ఎమ్మెల్యే వస్తున్నాడని గ్రామం ఖాళీ…

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తున్న సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోగా..ఎవరైనా గ్రామం నుంచి వెళ్తే కనీసం పట్టించకోలేదని ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని చాలా గ్రామాల్లో నేతలు .. ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు గ్రామాల్లో ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోతున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం శాసన సభ్యడు ఎంఎస్‌ బాబుకుకు చేదు పూతలపట్టు మండలం పేట అగ్రహారంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్లాలని షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఇళ్లకు తాళాలేసి వెళ్లిపోయారు. అధికారులు, వాలంటీర్లు, మందీ మార్బాలంతో వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రామంలో జనం కనిపించకపోవడంతో షాక్‌ కు గురయ్యారు. దీంతో బయటకు వెళ్లలేని ముసలి వాళ్లకు నవరత్నాల పాంప్లెట్లు ఇచ్చి. ..వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకే ఓటేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే మొదటి సారి కాదు. గత వారం క్రితం పూతలపట్టు మండలంలో నిర్వహించిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంకు అమ్మగారిపల్లెలోని ప్రజలు ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రావొద్దని అడ్డుకోవడంతో పాటుగా ఎమ్మెల్యేను నిలదీశారు.. గత నాలుగేళ్ళుగా ఎన్నడూ తన గ్రామంను పట్టించుకోకుండా ఎన్నికల తరుణంలో తమ గ్రామానికి రావడంపై మండిపడ్డారు.. తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు సైతం చేపట్టలేదని, కనీసం తమ గ్రామ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వచ్చినా పట్టించుకోని ఎమ్మెల్యే, తమ గ్రామాల్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌.బాబుపై ప్రజలు ఇలా వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తూండటంత ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.. తరచూ ఎంఎస్‌.బాబును ప్రజలు అడ్డుకోవడంపై జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటుగా,నాయకుకు, కార్యకర్తలు ఆయనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పుకుంటున్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పై సిరియస్‌ అయినట్లు తెలుస్తోంది.. ఎంఎస్‌.బాబును పిలిపించి మరి అగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్ని పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *