అధికారుల మెడకు ఓట్ల రాజకీయం

ఒంగోలు, ఆగస్టు 234
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు ఆడుతున్న ఓట్ల రాజకీయం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. అనంతపురం జిల్లాలోనే ఇద్దరు అధికారులపై వేటు పడిరది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారుల్లో గుబులు మొదలైంది. పదులు, వందలు కాదు…వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉరవకొండ నియోజకవర్గంలో బయటపడ్డాయ్‌. ఎన్నికల సంఁఘం 6వేల దొంగ ఓట్లను గుర్తించింది. అనంతపురం జిల్లా పరిషత్‌ ప్రధాన ఎన్నికల అధికారి కె. భాస్కర్‌ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. 2021లో జడ్పీ సీఈవోగా పని చేసిన శోభాస్వరూపపైనా చర్యలు తీసుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగించారని…వేల సంఖ్యలో ఓట్లు తొలగించారంటూ ఏపీ పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌… గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఓట్లను తొలగించినట్లు నిర్ధారించించుకుంది. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి.. ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ కొనసాగించినట్లు తేలింది. ప్రతి జిల్లాలోనూ దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ తీసుకుంది. దీంతో మిగిలిన జిల్లాలోని అఁధికారుల్లోనూ వణుకు మొదలైంది. ఎన్నికల సంఘం విచారణకు వస్తే తమ బండారం బయటపడుతుందని లోలోపల ఆందోళనకు గురవుతున్నారు. ఓటర్లకు ఎలాంటి నోటీసులు అందిచకుండానే ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారని పార్టీలు ఆరోపిస్తున్నాయ్‌. అనంతపురం జిల్లా రాప్తాడు, ధర్మవరం, ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ నేతలు…కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లయింట్‌ చేసారు. పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఎన్నికలు సవిూపిస్తుండడంతో ఓటర్ల జాబితాలపై ఫోకస్‌ పెట్టిన విపక్షాలు అధికార పార్టీని టార్గెట్‌ చేశాయి. ప్రభుత్వం ఓట్లు తొలగిస్తూ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ, బీజేపీ ఆరోపిస్తుంటే.. జాబితాల్లో తమ ఓట్లే గల్లంతవుతున్నాయని వైసీపీ అంటోంది. మొత్తానికి వరుస ఫిర్యాదులతో ఎన్నికల సంఘం వద్దకు క్యూ కడుతున్నారు ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు.అటు ఓటర్ల జాబితాలపై పార్టీలు ఫోకస్‌ పెట్టాయి. మరోవైపు తమ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు అవుతున్నాయంటున్నాయి విపక్షాలు. తమ ఓట్లే కనిపించడం లేదంటోంది వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా పరస్పర ఫిర్యాదులు.. ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరొక్కసారి హీటెక్కాయి. ఓటర్ల జాబితాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటోంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తేల్చుకుంటామంటున్నారు. ఈనెల 28న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ దొంగ ఓట్లను నమ్ముకుందని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పదివేల దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బూత్‌ స్థాయిలో ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని పార్టీ నాయకులకు సూచించారు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. చంద్రబాబు హయాంలో లక్షల దొంగ ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలు వున్నాయని.విచారణలో దొంగఓట్ల బాగోతం బయటపడితే…ఇంటికి పోక తప్పదా అని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ మధ్య తాము నలిగిపోవాల్సి వస్తుందని మథనపడుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *