2024 ఎన్నికల బరిలోకి పీడీఏ

విపక్షాల కూటమి పేరు కోసం ఓ ప్రతిపాదన అందింది. అదే పీడీఏ. పీడీఏ అంటే పేట్రియాటిక్‌? డెమొక్రటిక్‌? అలయెన్స్‌?. వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో ఈ పేరుపై తుది నిర్ణయం తీసుకోనున్నారుబీజేపీపై పోరాటానికి దేశంలోని విపక్షాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా విపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. విపక్షాల కూటమికి పీడీఏ అని పేరు పెట్టాలని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పీడీఏ అంటే.. ‘‘పేట్రియాటిక్‌?? డెమొక్రటిక్‌? అలయెన్స్‌?’’. వచ్చే నెలలో శిమ్లా వేదికగా జరగనున్న సమావేశంలో.. ప్రతిపాదిత పీడీఏ పేరుపై విపక్షాలు ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.విపక్షాల కూటమికి పీడీఏ పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తెలిపారు. పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. శిమ్లాలో జులై 10`12 మధ్యలో జరగనున్న విపక్షాల సమావేశంలో.. పీడీఏకి తుది మెరుగులు దిద్ది, బీజేపీపై పోరాటానికి సిద్ధం చేయనున్నట్టు స్పష్టం చేశారు.’’విపక్షాల కూటమి పేరు పీడీఏ అని పెట్టాలని ప్రతిపాదన ఉంది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. పీడీఏ ప్రధాన లక్ష్యం ఒక్కటే. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌?డీఏను ఓడిరచడం. ఇది అన్ని విపక్ష పార్టీలకు స్పష్టంగా తెలుసుని డీ రాజా అన్నారు.’’తమిళనాడులో సెక్యులర్‌? డెమొక్రటిక్‌? ఫ్రెంట్‌? ఉంది. బిహార్‌?లో మహాఘట్‌?బంధన్‌? ఉంది. ఇప్పుడు వచ్చే పేరు.. విపక్షాలన్నింటిని ఒక్కటి చేసి, లక్ష్యంవైపు నడిపించే విధంగా ఉండాలి,’’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి వెల్లడిరచారు.మరోవైపు.. పట్నా వేదికగా కొన్ని రోజుల ముందు.. విపక్షాల సమావేశం జరిగింది. దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ‘‘ఇకపై విపక్షం అని పిలవకండి. పేట్రియాటిక్‌? అని పిలవండి,’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే.. బీజేపీపై పోరాటం కోసం కలిసి అడుగులు వెస్తున్న విపక్షాల కూటమి పేరు పీడీఏ అవుతుందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. జులైలో జరిగే విపక్షాల భేటీ కోసం ఎదురుచూడాల్సిందే.దేశంలో యూపీఏ, ఎన్‌?డీఏ కూటములు ప్రధానంగా ఉన్నాయి. ఎన్‌?డీఏ అంటే నేషనల్‌? డెమొక్రటిక్‌? అలయెన్స్‌?. యూపీఏ అంటే యునైటెడ్‌? ప్రొగ్రెసివ్‌? అలయెన్స్‌?. 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం యూపీఏ ఏర్పడిరది. కాంగ్రెస్‌?, వామపక్షాలతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడి.. ప్రభుత్వాన్ని స్థాపించాయి. 2015 బిహార్‌? ఎన్నికలకు ముందు.. ఆర్‌?జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌?, వామపక్షం కలిసి మహాఘట్‌?బంధన్‌?ను ఏర్పాటు చేశాయి.ఇక ఈ ప్రతిపాదిత పీడీఏలో కాంగ్రెస్‌?, టీఎంసీ, ఆర్‌?జేడీ, జేడీయూ, వామపక్ష పార్టీలు, డీఎంకే, ఎన్‌?సీపీ, పీడీపీ, జేఎంఎం, ఆప్‌? వంటి పార్టీలు ఉండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీపై విపక్షాలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. ఇప్పుడు తమ బలాన్ని పెంచుకునేందుకు, ఐకమత్యాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని హావిూ ఇస్తేనే పాట్నా భేటీకి వస్తామని ఆప్‌ ఇంతకు ముందే స్పష్టంగా చెప్పింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 11 పార్టీలు కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయలేకపోయింది. పైగా అది పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు ఆలోచిస్తామంటూ కాంగ్రెస్‌ దాట వేసింది. విపక్షాల కూటమిలో చిత్త శుద్ధితో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ కప్పదాటు వైఖరి ప్రదర్శించింది. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాంగ్రెస్‌ తన వైఖరిని ప్రకటించలేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరి ఈ విధంగానే కొనసాగితే సిమ్లాలో జరిగే మలి భేటీకి తాము హాజరయ్యే ప్రసక్తే లేదని ఆప్‌ ఖరాకండీగా తేల్చి చెప్పింది.పశ్చిమ బెంగాల్‌లో తమకు వ్యతిరేకంగా సీపీఎంతో జత కట్టమన్న విషయాన్ని కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ పాట్నా భేటీకి ముందే డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ తన వైఖరిని చెప్పలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పరోక్షంగా బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్‌ వ్యవహరించడం వల్లనే తాను విపక్షాల భేటీకి దూరంగా ఉన్నట్టు బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మయావతి స్పష్టం చేసింది. దీనికీ కాంగ్రెస్‌ సమాధానం చెప్పలేకపోయింది. బీజేపీని ఓడిరచడానికి విపక్షాల మధ్య ఐక్యతా ఉండాలని చెప్పే కాంగ్రెస్‌, తమ చిత్తశుద్ధిని శంకించే ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో బీజేపీపై పోరుకు కాంగ్రెస్‌ కలిసి రాదన్నది విపక్షాల తొలి భేటీలో తేలిపోయింది.కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి, ప్రధాన ప్రతిపక్షంగా తన అసమర్థతను పలు సందర్భాలలో బయటపడటం వల్లనే ఆ పార్టీ నేతృత్వంలో విపక్షాల భేటీ అనేది వృథా ప్రయాసన్న అంచనాతోనే బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాట్నా సమావేశానికి దూరంగా ఉన్నారా? అని అనిపిస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం రావాలి తప్ప ఈ టెంట్లు, ఫ్రంట్ల వల్ల అయ్యేపని కాదని ముందునుంచి కేసీఆర్‌ చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కలిగిన ప్రత్యామ్నాయ అజెండా ఉండాలని, ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ కాదని కేసీఆర్‌ అన్న మాటలు అక్షర సత్యమని విపక్షాల భేటీ తర్వాత తేలిపోయింది. పార్టీలు కాదు ప్రజలు గెలవాలన్న కేసీఆర్‌ ఆకాంక్షనుÑ నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి లాంటి సమస్యలను విపక్షాలు పట్టించుకోవడం లేదనే విషయం పాట్నా సమావేశం తీరుతెన్నులను పరిశీలిస్తే తెలిసిపోయింది!మరి వీటిపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? విపక్షాల ఐకమత్యంతో 2024లో బీజేపీకి ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *