సబ్‌మెర్సిబుల్ శకలాల్లో మానవ అవశేషాలు..!

అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్‌మెర్సిబుల్ పేలిపోయి అందులోని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించిన యూఎస్ కోస్ట్ గార్డ్ వాటిని పైకి తీసుకొచ్చాయి. శకలాల్లో మానవ అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు వాటిని సేకరించారు. వాటిని వైద్య నిపుణులు పరీక్షించానున్నారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది.ఉత్తర అట్లాంటిక్ ఉపరితలం నుంచి 12,000 అడుగుల దిగువన సముద్రపు అడుగుభాగం నుంచి సబ్‌మెర్సిబుల్ శకలాలను సేకరించి.. నౌకలోని వాటిని న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌కు తీసుకొచ్చారు. “టైటాన్ విపత్తు నష్టానికి దారితీసిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇంకా గణనీయమైన కృషి చేయాల్సి ఉంది. ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా చూసుకోవడంలో సహాయం చేస్తుంది” అని కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“టైటానిక్ శిధిలాల నుండి కేవలం 1,600 అడుగుల (488 మీటర్లు) దూరంలో, దాదాపు 12,500 అడుగుల (3,810 మీటర్లు) నీటి అడుగున, పేలిన టైటాన్ నుండి వచ్చినవిగా భావిస్తున్న శిధిలాలు కనుగొనబడ్డాయి. అనేక US, కెనడియన్ ప్రభుత్వ సంస్థల సహకారంతో కోస్ట్ గార్డ్ నేతృత్వంలో ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది” అని ఆయన తెలిపారు. జూన్ 18 ఓషన్ గేట్ సంస్థకు చెందిన సబ్‌మెర్సిబుల్ లో ఓషన్‌ గేట్ సంస్థ సీఈఓ స్టాక్టన్ రష్‌, పాకిస్థానీ బిలియనీర్‌ షాజాదా దావూద్‌తో పాటు ఆయన కుమారుడు సులేమాన్‌, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమీష్‌ హార్డింగ్‌, ఫ్రెంచ్‌ మాజీ నౌకాదళ అధికారి పాల్‌ హెన్రీ టైటాన్ శిథిలాలను చూడడానికి వెళ్లింది.

అయితే సబ్‌మెర్సిబుల్ సముద్రంలోకి వెళ్లిన గంటన్నర తర్వాత గల్లంతైయింది. వెంటనే సబ్‌మెర్సిబుల్ కోసం కెనడా, యూస్ దళాలలు సెర్చ్ చేపట్టాయి. గురువారం రోజు సబ్‌మెర్సిబుల్ ఉన్నవారు చనిపోయి ఉంటారని అమెరికా కోస్ట్ గార్డు ప్రకటించింది. అయితే సబ్‌మెర్సిబుల్ గల్లంతైన రోజు పేలిపోయినట్లు అమెరికా అధికారులు తెలిపారు. గల్లంతైన కొద్ది క్షణాల్లోనే సౌండ్ వచ్చిందని చెప్పారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *