కాంగ్రెస్‌ లో కొత్త చిచ్చు

నల్గోండ, జూన్‌ 28
కొత్త చేరికలతో జోరువిూదున్న తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త కలవరం మొదలైందా?? ఆ నేతల పై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు..? సొంత పార్టీ నేతల తీరు పై అసంతృప్తి ఉన్న ఆ సీనియర్‌ నేతలు కి అధిష్టానం ఇచ్చిన హావిూ ఏంటి?? ఆ నేతల పిర్యాదు తో చర్యలు తీసుకుంటారా?? ఎన్నికల వేల కలిసి పని చేస్తారా?? గ్రూపు లతో నష్టం కలిగిస్తారా?? కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త జోష్‌ వచ్చిన భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.. అధికార బిఆరెస్‌ కి తామే ప్రత్యామ్నాయం అనుకుంటున్న కాంగ్రెస్‌ లో కొత్త చిచ్చు మొదలైంది.. మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై సొంత పార్టీ నేతలే తనని టార్గెట్‌ చేసి బిఆరెస్‌ లోకి వెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి పిర్యాదు చేశారు.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి కూడా పిర్యాదు చేసినట్లు సమాచారం.. ఓ విూడియా ఛానెల్‌ తో పాటు కొన్ని పత్రికలు తాను పార్టీ మారుతున్న అంటూ చేస్తున్నా ప్రచారం వెనుక రేవంత్‌ హస్తం ఉందంటూ ఉత్తమ్‌ మండిపడ్డారు.. మరోవైపు జగ్గారెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పార్టీ కోసం తాను ఎంతో చేసానని అయినా తనని కోవర్ట్‌ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తనపై కోవర్ట్‌ ముద్ర తొలగించుకోవడానికి ప్రతిసారి శీల పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్ని రాహుల్‌ గాంధీ కి వివరిస్తానన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై గత కొంతకాలంగా వార్‌ రూమ్‌ కేంద్రంగా దుష్ప్రచారం చేస్తున్నారని అది కాంగ్రెస్‌ పార్టీకి సంబందించిన నేతలే అని గతంలో ఆయన పోలీస్‌ స్టేషన్‌ లో సైతం పిర్యాదు చేశారు.. గతంలో సేవ్‌ కాంగ్రెస్‌ పేరుతో బట్టి ఇంట్లో సీనియర్‌ నేతల సమావేశం జరిగినప్పుడు సైతం రేవంత్‌ పై ఉత్తమ్‌ ఫైర్‌ అయ్యారు..రాష్ట్ర పార్టీలో కొత్త మంది వ్యవహరిస్తున్న తిరుపై అధిష్టానానికి 10 పేజీల లేఖను రాశారు.. అధిష్టానం ఎన్నికల వేల అందరిని కలుపుకుపోవాలని రేవంత్‌ కి సూచనలు చేసింది.. దీంతో గతంలో అంటిముట్టనట్టుగా ఉన్న కోమటిరెడ్డి, రేవంత్‌ చేరికల విషయంలో ఇద్దరు కలిసి పొంగులేటి, జూపల్లి ఇంటికి వెళ్లి తామంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశారు.. ఇంతలోనే ఉత్తమ్‌ కామెంట్స్‌ చర్చనీయంశంగా మారింది. ఎన్నికల వేల గ్రూప్‌ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నందున నేతల మధ్య సమన్వయం చేయడం తో పాటు ఉత్తమ్‌ పిర్యాదు పై అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.
ఇద్దరిపై వేటు వేస్తే ఆల్‌ సెట్‌..
కర్నాటక ఎన్నికల గెలుపుతో ఊపులో ఉన్న టీ కాంగ్రెస్‌లో చేరికలు మరింత జోష్‌ నింపుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పేరు ఉన్నప్పటికీ అధికారానికి రెండు సార్లు దూరంగా ఉన్న కాంగ్రెస్‌.. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పవర్‌లోకి రావాలని ప్రయత్నిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశం దొరికినా హస్తం పార్టీ విడిచిపెట్టడం లేదు. ఓ వైపు చేరికల స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. మరోవైపు అధికార పార్టీ వైఫల్యాలపై విమర్శల వర్షం కురిపిస్తోంది. రానున్న ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢల్లీిలో ఏఐసీసీ అగ్ర నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే, పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణు గోపాల్‌ వంటి నేతలతో టీ కాంగ్రెస్‌ స్ట్రాటజీ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం చేసినట్లు టాక్‌. అంతేకాకుండా ఇవాళ జరిగిన స్టాటజీకి కమిటీ భేటీలో టీ కాంగ్రెస్‌ నేతలకు రాహల్‌ గాంధీ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.నేతలు విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు కామెంట్స్‌ చేయొద్దని.. పార్టీ అంతర్గత విషయాలపై విూడియాకు ఎక్కొద్దని టీ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇకపై పార్టీకి సంబంధించిన ఇంటర్నల్‌ మ్యాటర్స్‌ బహిరంగ వేదికలపై మాట్లాడితే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని నేతలకు తేల్చి చెప్పారు. నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, విభేదాలు వచ్చినా వాటిని నిర్దిష్ట వేదికల విూద చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దృష్టికి, లేకపోతే తనతో మాట్లాడాలని స్పష్టం చేశారు. ఇకపై పార్టీ నిబంధలను ఉల్లంఘిస్తే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని రాహుల్‌ తేల్చి చెప్పారు. పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో తనకు అంతా తెలుసని అన్నారు. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర నిర్దిష్ట సమాచారమే ఉన్నదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడకుండా ఇన్‌చార్జితోనే తేల్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్దరు నేతలపై వేటు వేస్తే పార్టీలో అంతా సెట్‌ అవుతోందని రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.తెలంగాణలో ఓ ఇద్దరు నేతలు దొరికేలా ఉన్నారని.. వారికి అధికారం కావాలో.. విూడియాలో కనిపించడం కావాలో డిసైడ్‌ చేసుకోవాలని రాహుల్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత పూర్తిగా హైకమాండ్‌దేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇద్దరి నేతలపై వేటు వేస్తే అంతా సెట్‌ అవుతోందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనంగా మారాయి. రాహుల్‌ గాంధీ సీరియస్‌ అయిన ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. రాహుల్‌ చెప్పినట్లుగానే ఎన్నికల ముందు ఇద్దరు కీలక నేతలపై వేటు వేస్తారా..అసలు ఆ ఇద్దరు నేతలు ఎవరు.. ఉన్నట్లుండి రాహుల్‌ ఇంత సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడానికి కారణం ఏంటి అని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *