ఆస్తి కోసం అత్తా కోడళ్ల మధ్య WWE రేంజులో ఫైటింగ్

రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావని అడిగితే మిత్రుల మధ్య గొడవ పెడతాను, అన్నదమ్ముల మధ్య పగను సృష్టిస్తాను, పచ్చని కాపురంలో నిప్పులు పోస్తాను, బంధువులను దూరం చేస్తాను అని చెప్పిందంట. ఇదొక సామెత మాత్రమే కాదు పచ్చి నిజం. ప్రస్తుతం ఆస్తివివాదాలు పెరిగిపోతున్నాయి. ఆస్తుల కోసం అన్నదమ్ములే శత్రువులుగా మారుతున్నారు. కుటుంబాలు విడిపోతున్నాయి. బంధువులు దూరమవుతున్నారు. చివరకు ఆస్తి వివాదాలతో కోర్టులకు వెళ్లి, వాటి చుట్టూ తిరుగుతూ మానసికంగా క్రుంగిపోతున్నారు.మొత్తంగా ఆస్తి వివాదాలు సృష్టిస్తున్న నష్టం అంతా ఇంత కాదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటికొచ్చింది. ఆస్తి కోసం తన సొంత అత్తపై కోడలు దాడి చేసిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో (Gujarat’s Surat) జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఆస్తి విషయమై అత్తా కోడలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. సోఫాలో కూర్చున్న వృద్దురాలైన తన అత్తపై (mother-in-law) కోడలు (daughter-in-law) దాడికి దిగింది. మీద పడి, జుట్టు పట్టుకోని కొట్టసాగింది. అలాగే తన పళ్లతో కొరికింది. అత్త కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో అక్కడే ఉన్న బాధితురాలి భర్త.. గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కోడలి పిల్లలు సోఫాలో కూర్చొని ఉండడం ఆ వీడియోలో కనిపించింది. కాగా అత్త కోడళ్ల ఫైటింగ్ డబ్ల్యూడబ్ల్యూఈని (WWE ) తలపించిందనే చెప్పుకోవాలి.

కాగా బాధితురాలు కుమారుడు ఈ ఘటనను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందుతురాలైన కోడలు ఇప్పటికే ఒక ప్రాపర్టీని తన పేరుపైకి మార్చుకుందని, ప్రస్తుతం గ్రామంలో ఉన్న మరో ప్రాపర్టీని కూడా తన పేరుపైకి మార్చాలని కోరుతుందని, అదే ఈ గొడవకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా నిందితురాలైన కోడలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్త, అత్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *