ఫోర్త్‌ సాటర్డే… నో బ్యాగ్‌ డే

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని ‘నో బ్యాగ్‌ డే’గా పాటించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఆరోజు బ్యాగ్‌ లేకుండానే స్కూల్‌కు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి(2023`24) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జూన్‌ 6న జారీ చేశారు. దీంతో ఏడాదిలో మొత్తం 10 రోజుల పాటు పిల్లలు స్కూల్‌ బ్యాగులు లేకుండానే బడికి వెళ్లనున్నారు. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.గతేడాది పాఠశాలలు తెరిచిన 16 రోజుల తరువాత క్యాలెండర్‌ విడుదల చేయగా.. ఈసారి పాఠశాలలు పునఃప్రారంభానికి వారం రోజులు ముందుగానే విడుదల చేయడం విశేషం. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరం మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. జూన్‌ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23తో ముగియనున్నాయి.
నెల పనిదినాలు
జూన్‌ 16
జులై 23
ఆగస్లు 25
సెప్టెంబరు 22
అక్టోబరు 14
నవంబరు 24
డిసెంబరు 23
జనవరి 20
ఫిబ్రవరి 24
మార్చి 23
ఏప్రిల్‌ 15
మొత్తం పనిదినాలు 229
ఆటలు, యోగా, రీడిరగ్‌ తప్పనిసరి..
టీవీ పాఠాలు యథావిధిగా ప్రసారం చేయనున్నారు. కార్యక్రమాల టైమ్‌ టేబుల్‌ను వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ ప్రకటిస్తారు. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు విద్యార్థులో పుస్తకాలు చదివించాలి. అవి పాఠ్య, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజీన్లు తదితరాలు కావొచ్చు. రోజూ స్కూల్‌ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో అయిదు నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. వారానికి 3` 5 పీరియడ్లు ఆటలకు కేటాయించాలి. ప్రతి నెల మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.
ఈసారి సెలవులు ఇలా..
? దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా ఈసారి 13 రోజులే ఇచ్చారు. దసరా సెలవులు అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇచ్చారు.
? క్రిస్మస్‌ సెలవులు కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించడం గమనార్హం. డిసెంబరు 22 నుంచి 26 వరకు క్రిస్మస్‌ సెలవులు ఇచ్చారు.
? ఇక సంక్రాంతికి మాత్రం గత విద్యాసంవత్సరం 5 రోజులు సెలవులు ఇవ్వగా.. ఈసారి 6 రోజులు ఇవ్వనున్నారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.
? ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. గత విద్యాసంవత్సరంలో 48 రోజుల వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *