శ్రీమది ఆత్మహత్య దుమారం

తమిళనాడులో పన్నెండో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక రాసిన సూసైడ్‌ నోట్‌ కీలకంగా మారింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి స్టాలిన్‌ సీరియస్‌గా తీసుకోవడంతో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇంతకీ బాలిక మృతికి అసలు కారణమేంటి? చెన్నై సవిూపంలోని కళ్ళకూరుచిలో బాలిక ఆత్మహత్య ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న సేలం గ్రామానికి చెందిన శ్రీమది.. ఓ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె హాస్టల్‌లోనే ఉంటోంది. కారణం ఏమిటో తెలియదు. హాస్టల్‌ భవనం విూద నుంచి దూకి శ్రీమది ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల తర్వాత సూసైడ్‌ నోట్‌ దొరికింది. ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌ లో రాసింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ తీవ్రంగా స్పందించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినులపై దాడులను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుమరోవైపు.. విద్యార్థిని మృతదేహానికి రీ` పోస్ట్‌మార్టం చేయాలంటూ మద్రాస్‌ హైకోర్ట్‌ ఆదేశించింది. ఆందోళనలో పాల్గొన్న 108 మందికి 15 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను పోలీసులు విచారించారు. బాలిక మృతికి ఆ స్కూల్‌ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ.. వారితో కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. విద్యాసంస్థకు సంబంధించిన బస్సులతో పాటు పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టేశారు.అనుమానాస్పద స్థితిలో పాఠశాల భవనం పై నుంచి దూకి శ్రీమది ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బాలిక కుటుంబసభ్యులు.. విద్యార్థిని మృతికి స్కూల్‌ యాజమాన్యమే కారణమని ఆరోపించారు. అంతటితో ఆగకుండా వాదనకు దిగారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పార్కింగ్‌ చేసి ఉన్న బస్సులకు నిప్పంటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు. డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *