చంద్రుడి వీడియో షేర్‌ చేసిన చంద్రయాన్‌

బెంగళూరు, ఆగస్టు 7
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. చంద్రుడిపై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్‌`3 అనుకున్న లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇప్పటికే చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఒక వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుండటం విశేషం. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌ 3 స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసింది ఇస్రో.ఇస్రో జులై 14న చంద్రయాన్‌ 3 ప్రయోగం ప్రారంభించిన విషయం విధితమే. ఆ తర్వాత కక్ష్యను పెంచుకొని, ఈ ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం శనివారం రాత్రి 7 గంటల సమయంలో జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. లూనర్‌ ఆర్బిట్‌ ఇనసర్షన్‌ పక్రియను విజయవంతంగా చేపట్టామని, చంద్రయాన్‌`3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ 11గంటలకు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.విూల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్‌ ను ల్యాండ్‌ చేస్తారు.ఇలా జాబిల్లికి నెమ్మదిగా చేరువవుతోంది చంద్రయాన్‌ 3. ఇక చంద్రుడికి సంబంధించి చంద్రయాన్‌?3 పంపించిన తొలి వీడియో ఇదే. ఈ క్రమంలోనే చంద్రుడికి మరింత చేరువ చేసే దిశగా శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి వ్యోమనౌకిలోని ఇంజన్‌ను మండిరచి కక్ష్యను కుదించారు. ఇక చంద్రయాన్‌`3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. చివరిలో చంద్రుడికి 100 కి.విూలో ఎత్తున ఉన్న దీర్ఘవృత్తకార కక్ష్యలోకి చంద్రయాన్‌3ని ప్రవేశపెట్టనున్నారు. ఇక 23వ తేదీన జాబిల్లిపై ల్యాండ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్‌ 3 చంద్రుడి చుట్టూ మొదటి రౌండ్‌ ను పూర్తి చేసింది. మరో ఐదు రౌండ్లు పూర్తి చేసిన తర్వాత ల్యాండ్‌ కానున్న ల్యాండర్‌. చంద్రుడికి దగ్గరగా 170 కి.విూ, దూరంగా 4313 కి.విూ దూరంలో చంద్రయాన్‌ 3 ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *