కోడి కూత, ఊచ కోత మొదలయింది, ప్రభాస్ ఊర మాస్

‘ఆదిపురుష్’ #Adipurush సినిమా ప్లాప్ తరువాత, ప్రభాస్ #Prabhas చేస్తున్న సినిమా ‘సలార్’ #Salaar. ఈరోజు ఉదయం ఈ సినిమా మొదటి పార్టు టీజర్ ని విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) ‘కెజిఎఫ్’ #KGF సినిమా తరువాత చేస్తున్న ఇంకో పెద్ద బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఈ టీజర్ లో ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేసాడు దర్శకుడు ప్రశాంత్. ఇది ఒక యాక్షన్ సినిమా అని, ఇందులో ప్రభాస్ అభిమానులకు కావలసినంత ఊర మాస్ లో ప్రభాస్ ని చూపిస్తున్నాడని కూడా అర్థం అవుతోంది. ఇప్పుడు ఈ టీజర్ ట్రెండింగ్ లో వుంది. ఇందులో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (PrithvirajSukumaran), జగపతి బాబు (JagapathiBabu) కూడా వున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *