేస్తున్నాయంటూ రిజర్వు బ్యాంకుకు గత నెలలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చేసిన విజ్ఞప్తిలో వివరించారు. గతేడాది 61 ఫిర్యాదులు వస్తే వాటిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఐదుగురు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ లోన్‌ యాప్‌ యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్ల కింద, ఐటీ యాక్టు కింద ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌ చివరి నాటికే 900 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రాథమిక విచారణ పూర్తిచేసిన పోలీసులు.. 46 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ముగ్గురు బాధితులు ఈ ఏడాది సూసైడ్‌ చేసుకున్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో లోన్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని రామకృష్ణారావు ఆ విజ్ఞప్తిలో వివరించారు.ఏ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో ఈ లోన్‌ యాప్‌లు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయో వెల్లడిరచలేదని పేర్కొన్నారు. కొన్ని లోన్‌ యాప్‌లు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఫలానా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న 80 నాన్‌ బ్యాంకింగ్‌ పైనాన్స్‌ కార్పొరేషన్లలో 33 మాత్రమే రిజర్వు బ్యాంకుతో రిజస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్నాయని, మిగిలిన 47 నిబంధనలకు విరుద్దంగానే పనిచేస్తున్నట్లు వివరించారు. ఇల్లీగల్‌గా నడుస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ, లోన్‌ యాప్‌లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్బీఐను రామకృష్ణారావు ఆ విజ్ఞప్తిలోనే కోరారు. నెల రోజుల తర్వాత ఈడీ అధికారులు రంగంలోకి దిగి పన్నెండు యాప్‌ల ఖాతాల్లోని డబ్బును జప్తు చేయడం గమనార్హం.
RRRRRRRRRRRRRRRRRRR
19 నిండుకుండలా మూసి
హైదరాబాద్‌, ఆగస్టు 4, (న్యూస్‌ పల్స్‌)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *