Extra : బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీతాకోక చిలుక

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ఆర్డినరీమెన్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘డేంజరు పిల్లా’ అనే గీతాన్ని బుధవారం విడుదల చేశారు. ‘అరె బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీతాకోక చిలుకవా.. చీకట్లో తిరగని తళుకువ..’ అంటూ సాగిన ఈ పాటని హారీశ్‌ జయరాజ్‌ స్వర పరిచారు. కృష్ణకాంత్‌ రాశారు. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘హారీశ్‌ మార్క్‌తో సాగే మెలోడీ ఇది. యువతరం హృదయాల్ని ఆకట్టుకొంటుంది. ఈ పాటని తెరకెక్కించిన విధానం కూడా నచ్చుతుంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో టీజర్‌ వదులుతామ’’న్నారు నిర్మాతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *