జూన్‌ 30వరకు ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు

రుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్‌ 30 వరకు ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేసినట్లు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. దీంతో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం ఆర్జితసేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తుల సౌలభ్యం కోసం జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో 20 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీని వల్ల ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుందన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి కిలోవిూటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం అవుతుందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.టీటీడీ శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జులై, ఆగస్టు నెలల కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ష్ట్రబిబిజూబ://బితితీబీజూజీబితిపజీశ్రీజీతీతి.జీజూ.ణనీల.తినిలో దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్‌ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు లక్కీ డిప్‌ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కోటా వంటి టికెట్లు కోసం భక్తులు ఎదురు చూడాల్సిన పనిలేకుండా, ఇకపై ప్రతి నెలా నిర్ణీత తేదీల్లోనే తర్వాతి నెలలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ లో విడుదల చేయనున్నట్లు టీటీటీ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *