ఇవాళ్టి నుంచే మహానాడు…

మహానాడు వేదికగా ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరుపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు డిజిటల్‌ సంతకం ద్వారా ప్రతినిధుల సభకు ఆహ్వానాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్‌, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పులు తెచ్చారని గుర్తు చేశారు.రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించే మహానాడులో అన్ని అంశాలపై చర్చలు జరుపుతామ్ననారు. రాజకీయ, సాంఫీుక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దామని తెలిపారు. గే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై చర్చిస్తామని చంద్రబాబు వెల్లడిరచారు. మే 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా రామమహేంద్రవరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ ఇప్పటికే సిద్ధమైంది. ఇక్కడ ఏసీ హాల్‌ ను కూడా సిద్ధం చేశారన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. పసుపు తోరణాలతో రాజమహేంద్రవరం వీధులను పసుపుమయం చేస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే ఇక్కడ బస చేశారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, గన్నికృష్ణ, ఆదిరెడ్డి వాసు, అనగాని సత్యప్రసాద్‌, తదితరులు ఏర్పాట్లను ప్రయవేక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలన్నీ పసుపుమయం కావాలని, ప్రతి ఇంటి నుంచి జనం తరలి రావాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఎవరికి వారు పసుపు తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ లోని పిడిరగొయ్య జైహింద్‌ నగర్‌ లో తెలుగు మహిళలు బుధవారం రోజు ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి మరీ మహానాడుకు ఆహ్వానించారు. తెలుగు వాళ్ల పండగకు ఇంటిల్లిపాదితరలి రావాలని రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కొయ్యన కుమారి తదితరులు కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు మంజీరా ఇంటర్నేషనల్‌ హోటల్‌ లో ఆయన దిగుతారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పోలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహిస్తారు. మహానాడులో ప్రవేశ పెట్టే తీర్మానాల విూద, ఏర్పాట్ల విూద చర్చిస్తారు. ఆయన మూడ్రోజుల అక్కడే ఉంటారు. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సభలో 15 తీర్మానాలపై చర్చ జరగనుంది. 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. వేదిక విూద చంద్రబాబుతో పాటు పోలిట్‌ బ్యూరో సభ్యులు, పార్టీ ముఖ్య నేతల, 175 అసెంబ్లీ నియోజక వర్గాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ ఇంఛార్జీలు ఆశీనులు అవుతారు. వేదిక విూద సుమారు 300 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఒక్కో తీర్మానంపై కనీసం ఇద్దరు చొప్పున 50 మంది వరకూ మాట్లాడే అవకాశం ఉంది.హైదరాబాద్‌లోని హస్తం పార్టీ ముఖ్యమంత్రులు…. ఢల్లీి అధిష్టానానికి తెలిపి… వారి నిర్ణయం వచ్చే వరకు చేతులు కట్టుకొని చేష్టలుడిగి… ఆధిష్టానం నిర్ణయం కోసం వెయిటింగ్‌ చేయడం.. అలాగే ఢల్లీి నుంచి వచ్చిన ఆధిష్టానం దూతలు.. సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించడం.. అదే విధంగా అంతర్గత ప్రజాస్వామ్యనికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో రేగిన అసమ్మతి రాగాన్ని సవరించేందుకు ఢల్లీి నుంచి భాగ్యనగరానికి చేరిన దూతలు… కూల్‌ కూల్‌ అంటూ అసమ్మతి నేతలను కూల్‌ చేయడం వంటి వగై రాజకీయాలకు హోల్‌సేల్‌గా చెక్‌ పెట్టిన ఒకే ఒక్కడు.. మూడుక్షరాల మహాశక్తి ఎన్టీఆర్‌. ఆ యుగ పురుషుడు ప్లస్‌ శక పురుషుడి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా.. మే 27వ తేదీన పసుపు పార్టీ పండుగ.. మహా పండగ.. మహానాడు ప్రారంభం కానుంది. మరోవైపు ఆ కథానాయకుడు ప్లస్‌ మహానాయకుడు శత జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు వేదికగా ముగియనున్నాయి. ఆ క్రమంలో ఈ మహానాడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నగారి ఆత్మబంధువులు.. లక్షలాదిగా తరలిరానున్నారు. అందుకోసం ఏర్పాట్లు వాయువేగంతో జరుగుతున్నాయి. ఇంకోవైపు.. ఈ ఏడాది చివర లేకుంటే.. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగనున్నాయనే ఓ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ సైకిల్‌ పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై అటు అన్ని వర్గాల ప్రజలే కాదు.. ఇటు వివిధ రాజకీయ పార్టీలు, నేతలల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఈ వేడుక వేదికగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేయనున్నారని.. అందులోభాగంగా అన్న గారు స్థాపించి పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలను ఈ వేదికపై నుంచి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే జగన్‌ గద్దెనెక్కిన తర్వాత.. అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం విమర్శనాస్త్రాలు సందించేందుకు తమ మాటలకు పదును పెడుతోన్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *