ఏటీ అగ్రహారం… పొయో… ఫాతిమానగర్‌ వచ్చే

గుంటూరులో ఏటీ ఆగ్రహారం పేరును ఫాతిమాపురంగా మార్చిన వ్యవహారం వివాదాస్పదమవుతోంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగి…అగ్రహారం గా ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా పేరు మారుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గుంటూరుతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఏ.టీ. అగ్రహారం సుపరిచితమే…ఏ.టీ. అగ్రహారం మూలాలు గుంటూరు నగరంతో అంతగా ముడి పడి ఉన్నాయి..వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం ఆనంద త్రిదండి అగ్రహారం కాల క్రమేణ ఏ.టీ. అగ్రహారంగా మారింది. గుంటూరు పట్టణం అంతగా విస్తరించని రోజులలో పట్టణానికి దూరంగా ఏ.టీ. అగ్రహారం రూపు దిద్దుకుంది. గుంటూరు నగరం వేగంగంగా అభివృద్ధి చెందటంతో.. ఏటీ అగ్రహారం పట్టణ నడిబోడ్డుగా మారింది..మొత్తం 21 లైన్లతో శరవేగంగా అభివృద్ధి చెందింది.ఈ ప్రాంతంలో 95 శాతం హింధువులు 5 శాతం తతిమా వర్గాల వారు ఉంటారు..హిధువులలలో వివిధ కులాల వారు ఉన్నపట్టికి ఏ.టీ. అగ్రహారం వాసులమని చెప్పుకొవడం ఈ ప్రాంత వాసులు గౌరవంగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు…కానీ ఈ ప్రాంత వాసులు ఒక్క సారిగా మునిసిపల్‌ కార్పోరేషన్‌ తీరుపై, అధికార పార్టీ నాయకుల వ్యవహారంపై మండి పడుతున్నారు. ఏ.టీ. అగ్రహారం పేరు మార్పును వ్యతిరేకిస్తూ అగ్గి విూద గుగ్గిలం అవుతున్నారు. ఏ.టీ అగ్రహారంగా సుపరిచితమైన ప్రాంతానికి పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఏటీ అగ్రహారం పేరు మార్పును బీజేపీ తీవ్ర స్థాయిలో కండిరచింది. ఓ మతం వారికి ప్రజాధనంతో జీతాలిస్తారుని.. ఎంపీ ల్యాడ్స్‌తో ఓ మత ప్రార్థనలకు నిర్మాణాలు చేస్తారని .. ఇప్పుడు కాలనీలకు పేర్లు మార్చేస్తున్నారని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ కొన్ని మతాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారని.. మత మార్పిళ్లకు కావాల్సినంత స్వేచ్చ ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాలనీలకు కాలనీలననే మతం మార్చేస్తున్నాని మండిపడ్డారు. రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారాన్ని ఫాతిమాపురంగా ఎలా మారిందని విష్ణువర్ధన్‌ రెడ్డి , సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజాగ్రహంతో కార్పొరేషన్‌ అధికారుల దిద్దుబాటు చర్యలకు సన్నద్ధమయ్యారు. .నగరపాలక సంస్థ కమిషనర్‌ చెరుకూరి కీర్తీ ప్రస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు. .స్వచ్చ సర్వేక్షణ్‌ లో బాగంగా నోటిఫైడ్‌ ప్రాంతాలలో నేమ్‌ బోర్డులను ఏర్పటు చేశామని తెలిపారు. పక్క ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిన బోర్డు పొరపాటున ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసారని తెలిపారు. కుల, మతాలు రెచ్చగొట్టే విధంగా తాము ప్రవర్తించమని వివరించారు.. సంఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని కోరామన్నారు..నివేదిక ప్రకారం చర్యలుంటాయన్నారు..ప్రజల మనోభావాలకు భిన్నాంగా కార్పోరేషన్‌ చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు..తక్షణమే వివాదానికి కారణమైన నేమ్‌ బోర్డును తొలగిస్తామన్నారఒక పథకం ప్రకారమే పేరు మార్పునకు శ్రీకారం చుట్టారని స్థానికులు అంటున్నారు. .నెల రోజుల క్రితమే బోర్డు తొలగించ మని రిప్రజెంటేషన్‌ ఇచ్చినా పట్టించుకొని అధికారులు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారో అర్థమైదని చెబుతున్నారు. .జీరో లైన్‌ లో ఏర్పాటు చేయవలసిన బోర్డ్‌ రెండవ లైన్‌ లో ఏర్పాటు చేయడంలోనే ఆతర్యం ఉందని…కొంత కాలం ఫతిమా నగర్‌ బోర్డు అక్కడ ఉంచి తర్వాత సర్వే చేయించి ఆతర్వాత నోటిఫైడ్‌ చేయిస్తే రికార్డు లలో పేరు మర్పు జరుగుతుంది. ఆ ప్లాన్‌ తోనే మొత్తం స్కెచ్‌ వేశారని స్థానికులలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తునారని తెలియ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *