ఆగస్టు 10 నుంచి ఎంసెట్‌ క్లాసులు

తెలంగాణలో టీఎస్‌ ఎంసెట్‌ 2023 ఫలితాలు మే 25న విడుదలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్‌ ఎంసెట్‌ `2023 కౌన్సెలింగ్‌ షెడ్యూలు మే 27న విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తర్వాత జులై 21 నుంచి 31 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 2 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అదేవిధంగా స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు.ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు వెల్లడిరచిన నేపథ్యంలో ఏ కాలేజీ అయితే బాగుంటుంది. ఏ కోర్సులో చేరితే లైఫ్‌ ఉంటుంది. అసలు మన ర్యాంక్‌కు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వస్తుందనే అంశంపై ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆందోళన పడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఏ కాలేజీలో, ఏ కోర్సులో ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలుసుకుందాం. 2022`23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కటాఫ్‌ ర్యాంకుల వివరాలు పరిశీలిస్తే..
టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..
మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..
? జూన్‌ 26: ఆన్‌లైన్‌లో బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌ నింపాలి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది.
? జూన్‌ 28 ? జులై 7: స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
? జూన్‌ 28 ? జులై 8: సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.
? జులై 8: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్‌ చేసుకోవాలి.
? జులై 12: సీట్ల కేటాయింపు.
? జులై 12 ? 19: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, వెబ్‌ సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..
? జులై 21 ? 27: ఆన్‌లైన్‌లో బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌ నింపాలి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్‌ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
? జులై 23: స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
? జులై 21 ? జులై 24: సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.
? జులై 24: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్‌ చేసుకోవాలి.
? జులై 28: సీట్ల కేటాయింపు
? జులై 28 ? 31: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, వెబ్‌ సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..
? ఆగస్టు 2: ఆన్‌లైన్‌లో బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌ నింపాలి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్‌, సెకండ్‌ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
? ఆగస్టు 3: స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
? ఆగస్టు 2: ఆగస్టు 4 ? సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.
? ఆగస్టు 4: ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్‌ చేసుకోవాలి.
? ఆగస్టు 7: సీట్ల కేటాయింపు.
? ఆగస్టు 7 ? ఆగస్టు 9: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, వెబ్‌ సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *