భూజాలు తడుముకొంటున్న కొడాలి నాని

విజయవాడ, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
గుడివాడ క్యాసినో వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే తీరు ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటే ‘దొంగే.. దొంగ దొంగ అరిచినట్టు’ కొడాలి నాని తెలుగుదేశం నేతలకు సవాల్‌ వసురుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలో క్యాసినోను తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి అందజేసి తనను అరెస్ట్‌ చేయించాలంటూ కొడాలి చేసిన సవాల్‌ పట్ల టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున క్యాషినో నిర్వహించారు. అది కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సొంత ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించడం సంచలనంగా మారింది. అప్పటికే భూ దందాలు, పేకాట క్లబ్బులు నిర్వహించడంలో నానికి అందెవేసిన చెయ్యి అనే పేరుంది. అయితే.. అప్పుడు ఇలా గోవా తరహాలో క్యాషినో నిర్వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలైతే ఓ రేంజ్‌ లో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నిజనిర్ధారణ కోసం గుడివాడ వస్తున్న టీడీపీ నేతలను పోలీసలు, కొడాలి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీలంక, నేపాల్‌, గోవాల్లో క్యాషినోలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఇటీవల హైదరాబాద్‌ లో చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డిల ఇళ్లు, నగర శివార్లలోని ప్రవీణ్‌ ఆస్తులపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. చీకటి వ్యాపారాల్లో సిద్ధహస్తుడైన చీకోటి ప్రవీణ్‌ కు` గుడివాడలో జరిగిన క్యాషినోకు సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిదే. చీకోటి ప్రవీణ్‌ ను కొడాలి నానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిచయం చేశారని, ఆ క్రమంలోనే కొడాలి నాని ఫంక్షన్‌ హాల్‌ లో క్యాషినో నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు.ఈ విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఎత్తి చూపుతూ.. చీకోటి ప్రవీణ్‌ తో వల్లభనేని వంశీ కలిసి ఉన్న ఫొటోలను విూడియా ముందు ప్రదర్శించారు. గోవా తరహాలో గుడివాడలో క్యాషినో నిర్వహించడం వెనుక చీకోటి ప్రవీణ్‌, కొడాలి నాని, వల్లభనేని వంశీ హస్తం ఉందని వర్ల రామయ్య ఆరోపించారు.. గుడివాడలో క్యాషినో తాను నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే.. ఈడీకి సమర్పించి తనను అరెస్ట్‌ చేయించాలని కొడాలి నాని టీడీపీ నేతలకు బహిరంగంగా సవాల్‌ విసిరారు. ‘బురద పాము కోపం’ అనే సామెత ఒకటి ఉంది.. విషం లేని బురద పాము కరిచినా ప్రమాదం ఉండదు. అలాగే ఒక పక్కన మంత్రి పదవి కోల్పోయి, మామూలు ఎమ్మెల్యేగా ఉంటున్న కొడాలి నాని హవా ఇప్పుడు స్థానికంగా అస్సలు లేదట. స్థానిక అధికారులు కూడా ఆయన మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులే కాదు స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. చెత్తపై పన్ను వసూలు చేయొద్దని కొడాలి చెప్పినా గుడివాడ మున్సిపల్‌ అధికారులు పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే మాట విని విధులు నిర్వర్తించకుండాఉండమని ఆయనకే ఖరాకండీగా చెప్పేశారు. దీంతో కోరలు పీకిన పాములా కొడాలి నానిలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోంది. అందుకే చెత్త పన్ను విషయంలో సీఎం జగన్‌ తోనే మాట్లాడతానంటూ తనలాగే అమాత్య పదవి కోల్పోయిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాయంకోరినట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు.టీడీపీ నేతల నుంచి, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో కొడాలి నాని భుజాలు తడుముకుంటున్నారని, దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు చేస్తున్నారంటున్నారు. చేతనైతే తనన అరెస్ట్‌ చేయించాలంటూ కొడాలి నాని సవాల్‌ విసరడం వెనక ఆయనలోని ఉలికిపాటు బట్టబయలైందంటున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
05చంద్రబాబుకు సమస్యగా మారిన ఆత్మీయులు
విజయవాడ,జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. ఆయన పక్కనే ఉన్నారు. ఎక్కడో హైదరాబాద్‌ లో వ్యాపారం చేసుకుంటూ, అక్కడ ట్యాక్సులు కడుతూ ఏపీపై పెత్తనం చేయాలనుకునే వారితోనే చంద్రబాబుకు సమస్యగా మారిందని చెప్పాలి. ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు, దర్శకులు చంద్రబాబుకు వత్తాసు పలకడం ఇప్పటి నుంచి మొదలు కాలేదు. ఎన్టీఆర్‌ ను దించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు తెలివిగా సినిమా ఇండ్రస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నారు. తాను అధికారంలో ఉండగా వారికి ఇతోధిక సాయం చేస్తుండటంతో చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు వీరంతా ఆయన వైపు నిలుస్తారు. అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారిందని చెప్పకతప్పదు. చంద్రబాబు ఒక సామాజికవర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తొలి నుంచి ప్రచారం ఉంది. వైసీపీ అందుకు అనుగుణంగా కమ్మ సామాజికవర్గం నేతలు లబ్దిపొందిన వైనాన్ని హైలెట్‌ చేస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి రావాలంటే వైసీపీ, టీడీపీలకు వారి సామాజికవర్గాలు ఒక్కరే మద్దతిస్తే సరిపోదు. ఆ విషయం పార్టీ అధినేతలకు తెలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటూ అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక చంద్రబాబు అయితే అధికారంలో లేకపోతే విలవిలలాడిపోయే వారు కొందరున్నారు. వారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, మరో చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ లు ఇద్దరూ ముందు వరసలో ఉంటారు. సీనీ పరిశ్రమలో వ్యక్తుల కంటే రాజకీయ నేతలుగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి చంద్రబాబు ఆయనను గౌరవించారు. రాఘవేంద్రరావు ఇటీవల తెనాలి లో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీ మళ్లీ రావడం ఖాయమని చంద్రబాబు సీఎం కావడం రాష్ట్రానికి అవసరమని ఆయన చెప్పారు. నిజానికి రాఘవేంద్రరావు ఆంధ్రప్రదేశ్‌ లో ఎలాంటి వ్యాపారం చేయరు. ఆయన బిజినెస్‌ అంతా తెలంగాణలోనే. చంద్రబాబు రావాలని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై ఆయన తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తిరిగి తనకు నామినేటెడ్‌ పదవి లభించవచ్చన ఆశకావచ్చు. తాజాగా అశ్వినీదత్‌ చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి ఇబ్బంది పెట్టేవే. వైసీపీ హయాంలో తిరుమల సర్వ నాశనం అయిందన్నారు. అక్కడ జరగని పాపం లేదని, జరుగుతున్న అన్యాయాలను చూడలేమన్నారు. ఏమయిందో? ఎందుకయిందో? అన్యాయాలేంటో మాత్రం చెప్పలేదు కాని తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అశ్వినీదత్‌ వ్యాఖ్యానించారు. అశ్వినీదత్‌ వ్యాపారాలు, నివాసం అంతా హైదరాబాద్‌ లోనే. ఆయన కారు కొన్నా తెలంగాణలో కొంటారు. ఇల్లు కొన్నా అంతే. అక్కడి ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. కృష్ణాజిల్లా స్వస్థలమైన అశ్వినీదత్‌ హైదరాబాద్‌ లో ఉంటూ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏవగింపుగా మారాయన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పులేదు కాని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారు పార్టీ సభ్యత్వం పుచ్చుకోవడమే బెటర్‌. ఇలాంటి వారితోనే టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారిందని చెప్పక తప్పదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *