ఆదిపురుష్ ఓటీటీ హక్కులకు రికార్డు ధర.

దేశంలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. యావత్ సినీ లోకం ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తోంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది.గత కొన్ని నెలలుగా ట్రెండింగ్ అవుతున్న మూవీ ఆదిపురుష్. దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. యావత్ సినీ లోకం ఈ భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తోంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయమై ఓ అప్ డేట్ వైరల్ గా మారింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఆదిపురుష్ ఓటీటీ రైట్స్ తీసుకుందని తెలుస్తోంది. కొన్ని వందల కోట్లు చెల్లించి ఈ డీల్ క్లోజ్ చేసిందట అమెజాన్ ప్రైమ్.

జూన్ 16న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఈ సినిమాను ఓటీటీ వేదికపైకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.ఆదిపురుష్ రూపంలో వస్తున్న ఈ రామ రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం అని ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది.భారీ తారాగణం ఎంచుకున్న దర్శకనిర్మాతలు.. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అయితే ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై ఇండియా లెవెల్ లో భారీ అంచనాలున్నాయి. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.జూన్ 16వ తేదీన 2డీ, 3డీలో ఐదు భాషల్లో భారీ ఎత్తున ఈ ఆదిపురుష్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ ప్రభంజనం చూస్తామని ఆశగా ఉన్నారు ఆయన అభిమానులు.ఆదిపురుష్ హిందీ వర్షన్ లో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శరత్ కేల్కర్ రీసెంట్ గా ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఈ మూవీ కంటెంట్ తో పాటు తెరకెక్కించిన విధానం ఎంతో అద్భుతం అని ఆయన చెప్పారు.

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతి సనన్ సీత పాత్ర పోషించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *