ఖాళీ భవనాల వివరాలు సేకరిస్తున్న అధికారులు

విశాఖపట్టణం, అక్టోబరు 19
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి డిసెంబర్‌ నాటికి వైజాగ్‌ నుంచి పాలన సాగుతుందని ప్రకటించారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్న జగన్‌, మూడు నెలల తర్వాత అమరావతి నుంచి షిఫ్ట్‌ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంచి ప్రాంతం వెతకమని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు, మధురవాడలోని ఐటీ హిల్స్‌`2పై ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఇటీవలే జగన్‌ వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రావాలంటే పెద్ద సెటప్‌ అవసరం ఉంటుందని, భద్రతాపరమైన ఏర్పాట్లతో పాటు ఉన్నతాధికారులు ఉండటానికి భవనాలు కావాలన్నారు. అన్ని అనుకూలిస్తే డిసెంబరులోనే మకాం మార్చేయనున్నట్లు ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి వైజగ్‌ కు మకాం మార్చేస్తానని ప్రకటించడంతో అధికారులు అవసరమైన ఏర్పాట్ల నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి, సీఎంవోలో కీలక అధికారుల నివాసాలకు అవసరమైన భవనాలను గుర్తించేందుకు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్‌ ఇప్పటికే జిల్లా అధికారులతో పలు సార్లు సమావేశం అయ్యారు. ఏ యే ప్రాంతంలో ఏ యే భవనాలు ఖాళీగా ఉన్నాయి ? ఆ భవనాల విస్తీర్ణం ఎంత ? ఏ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది ? భద్రతాపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై ఐఏఎస్‌ ల కమిటీ వివరాలు రాబడుతోంది. రుషికొండ వద్ద రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదురుగా ఉన్న పర్యాటకశాఖకు చెందిన మూన్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు స్థలంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్లాటినం జూబ్లీ అతిథిగృహంతో పాటు లోపల కొన్ని బంగ్లాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా పూర్తయిన ఖాళీ భవనాలు కొన్ని ఉన్నట్లు తెలిసింది. విమ్స్‌, ఆంధ్ర వైద్య కళాశాలలో కొత్తగా నిర్మిస్తున్న వాటి వివరాలు అధికారులు కలెక్టరుకు అందజేశారు. ఆ వివరాలన్నీ కమిటీకి అందజేసినట్లు సమాచారం. అంతకుముందు కమిటీలోని కీలక అధికారి రుషికొండ మార్గంలో పర్యటించినట్లు తెలిసింది. వీఎంఆర్‌డీఏ కీలక ప్రాజెక్టుల విూద మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సవిూక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన భవనాల విస్తీర్ణం, ప్రస్తుత వినియోగం, ఖాళీ వంటి అంశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో కొత్తగా నిర్మిస్తున్న భవనాలు, వాటికి సంబంధించిన పనులు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు పునరుద్ధరించి అప్పగించడం కష్టమన్నట్లు తెలిసింది. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల ఏర్పాటు కోసం వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీకు చెందిన ఖాళీ భవనాలు, వాణిజ్య సముదాయాల పైనా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ పాలనను విశాఖ నుంచే అందించాలని భావించారు. అది కాస్త డిసెంబర్‌ కు పోస్ట్‌ పోన్‌ అయింది. డిసెంబరు 21న జగన్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఆ రోజన లేదా కొద్దిగా అటూ ఇటుగా విశాఖకు వెళతారని తెలుస్తోంది. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన కేసుపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబరుకు వాయిదా వేసింది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసిన తర్వాతే సీఎం విశాఖకు వెళ్తారన్న వార్తలూ వస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *