చంద్రయాన్‌ 3 వేళ ఇస్రో ముందు సవాళ్లు

బెంగళూరు, జూలై 6
ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) తన చంద్రయాన్‌`3 మిషన్‌ను జూలై 13న ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ విషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. చంద్రయాన్‌`3 మిషన్‌లోని వ్యోమనౌక 2 నెలల సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుంది. ఇస్రో ఇంతకు ముందు కూడా చంద్రుడిపై అడుగుపెట్టింది. 2008 అక్టోబర్‌లో చంద్రయాన్‌`1 మిషన్‌ ద్వారా భారత్‌ చంద్రుడిపై మొదటి సారిగా అడుగుపెట్టింది. ఇంకా ఆ మిషన్‌ ద్వారా చంద్రుడిపై ఒకప్పుడు నీరు ఉన్నట్లుగా ఆనవాళ్లను భారత్‌ గుర్తించింది. అయితే చంద్రుడిపై దిగడం చాలా సవాళ్లతో కూడుకున్న మిషన్‌. చంద్రయాన్‌`2 మిషన్‌ పేరుతో 2019లో ఇస్రో చేపట్టిన విఫలమైన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ రెండూ క్రాష్‌ అయిన సంగతి తెలిసిందే.నిజానికి చంద్రునిపై లేదా అంతరిక్షంలోని వేరే గ్రహంపై ల్యాండిరగ్‌ చేయడానికి చాలా విషయాలపై కలిసి పనిచేయాలి. నావిగేషన్‌, ఫ్లైట్‌ డైనమిక్స్‌, లోడిరగ్‌ సైట్‌ క్లియర్‌ ఇమేజ్‌, లోడ్‌ అయ్యే ముందు సరైన సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ తగ్గడం వంటి ఎన్నో విషయాలు మిషన్‌ని ప్రభావితం చేస్తాయి.ఇంకా వ్యోమనౌక ఉపరితలం వైపు కదులుతూ విడిపోయినప్పుడు దానిపై ఉన్న ల్యాండర్‌ వేగాన్ని తగ్గించడం చాలా అవసరం. వేగాన్ని సెకనుకు మూడు విూటర్లకు తగ్గించకపోతే, లాడిరగ్‌ కూడా విఫలం కావచ్చు.ఇవే కాక చంద్రునిపై వాతావరణం , భూమిపై లాంటి గురుత్వాకర్షణ శక్తి లేని నేపథ్యంలో.. లోడ్‌ చేసే సమయంలోనే అంతరిక్ష నౌక వేగం, గురుత్వాకర్షణను చాలా బాగా కాల్క్యూలేట్‌ చేసుకోవాలి. పైగా చంద్రునిపై పెద్ద క్రేటర్స్‌ కూడా ఉన్నందున ల్యాండిరగ్‌ కోసం సరైన ఉపరితలాన్ని గుర్తించడం చాలా చాలా అవసరం. సరైన ల్యాండిరగ్‌ పాయింట్‌ని ఎంచుకోబడకపోతే, అంతరిక్ష నౌక క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *