మరో 27 రోజులు…

గుంటూరు, అక్టోబరు 3
రాజకీయాల్లో సెంటిమెంట్‌ అస్త్రాలు చాలానే ఉంటాయి. పెను ప్రభావం చూపుతాయి కూడా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయంలో ఈ సెంటిమెంట్లు చాలాసార్లు ప్రభావం చూపాయి . ముఖ్యంగా ఆగస్టు వచ్చిందంటే చాలు ఆ పార్టీ బెంబేలెత్తిపోతుంది. క్యాడర్లో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఎన్టీఆర్‌ హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పడం లేదు.1984 ఆగస్టు 15న నందమూరి తారక రామారావు పై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. 1995 ఆగస్టులో అదే ఎన్టీఆర్‌ పై చంద్రబాబు తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఆగస్టులోనే టిడిపిలో ఎన్నో రకాల సంక్షోభాల చోటు చేసుకున్నాయి. ఎంతోమంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. కొందరు ప్రమాదాల బారిన పడ్డారు.ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి సెప్టెంబర్‌ సంక్షోభం వెంటాడిరది. అక్టోబర్‌ లోనూ కొనసాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యింది సెప్టెంబర్‌ నెలలోనే. ఆయన కుమారుడు లోకేష్‌ తో పాటు పార్టీ కీలక నాయకుల సైతం కేసుల బారిన పడ్డారు. వారి అరెస్టులు సైతం తప్పవని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఇంతవరకు జైలు ముఖం చూడలేదు. ఆయన అరెస్టు సైతం ఎవరూ ఊహించలేదు. ఒకవేళ అరెస్టు చేసినా గంటల వ్యవధిలో బయటకు వస్తారని భావించారు. కానీ గంటలు రోజులుగా మారాయి. రోజులు వారాలు దాటుతున్నాయి. నెల రోజులు సవిూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సెప్టెంబరు, అక్టోబరు చంద్రబాబుకు చీకటి రోజులుగా మిగిల్చింది. దీనిని చంద్రబాబు అధిగమిస్తారని పార్టీ శ్రేణులు కొండంత ఆశలు పెట్టుకున్నాయి.అయితే గతంలో కూడా అక్టోబరు నెలలో చంద్రబాబు దాదాపు మృత్యువు అంచులోకి వెళ్ళిపోయారు. అయినా మృత్యుంజయుడిగా నిలిచారు. 2003 అక్టోబర్‌ 1న సీఎంగా ఉన్న చంద్రబాబు తిరుపతి వెళ్లారు. టీటీడీ భక్తుల వసతి కోసం నిర్మించిన శ్రీనివాస వసతి సముదాయాన్ని ప్రారంభించారు. కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరుమల బయలుదేరారు. సరిగ్గా అలిపిరి టోల్‌ గేట్‌ సవిూపంలో నక్సలైట్ల బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్లెట్‌ ప్రూఫ్‌ కావడంతో బతికి బయటపడ్డారు. ఆ ఘటన సైతం అక్టోబర్‌ లోనే చోటు చేసుకోవడం విశేషం. ఆ ఘటన జరిగి నిన్నటికి 20 ఏళ్లు గడుస్తోంది.ప్రస్తుతం కేసుల నుంచి సైతం ఆయన అదే మాదిరిగా బయటకు వస్తారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *