కూతుర్ని హీరోయిన్‌ చేయాలనుకుంది,

కన్న కూతురి పట్ల ఓ తల్లి అత్యంత పాశవికంగా వ్యవహరించింది. తొమ్మిది నెలలు కడుపులో మోసి కంటికి రెప్పలా కాపాడుకుంది. పుట్టిన పాప అందంగా ఉండడంతో.. ఆమెకు సినిమాలపై ఉన్న పిచ్చితో పాపను హీరోయిన్‌ చేయాలనుకుంది. కానీ కూతురు చిన్నగా ఉండడంతో.. ఇప్పుడు సినీ రంగంలోకి పంపించలేకపోయింది. దీంతో ఎలాగైనా సరే హీరోయిన్‌ ను చేయాలనుకుని పాపకు డ్రగ్‌ ఇంజెక్షన్లు ఇప్పిస్తోంది. ఆ తర్వాత డబ్బుల కోసం కూతురును వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ తల్లి. ఈ టార్చర్‌ భరించేలని ఆ బాలిక రోజూ విపరీతంగా ఏడుస్తున్నా పట్టించుకోకుండా కన్నబిడ్డతోనే వ్యాపారం చేసి కోటీశ్వరురాలు అవ్వాలనుకుంది. అయితే ఈ హృదయవిదారక ఘటన విజయనగరంలో వెలుగులోకి వచ్చింది. కూతురుని హీరోయిన్‌ చేయాలనే పిచ్చిలో నరకం చూపింది. మాయగాళ్ల మాటలు విని అభం శుభం తెలియని బాలికకు ఇంజెక్షన్లు ఇచ్చి శరీరాన్ని కుళ్ల బొడిచింది. మాట వినకపోతే చిత్రహింసలు పెట్టి వేధించింది. ఆ బాధ భరించలేక బాలిక చైల్డ్‌ లైన్‌ అధికారులను ఆశ్రయించడంతో ఎట్టకేలకూ తల్లి చెర నుండి బయటపడిరది. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.విజయనగరం తోటపాలెంలో నివాసం ఉండే మహిళకు కుమార్తె పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు సమాచారం. మొదటి భర్తతో పుట్టిన బాలిక విశాఖలో ప్రభుత్వ విద్యాసంస్థలో ఇటీవలే టెన్త్‌ క్లాస్‌ పూర్తి చేసి, వేసవి సెలవులకు ఇంటికొచ్చింది. పాపను ఇప్పుడే సినిమాల్లోకి పంపాలంటే పెద్దగా అయ్యేలా ఇంజెక్షన్లు ఉంటాయని కూడా ఆమెకు తెలిపాడు. దీంతో ఆమె కూడా పాప త్వరగా ఎదిగితే కోట్లు సంపాధించొచ్చు, హీరోయిన్‌ అయిపోతుందని.. డ్రగ్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు. అది తట్టులకోలేని బాలిక వద్దమ్మా, వద్దమ్మా అంటూ గుండెలవిసేలా రోదించింది. అయినా కూతురు బాధను పట్టించుకోకుండా ఇంజెక్షన్లు ఇస్తూనే పోయింది. ఇది చాలదన్నట్లు పెద్ద పెద్ద వాళ్ల కోరికలు తీర్చితే.. పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు ఇస్తారని చెప్పింది. మంచి భవిష్యత్తు ఉంటుందని.. కోట్లు సంపాదించొచ్చు అని ప్రలోభపెట్టేది. కానీ బాలిక మాత్రం అందుకు అస్సలే ఒప్పుకోలేదు. దీంతో కూతురు తనకు నచ్చినట్లు చేసేలా చేసుకునేందుకు చిత్రహింసలు పెట్టింది. బాలికకు పలుమార్లు నిద్రమాత్రలు కూడా ఇచ్చింది. దీంతో బాలిక ఆరోగ్యం పాడైంది. లేవలేని పరిస్థితికి చేరుకుంది. చివరకు చైల్డ్‌ లైన్‌ అధికారులకు చెప్పడంతో, వాళ్లు అధికారులు , పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను రక్షించారు.మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా విచారించారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు జిల్లాఎస్పీ దీపిక. అయితే తల్లి పెట్టిన మానసిక, శారీరక వేధింపులతో పాటు అవయవాలు పెరగటానికి ఇచ్చిన మెడిసిన్‌ కారణంగా బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు వైద్యులు. మొత్తానికి స్టెరాయిడ్స్‌ లాంటి ఇంజక్షన్లు మొదటికే మోసం అంటున్నారు వైద్య నిపుణులు. ఇవి ఒక్కోసారి ప్రాణాలవిూదకి తెస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *