తెలంగాణపై కాంగ్రెస్‌ హై కమాండ్‌ దృష్టి

హైదరాబాద్‌, జూలై 6
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే? ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే? అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్‌ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటూ? నౌ ఆర్‌ నెవర్‌ అంటున్నారట పార్టీ పెద్దలు. అందుకనే? సోనియా, రాహుల్‌, ప్రియాంక.. ఇలా అంతా ఇప్పుడు తెలంగాణ విూద ఫోకస్‌ పెట్టారట. మరీ ముఖ్యంగా పొలిటికల్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్న సోనియా కూడా ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉన్నట్టు తెలిసింది. ఖమ్మం బహిరంగ సభ జరిగిన రోజున ఆమె వ్యవహారశైలి గురించి తర్వాత తెలుసుకున్న టి కాంగ్రెస్‌ నేతలు అవాక్కయ్యారట.ఖమ్మం సభ జరుగుతున్న తీరును సోనియా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ? స్వయంగా పర్యవేక్షించారట. సభ విూద పోలీసుల ఆంక్షలు, వచ్చేవారిపై నియంత్రణ గురించి తెలుసుకున్న సోనియాగాంధీ?. నాలుగైదు సార్లు రాహుల్‌ సెక్యూరిటీ అధికారుకి ఫోన్‌ చేసి ఆరా తీశారట. సభ దగ్గర ఎవరెవరు ఉన్నారు..? ఏం జరుగుతోంది? జన సవిూకరణ?లాంటి అంశాలపై ఆమె వాకబు చేసినట్టు తెలుసుకున్న కొంత మంది సీనియర్‌ నేతలు అవాక్కయ్యారట. మేడమే నేరుగా ఫోకస్‌ పెట్టడం ఏంటి? ఆ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారంటే?.అధిష్టానం ఎంత సీరియస్‌ గా తెలంగాణ విూద ఫోకస్‌ పెట్టిందో అర్థం అవుతోందంటున్నారు. అటు చేరికలపై కూడా నేరుగా అధిష్టానమే దృష్టిసారిస్తోంది. పార్టీ చేయించుకుంటున్న సర్వేల ఆధారంగానే చేరికల లెక్కలు ఉన్నట్టు తెలిసింది. ఎత్తుగడలకు సంబంధించిన ఆదేశాలన్నీ?.ఢల్లీి నుంచే వస్తున్నాయని అంటున్నారు. అంటే? ఎట్నుంచి ఎటు చూసినా? ఏ అవకాశాన్ని మిస్‌ అవకుండా జాగ్రత్తలు తీసుకుని ప్లాన్‌ చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌ అధిష్టానం. ఖమ్మంలాంటి సభల్ని వీలైనంత ఎక్కువగా పెట్టాలన్న ఆలోచన కూడా మొదలైందట. అలాగే ఎన్నికలలోపు రాహుల్‌ బహిరంగ సభలు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పార్టీ హైకమాండ్‌కు ఉన్నట్టు తెలిసింది.ఖమ్మం సభపై రాహుల్‌ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సభ ముగిశాక విజయవాడ వెళ్తూ?. దారిలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జి థాక్రే తో తెలంగాణపై చర్చించారట రాహుల్‌. ఖమ్మం లాంటి సభలు జిల్లాకు ఒకటి నిర్వహించేలా ప్లాన్‌ చేయాలని సూచించారట. పాలమూరు జిల్లా సభను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పినట్టు తెలిసింది. జూపల్లి చేరిక సభకు ప్రియాంక వస్తున్నందున ఖమ్మం తరహాలో సభను నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. పాలమూరు సభ తేదీ ఖరారవకున్నా? ఈనెల 20న నిర్వహించవచ్చని ప్రాధమిక సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా సభ అయ్యాక పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ విూటింగ్‌ పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా వరుస సభలు..సమావేశాలతో టి కాంగ్రెస్‌లో జోష్‌ నింపే పనిలో పడిరది పార్టీ అధిష్టానం. ఆ ప్రణాళికలు ఏ మేరకు వర్కౌట్‌ అవుతాయో, రాష్ట్ర నాయకులు ఎంత వరకు సఖ్యతగా కలిసి పనిచేస్తారో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *