వరంగల్‌ లో ఎర్త్‌..బెర్త్ల్‌ లటెన్షన్‌

వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ రాజకీయాల రంగు రోజు రోజుకీ మారుతోంది. కొత్త సవిూకరణాలు తెరపైకి వస్తున్నాయి. అభ్యర్థులను మార్చేస్తారన్న ప్రచారం అందులో పీక్స్‌లో ఉందట. దీనికితోడు ఇద్దరు ఎంపీలు.. ఐదుగురు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. సిట్టింగ్‌లపై జనాల్లో వ్యతిరేకత ఉందని పరోక్షంగా సొంత పార్టీ వర్గాలు చేపడుతున్న ప్రచారం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.జిల్లాలో కాంగ్రెస్‌ కార్యక్రమాలు పెరగడం.. బీజేపీ కాలుదువ్వుతుండటంతో.. ఈ దఫా పోటీ ఆషామాషీ కాదనే చర్చ జరుగుతోంది. జిల్లాలో ఐదారు స్థానాల్లో అధికారపార్టీకి ఎదురీత తప్పదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయట. మొన్నటి వరకు టికెట్‌పై ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా.. ఇప్పుడిప్పుడే స్వరాలు పెరుగుతున్నాయి. సర్వే ఆధారంగా అభ్యర్థులను మార్చాలని చూస్తే.. పోటీకి సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారట. అయితే ఈ జాబితాలో ఎంపీలు.. కొందరు ఎమ్మెల్సీలు ఉండటంతో వారికి ఛాన్స్‌ ఇస్తే.. తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట.మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత.. లోకల్‌ అసెంబ్లీ సీటుకు గురిపెట్టారు. వరంగల్‌ ఎంపీ దయాకర్‌ వర్ధన్నపేట సీటు ఆశిస్తున్నారట. వర్థన్నపేట వీలు కాకపోతే స్టేషన్‌ ఘన్‌పూర్‌ అయినా ఓకే అంటున్నారట. ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా.. బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి.. మధుసూదనా చారిలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగాలని ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది.బస్వరాజు సారయ్య వరంగల్‌ తూర్పుపై ఫోకస్‌ పెట్టి.. అక్కడ కార్యక్రమాల జోరు పెంచారు. కడియం శ్రీహరి సైతం.. నియోజకవర్గంలో అదే పనిగా పర్యటన చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు శ్రీహరికి పడదు. గతంలో స్పీకర్‌గా ఉండటం వల్లే 2018 ఎన్నికల్లో ఓడినట్టు మధుసూదనాచారి భావిస్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. భూపాలపల్లిపై మమకారం చంపుకోవడానికి సిద్ధంగా లేననే సంకేతాలు ఇస్తున్నారట. మంత్రి సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌పై ఆశలు పెంచుకున్నారట. ఎంపీ కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. రెడ్యనాయక్‌ లోక్‌సభ బరిలో ఉంటారని.. అప్పుడు తనకు లైన్‌ క్లియర్‌ అవుతుందని భావిస్తున్నారట.ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వల్ల ఎవరి సీటుకు ఎర్త్‌ పడుతుందో కేడర్‌కు అంతుచిక్కడం లేదట. ఇలా ఎంపీలు.. ఎమ్మెల్సీలు తమ మనసులోని మాటను అధిష్ఠానం దృష్టిలో పడేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేలలో బీపీ పెరిగిపోతోందట. మరి సిట్టింగ్‌ల పరేషాన్‌ ఎప్పుడు తొలుగుతుందో ఏమో చూడలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *