ఈ సారి మాగుంటకు కష్టమేనా

ఒంగోలు, జూన్‌ 30
సీనియర్‌ పొలిటీషియన్‌, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పుడు బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస వివాదాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి. దాదాపు పాతికేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న మాగుంటకు వివాదాల జోలికి పోడన్న పేరుంది. కానీ? ఈ దఫా ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డితో రాజకీయ అరంగ్రేటం చేయించాలని చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొడుతోందట. గతంలో తన తండ్రి అందుబాటులో లేని సమయంలో రాఘవరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. దానిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు నేరుగా ఎంపీకే చెప్పేశారట. దీంతో ఆయనను వ్యాపారాలకే పరిమితం చేశారు శ్రీనివాసరెడ్డి. అలా వ్యాపార వ్యవహారాలు చూసుకునే క్రమంలోనే ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఇరుక్కున్నారు రాఘవరెడ్డి.తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత 1998లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులరెడ్డి. 1998, 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున, 2019లో వైసీపీ తరఫున మొత్తం నాలుగు సార్లు ఎంపీ అయ్యారాయన. 2014లో టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా ఓడారు. తర్వాత ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో తన వర్గాన్ని ఏర్పరచుకుని తాను ఏ పార్టీలో ఉన్నా వారిని కాపాడుకుంటు వస్తున్నారు మాగుంట. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరగడం, తాను మారటం లేదని వివరణ ఇవ్వడం ఇటీవల పరిపాటి అయింది. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని వైసీపీ తరపున ఒంగోలు లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించాలని పావులు కదుపుతుండగానే ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టవడం పెద్ద దెబ్బేనని అంటున్నారు. నేరాన్ని అంగీకరిస్తే రాఘవరెడ్డికి బెయిల్‌ వచ్చే అవకాశాలున్నా. చేయని తప్పును ఒప్పుకుంటే?తర్వాత రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, అందుకే బెయిల్‌ వచ్చేదాకా రాఘవ జైల్‌లోనే ఉంటారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట శ్రీనివాసుల రెడ్డి.అయితే అదే సమయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన మరోలా ఉన్నట్టు తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే? ఎక్కడన్నా తేడాకొట్టి ఎన్నికల నాటికి మాగుంట కుటుంబం పోటీ చేయలేని పరిస్థితి వస్తే? ఏంటన్నది అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే మాగుంటకు ప్రత్యామ్నాయాన్ని వెదికే పనిలో ఉన్నట్టు సమాచారం. పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పోటీకి సుముఖంగా ఉన్నా? ఆయన సొంత బావమరిది, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాటి ప్రభావం పార్టీ విూద పడి ఎన్నికల్లో నష్టం కలగవచ్చన్న అభిప్రాయం నాయకత్వానికి ఉంది. అందుకే సుబ్బారెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం అంత సుముఖంగా లేనట్టు తెలిసింది. ఒకవేళ కాదు కూడదని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వైవీని పోటీలో దింపినా?తర్వాత మనసులు కలవకుంటే?ఇబ్బంది లేని చోట టఫ్‌ ఫైట్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలకు ఉందట. ఒంగోలు లోక్‌సభ సీటుకు ప్రత్యర్థుల నుంచి చెప్పుకోతగ్గ అభ్యర్థులు లేనందున ఇప్పటికిప్పుడు టెన్షన్‌ పడి ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నది వైసీపీ అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు మాగుంట కూడా సీఎం జగన్‌కు అన్ని విషయాలు చెప్పామని, కాంట్‌ బట్‌ సిట్యుయేషన్‌ వచ్చినప్పుడు చూద్దామనుకుంటున్నట్టు తెలిసింది. పైకి గంభీరంగా చెబుతున్నా? లోలోపల మాత్రం ఆ రోజుకు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ మాగుంటలో ఉందన్నది సన్నిహితుల మాట. పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయం చూసుకుంటుందా? లేక టెన్షన్‌ లేకుండా సిట్టింగే మళ్ళీ బరిలో దిగుతారా అన్నది చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *