మళ్లీ ముందుస్తు చర్చలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి చర్చ నడుస్తూనే ఉంది?ఇప్పటికే గత రెండేళ్ల నుంచి ఈ ముందస్తుపై చర్చ జరుగుతూ వస్తుంది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు సైతం ముందస్తుపై మాట్లాడుతూ వస్తున్నాయి. కానీ ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని టీఆర్‌ఎస్‌ నేతలు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు.కానీ ఈ మధ్య కేసీఆర్‌..బీజేపీతో ఛాలెంజ్‌ చేయడంలో భాగంగా?ఎన్నికల తేదీని చెప్పండి?అప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్దామని అన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తుకు సై అన్నాయి..అయితే కేటీఆర్‌ వచ్చి?తాము పూర్తికాలం అధికారంలో ఉంటామని ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. దీంతో ముందస్తుపై చర్చ ఆగిపోయింది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి ముందస్తు చర్చ మొదలైంది.కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి?కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు?అలాగే స్పీకర్‌ కు కూడా రాజీనామా పంపించి..ఆమోదింపచేసుకుంటానని అంటున్నారు. అలాగే ఈ నెల 21న బీజేపీలో చేరతానని ప్రకటించారు. రాజగోపాల్‌ రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తుంది.అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక?ఒక సెవిూ ఫైనల్‌ లాంటిదని చెప్పొచ్చు?ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఓడిపోతే అంత ఇబ్బంది ఉండదు?అధికారంలో ఉన్న పార్టీ గెలిచిందని అనుకుంటారు. కానీ అధికారంలో టీఆర్‌ఎస్‌ దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల మాదిరిగా?మునుగోడులో ఓడిపోతే ఇంకా అంతే సంగతులు.ఉపఎన్నికలో ఓడిపోతే?సాధారణ ఎన్నికల్లో చాలా ప్రభావం ఉంటుంది?అప్పుడు బీజేపీ ఇంకా దూకుడుగా ఉంటుంది.ప్రజా మద్ధతు ఆ పార్టీకే ఉందనే పరిస్తితి ఉంటుంది?దీని వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద డ్యామేజ్‌ జరుగుతుంది. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికకు వెళ్ళడం కంటే ఏకంగా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే బెటర్‌ అని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయట. అటు మునుగోడు ఉప ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకే కేసీఆర్‌ మొగ్గు చూపొచ్చని ప్రచారం కూడా వస్తుంది. మొత్తానికి తెలంగాణలో ముందస్తుపై చర్చ నడుస్తూనే ఉంది.
పక్కా ప్లాన్‌ తో కోమటిరెడ్డి బ్రదర్స్‌
ఎప్పుడైతే రేవంత్‌ రెడ్డికి పిసిసి పదవి వచ్చిందో అప్పటినుంచే కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఖరి కాస్త వేరుగానే ఉందని చెప్పొచ్చు. తనకు కాకుండా రేవంత్‌ రెడ్డికి పిసిసి పదవి రావడంపై అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి?రేవంత్‌ పై తీవ్ర విమర్శలు చేశారు?డబ్బులు ఇచ్చి పదవి కొన్నారని, చంద్రబాబు రేవంత్‌ వెనుక ఉన్నారని, ఆయనే రేవంత్‌ రెడ్డికి పిసిసి పదవి ఇప్పించారని మాట్లాడారు.అటు రాజగోపాల్‌ రెడ్డి సైతం?రేవంత్‌ రెడ్డికి యాంటీగానే మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఆయన అప్పుడే బీజేపీ అగ్రనేతలతో టచ్‌ లోకి వెళ్లారని కథనాలు కూడా వచ్చాయి?రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందని, టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని రాజగోపాల్‌ మాట్లాడారు. అయినా సరే కోమటిరెడ్డి బ్రదర్స్‌ కరుడుకట్టిన కాంగ్రెస్‌ వాదులు కాబట్టి?వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం గాని, వారిపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం గాని చేయలేదు.కానీ వారు నిదానంగా రేవంత్‌ ఆధ్వర్యంలో నడిచే కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టే విధంగా రాజకీయం నడుపుతున్నారనే సంగతి ఎవరు పసిగట్టలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు?ఇక్కడ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల హవానే ఎక్కువ. అలాంటిది కోమటిరెడ్డి బ్రదర్స్‌ ద్వారా నల్గొండలో బలం పుంజుకోవాలనే ప్లాన్‌ తో కమలం పార్టీ రాజకీయం నడిపించిందని చెప్పొచ్చు.ముందుగానే కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేత కాంగ్రెస్‌ పని అయిపోయిందని చెప్పించి?అది కూడా రేవంత్‌ రెడ్డి వల్లే పార్టీ నాశనమవుతుందని, అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా రాజకీయం నడిపించారని తెలుస్తోంది. అలా పార్టీని దెబ్బకొట్టకే ఇప్పుడు రాజగోపాల్‌ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక తాను కాంగ్రెస్‌ ని వదలనని వెంకటరెడ్డి చెబుతున్నా సరే?ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే కోమటిరెడ్డి బ్రదర్స్‌ పక్కా ప్లాన్‌ ప్రకారమే కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టి బీజేపీలోకి వెళుతున్నారని రేవంత్‌ వర్గం అనుమానిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *