జనవరి 1 నుంచి మరో ఐదేళ్లు

న్యూఢల్లీి, నవంబర్‌ 30
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్‌ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడిరచింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద మరో ఐదేళ్లపాటు పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనకు వచ్చే ఐదేళ్లలో రూ.11.8లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను అనురాగ్‌ ఠాకూర్‌ విూడియాకు తెలిపారు.ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను కేంద్రం.. దేశంలో కొవిడ్‌ విజృంభించిన సమయంలో పేదలకు అండగా ఉండేందుకు 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులకు ఒకరికి 5కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం 2023 డిసెంబర్‌ 31తో గడువు ముగియగా.. కేంద్ర కేబినెట్తాజా నిర్ణయంతో మరో ఐదేళ్లపాటు కొనసాగనుంది.ఇక, కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్ను రాబడిని పంచుకోవడంపై నిర్ణయం తీసుకునే 16వ ఆర్థిక సంఘం విధివిధానాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని అనురాగ్‌ ఠాకూర్తెలిపారు. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2025 అక్టోబర్‌ నాటికి సమర్పిస్తుందన్నారు. 2026 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి సిఫార్సులు చెల్లుబాటు అవుతాయని చెప్పారు.కాగా, డ్వాక్రా గ్రూపులకు వ్యవసాయ డ్రోన్‌లను అందించే పథకానికి కేంద్రం మంత్రివర్గం గ్రీన్సిగ్నల్‌ ఇచ్చింది. 15వేల డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించి.. వారికి శిక్షణ ఇవ్వనుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఈ డ్రోన్లను డ్వాక్రా గ్రూపులు అద్దెకు ఇవ్వనున్నాయి. 2023`24 నుంచి 2025`2026 మధ్యకాలంలో ఎంపిక చేసిన 15,000 డ్వాక్రా గ్రూపులకు డ్రోన్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఇది ఇలావుండగా, కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ గురించి చర్చకు వచ్చిందని అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని వెల్లడిరచారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నా కూడా.. సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్సింగ్‌ ధావిూతో రోజుకు రెండు సార్లు మాట్లాడినట్లు విూడియా అడిగిన ప్రశ్నకు ఠాకుర్సమాధానమిచ్చారు. కాగా, కార్మికుల క్షేమంగా బయటికి రావడంతో మంగళవారం రాత్రి ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, కార్మికులకు ఫోన్‌ చేసి మాట్లాడారు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమన్నారు. వారంతా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చాలా రోజుల నిరీక్షణ తర్వాత వారంతా తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం గొప్ప సంతృప్తిని కలిగించిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇలాంటి సవాళ్ల సమయంలో ఆయా కుటుంబాలు ప్రదర్శించిన ధైర్యం ప్రశంస నీయమన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎంతగానో శ్రమించిన సహాయక సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. వారి ధైర్యం, సంకల్పమే కార్మిక సోదరులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, టీంవర్క్‌ కు అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ ప్రశసించారు ప్రధాని మోడీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *