ఏపీ తెలంగాణ మధ్యలో పవన్‌

తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు వర్సెస్‌ ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఈ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోతున్నాయన్న పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ ప్రజల్ని నిందించిన ఏపీ మంత్రులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీని ఉద్దేశించి ఎవరేమన్నా వదిలేయాలా? అయినా పవన్‌ కల్యాణ్‌కు బీఆర్‌ఎస్‌పై కొత్తగా ఈ ప్రేమ ఎందుకు పుట్టిందో అంటూ వైసీపీ నాయకులు సరికొత్త డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.ఇరు రాష్ట్రాల మంత్రులు మధ్య మాటల మంటలు కొనసాగుతుండగానే సీనులోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో సరికొత్త మలుపు తిరిగింది. తెలంగాణ ప్రజలు, ప్రాంతం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మంత్రులు స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్న పవన్‌ కళ్యాణ్‌.. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నేతలు వేరు ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న పవన్‌.. మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణను, అక్కడి ప్రజలను ఏపీ మంత్రులు ఎవరూ ఏవిూ అనలేదంటున్న వైసీపీ.. ప్యాకేజీ కోసం పవన్‌ బురద జల్లుతున్నారంటోంది. ఏపీ మంత్రులనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలంటున్నారు వైసీపీ నేతలు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను విమర్శిస్తే బయటకొచ్చిన పవన్‌ కల్యాణ్‌కు.. బీఆర్‌ఎస్‌ పట్ల కొత్తగా ఈ ప్రేమ ఏంటో అర్థం కావడం లేదన్నారు పేర్ని నాని.జనసేన`వైసీపీ మధ్య మాటలతూటాలు పేలుతుండగానే మళ్లీ తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి స్పందించారు. లోక్‌సభ నుంచి బయటకు పంపి రాష్ట్రాన్ని విడదీస్తే ఏడుపొచ్చి 11రోజులు అన్నం మానేశాననంటూ పవన్‌ గతంలో చెప్పిన వీడియోలను పేర్ని నాని ప్రదర్శించారు. టిఆర్‌ఎస్‌ వారి విూద ఈగ వాలనివ్వకుండా పవన్‌ బయటకొచ్చాడని, తెలంగాణ మంత్రుల విూద మాట పడనివ్వకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. పవన్‌ కొత్త బంధానికి కారణం ఏమిటో చెప్పాలన్నారు.కొత్త బంధం రాకముందు పవన్‌ ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు బానిసలా అని నిలదీసిన పవన్‌, తెలంగాణ వారితో తిట్టించుకుంటూ ఉండాలా అని నిలదీయడం గుర్తు లేదా అన్నారు. తెలంగాణకు చెందిన మంత్రి రాజకీయ ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఏపీలో పుట్టిన ప్రతి ఒక్కరికి కన్నతల్లిలాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే పవన్‌ ఎందుకు స్పందించలేదన్నారు.ఆంధ్రప్రదేశ్‌ కేవలం రాజకీయ అవసరాలకు, లాభాలకు మాత్రమే పరిమితమా అని పేర్ని నాని నిలదీశారు. వ్యాపారం, ఆస్తులు తెలంగాణలో ఉన్నందున తెలంగాణ నాయకులకు లొంగిపోయారా, లేకుంటే ఏదైనా కొత్త బంధం ఏర్పడిరదా అని ప్రశ్నించారు. తెలంగాణ నాయకులు ఏపీని అవమానించేలా మాట్లాడితే, దానికి ప్రతిస్పందనగా ఆంధ్రా మంత్రులు మాట్లాడితే, దానిని వారిని అవమానించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు.ఏదో లాభాన్ని పొందాలనే తప్పుడు ఆలోచనలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని పేర్ని నాని ఆరోపించారు. తెలంగాణ మంత్రి మాట్లాడినది.. వేరే ఇది అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి తరపున వకాల్తా పుచ్చుకుని, కిరాయి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బొత్సకు, మిగిలిన రాజకీయ నాయకులకు హైదరాబాద్‌లో వ్యాపారాలు అవసరం లేదా అని పవన్‌ ప్రశ్నించడంపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబును ఏమైనా అంటే బయటకు వస్తాడని, లోకేష్‌ను అంటే వస్తాడని, ఇప్పుడు తెలంగాణ మంత్రుల తరపున బయటకొచ్చాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు బీజేపీతో బంధం ఉందో లేదోనని ప్రశ్నించారు. ఇటీవల సింగపూర్‌ నుంచి చుట్టాలు వస్తే వారిని కలవడం కోసం వెళ్లి సందట్లో సడేమియాలా బీజేపీ నాయకుల్ని కలవడానికి ఐదు రోజులు ఢల్లీిలో ఉన్నారన్నారు.అంతకు ముందు వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తూ పవన్‌ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తెలంగాణ జాతిని, సమాజాన్ని తిడుతుంటే వైసీపీ పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ.. అందరినీ కంట్రోల్‌ చేయాల్సి బాధ్యత సీఎం జగన్‌ పై లేదా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను తిట్టటం.. ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదన్నారు. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని ప్రశ్నించారు. బొత్సా లాంటి వారికి తెలంగాణలో మొన్నటి వరకు కేబుల్‌ వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మాత్రమే ఉండాలని, ప్రజలను లాగొద్దని.. ఇదే జనసేన విధానం అన్నారు.ఏపీ ప్రజలను ఏవిూ అనలేదని.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే ప్రస్తావించినట్టు స్పష్టత ఇచ్చారు. ఏవిూ అనకపోయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చేతనైతే ఏపీకి హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడాలని సూచించారు. తెలుగురాష్ట్రాల మధ్య రాజుకున్న అగ్గి క్రమంగా అన్ని పార్టీలకు సెగ తాకుతోంది. మరి ఇంకా ఎలాంటి మలుపుతు తిరుగుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *