ఎట్టకేలకు ఎర్రకట్టకు మరమ్మత్తులు

విజయవాడ, అక్టోబరు 10
విజయవాడలో కీలకమైన మార్గాల్లో ఒకటై ఎర్రకట్ట బైపాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. రెండున్నరేళ్లుగా రోడ్డు మార్గాన్ని పూర్తిగా మూసేయడంతో స్థానికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో మరమ్మతులు మొదలయ్యాయి.పాతబస్తీ వించిపేట ` ఫోర్‌ మెన్‌ బంగ్లాల మధ్య ఆర్వోబి మార్గాన్ని రైల్వే అధికారులు మూసేశారు. ప్రమాదకరంగా ఉన్నందున ఈ మార్గంలో రాకపోకలు అనుమతించమని రైల్వే అధికారులు తెల్చేశారు. 2021 జూన్‌ లో రైల్వే అధికారులు విఎంసి అధికారులతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రోడ్డు మార్గాన్ని మూసేశారు.వంతెన రిటైనింగ్‌ వాల్‌ ప్రమాదకరంగా ఉందని చెబుతూ బ్రిడ్జి కింద రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేసినా విజయవాడ డిఆర్‌ఎం స్పందించలేదు. విజయవాడ ఎంపీ లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. రైల్వే అధికారులు స్పందించకపోవడంతో ఎంపీ కూడా చేతులు ఎత్తేశారు.రోడ్డు మార్గాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కార్పొరేషన్‌ కు, రైల్వే అధికారులకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోయింది. రెండున్నర ఏళ్ల నుంచి రోడ్డు మూసేయడంతో డీజిల్‌ లోకో షెడ్‌, ఎలక్ట్రికల్‌ లోకోషెడ్‌, రైల్వే గూడ్స్‌ షెడ్‌ లో పని చేసే రైల్వే ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో రైల్వే అధికారులు స్థానికుల వాహనాలు అనుమతించకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌ అధికారులు కూడా బ్రిడ్జి ఆర్‌ అండ్‌ బి పరిధిలో ఉందని చేతులెత్తేశారు.స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు, ఆర్‌ అండ్‌ బి అధికారులకు మరమ్మతులు చేయాలని లేఖ రాశారు. దీంతో విజయవాడ విఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్మెంట్‌ నిపుణులు మరమ్మతులకు డిజైన్‌ లు రూపొందించారు. గోడలు పటిష్టంగా ఉన్నా చెట్లు పెరగడం వల్ల పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఖీూః గోడలకు బలమైన ఇనుప ప్లేట్లను అమర్చాలని సూచించారు.రిటైనింగ్‌ వాల్‌, బ్రిడ్జి మధ్య ఖాళీ పెరగకుండా ఇనుప జాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత పగుళ్లలో కాంక్రీట్‌ నింపుతారు. గోడలు కూలి భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా ‘‘ఙ’’ ఆకారంలో చుట్టు ఐరన్‌ గడ్డర్లు ఏర్పాటు చేస్తామని రaార్ఖండ్‌కు చెందిన కార్మికులు వివరించారు. పనులు పూర్తి కావడానికి మరో రెండు వారాల సమయం పట్టనుంది.బ్రిడ్జి మరమ్మతులు పూర్తి కానుండటంతో రైల్వే కాలనీకి బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. కొవిడ్‌ కు ముందు రైల్వే కాలనీకి ఫోర్‌ మెన్‌ బంగ్లా నుంచి గంగూరుకు 23ం సర్వీస్‌ ఉండేది. ఫోర్‌ మెన్‌ బంగ్లా నుంచి ఏలూరు రోడ్డు ` రామ వరప్పాడు ` బెంజ్‌ సర్కిల్‌ విూదుగా ఫోర్‌ మెన్‌ బంగ్లాకు 28ం సర్వీస్‌ నడిపే వారు. అంతకు ముందు ఫోర్‌మెన్‌ బంగ్లా నుంచి గుంటుపల్లి వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కు 37ం సర్వీస్‌ నడిచేది. పంజా సెంటర్‌ నుంచి గాంధీ బొమ్మ వరకు ఆక్రమణలు పెరిగి పోవడంతో బస్సు సర్వీసులు నిలిచి పోయాయి. ఆక్రమణలు తొలగించి బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *