బ్లాక్‌ లిస్ట్‌ లో 52 లక్షల సిమ్‌ కార్డులు

న్యూఢల్లీి,ఆగస్టు 18
మొబైల్‌ ఫోన్‌ వాడే చాలామందిలో కొత్త సిమ్‌ కార్డులు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త సిమ్‌ కార్డుల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులను విక్రయించే డీలర్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి అని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల నకిలీ సిమ్‌కార్డుల అమ్మకాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒకే వ్యక్తిపై ఎక్కువ సిమ్‌ల విక్రయాలకు కూడా అడ్డుకట్టపడుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా సిమ్‌ స్పామింగ్‌ను కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు 52 లక్షల మొబైల్‌ కనెక్షన్లు మూసివేశామని కేంద్రం తెలిపింది. అలాగే దాదాపు 67 మంది డీలర్లను కూడా బ్లాక్‌ లిస్టులో పెట్టినట్లు వెల్లడిరచింది. అయితే ఈ ఏడాది మే నుంచి సిమ్‌కార్డు డీలర్లపై దాదాపు 300 వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.నకిలీ సిమ్‌కార్డుల రాకేట్‌లో ఉన్నటువంటి దాదాపు 66 వేల వాట్సాప్‌ అకౌంట్లు బ్లాక్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే.. ఒకవేళ పోలీస్‌ వెరిఫికేషన్‌ లేకుండా సిమ్‌కార్డులు విక్రయిస్తే దాదాపు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో 10 లక్షల మంది వరకు సిమ్‌కార్డు డీలర్లు ఉన్నారు. దీంతో ఇప్పుడు వీళ్లందరూ కూడా తప్పకుండా పోలీస్‌ వెరిఫికెషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే షాప్‌ కోసం కేవైసీని సైతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఎక్కడో ఓ చోట.. ఏదో ఒక ప్రాంతంలో సిమ్‌కార్డు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆధార్‌ నంబర్‌ను సైతం దుర్వినియోగం చేస్తున్నటువంటి ఘటన వెలగులోకి రావడం చర్చనీయాంశమైంది.ఒకే ఆధార్‌కార్డుపై దాదాపు 658 వరకు సిమ్‌కార్డులను జారీ చేయగా.. అందులోని సిమ్‌కార్డులన్నీ కూడా ప్రస్తుతం వినియోగంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ ఈ వారంలో ఓ వ్యక్తి ఆధార్‌ నంబర్‌పై ఉన్నటువంటి దాదాపు 100 నుంచి 150 వరకు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉండగా గత నాలుగు నెలల్లో తమిళనాడులోని సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా 25,135 సిమ్‌ కార్డులను మోసపూరిత కార్యక్రలపాలకు వినియోగిస్తున్నట్లు అనుమానించింది. దీంతో వాటన్నింటిని బ్లాక్‌ చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే విజయవాడలోని ఓకే ఫోటోతో 658 సిమ్‌కార్డులు జారీ చేసినట్లు ఏఐ టెక్నాలజితో విషయం బయటపడిరది. ఒకే ఫోటోతో ఓ టెలికాం సంస్థకు చెందినటువంటి 658 సిమ్‌లను ఓ యువకుడు పొందినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. దీంతో ఇందుకు సంబంధించి ఆయా సిమ్‌లన్నింటిని బ్లాక్‌ చేయాలని టెలికాం కంపెనీని పోలీసులు ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *